మీవి పెట్టి తిప్పండి.. బాగా జ్యూస్ వస్తుంది.. ఛీకొట్టిన సామ్రాట్.. భోరుమన్న తేజస్వి

By Rajababu

Recommended Video

మీవి పెట్టి తిప్పండి.. బాగా జ్యూస్ వస్తుంది

తెలుగులో బిగ్‌బాస్2 షో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. బిగ్‌బాస్ సూచించే టాస్క్‌లు సరదాగా సాగిపోతున్నాయి. అయితే సెలబ్రిటీల బిహేవియర్ మాత్రం ఇంకా ప్రేక్షకులకు రుచించడం లేదు. గతంతో పోల్చుకుంటే మూడో వారంలో కొంత మెరుగ్గానే కనిపిస్తున్నది. 16వ రోజు ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకొన్నాయి. తేజస్విని సామ్రాట్ ముగ్గులోకి దించడం, సంచాలకులుగా వ్యవహారిస్తున్న భానుశ్రీ కంటతడి పెట్టుకోవడం, అలాగే సామ్రాట్ ఇంట్లో దురుసుగా ప్రవర్తించి అద్దం పగలకొట్టడం లాంటి అంశాలు షోలో కనిపించాయి.

చెరుకు రసం టాస్క్

చెరుకు రసం టాస్క్

మంగళవారం నాటి ఎపిసోడ్‌లో చెరుకు రసం తీసే బాధ్యతను ఇంటి సభ్యులకు అప్పగించారు. ఎల్లో, గ్రీన్‌ టీములుగా సెలబ్రిటీలను విభజించారు. ఎల్లో టీమ్‌లో తేజస్విని, సునైన, అమిత్, కౌశల్ ఉండగా, గ్రీన్ జట్టులో సామ్రాట్, కిరిటీ, గీతా మాధురి తదితరులు ఉన్నారు. రెండు గంటల్లో చెరుకు రసం మిషన్ ద్వారా 50 బాటిల్స్ జ్యూస్ తీయాలని టాస్క్ విధించాడు బిగ్‌బాస్.

సెలబ్రిటీల నానా హంగామా

సెలబ్రిటీల నానా హంగామా

చెరుకు గడల కోసం ఇంటి సభ్యులు విపరీతంగా పోట్లాడారు. ఒకర్నికొరు తోసుకొన్నారు. నెట్టివేసుకొన్నారు. కింద పడితే గుంజుకెళ్లారు. ఆధిపత్యం ప్రదర్శించడానికి సెలబ్రిటీలు నానా హంగామా చేశారు. ఈ క్రమంలో సామ్రాట్, తేజస్వి మధ్య ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొన్నది.

 తేజస్వి అసభ్య వ్యాఖ్యలు

తేజస్వి అసభ్య వ్యాఖ్యలు

మిషన్‌లో చెరుకు గడలు పెట్టి ఎంత తిప్పినా రసం రావడం లేదు అని తేజస్వితో సామ్రాట్ చెప్పుకొన్నాడు. అందుకు సమాధానంగా ‘మీవి పెట్టి తిప్పండి.. బాగా జ్యూస్ కారుతుంది' అని తేజస్వి అన్నారు. తేజస్వి అసభ్యంగా వాడిన మాటలతో సామ్రాట్ హర్ట్ అయ్యాడు.

తేజస్వికి సామ్రాట్ చీదరింపు

తేజస్వికి సామ్రాట్ చీదరింపు

టాస్క్‌లో విరామం సందర్భంగా సామ్రాట్ చేతిని తేజస్వి పట్టుకొనేందుకు ప్రయత్నించింది. అయితే తేజస్విని చీదరించుకొనే విధంగా చేతిని సామ్రాట్ విదిలించుకోవడం జరిగింది. దాంతో తేజస్వి షాక్ తిన్నది. వెంటనే తన బెడ్ మీదకు వెళ్లి భోరున విలపించింది.

బూతులు అలా వచ్చేస్తాయి

బూతులు అలా వచ్చేస్తాయి

తేజస్వి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తనీష్, సామ్రాట్ ఆమె వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉద్దేశపూర్వకంగా తాను ఆ మాటలు అనలేదు. ఏదో అలా వచ్చేశాయి. అప్పుడప్పుడు నా నోటి వెంట బూతులు అలా వచ్చేస్తాయి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తేజస్వి చెప్పుకొన్నారు.

అసభ్యంగా తేజస్వి మదివాడ

అసభ్యంగా తేజస్వి మదివాడ

తనీష్, సామ్రాట్ బుజ్జగించడంతో తేజస్విని ఏడుపు ఆపేసింది. సామ్రాట్‌ను కౌగిలించుకొని యధావిధిగా మారిపోయింది. గతవారం నాని వచ్చిన సందర్భంగా ఇంటిలో అసభ్యకరమైన వ్యక్తి ఎవరు అంటే తేజస్విని అని రోల్ రైడా చెప్పిన సంగతి తెలిసిందే. తాజా సంఘటనతో తేజస్విని అసభ్యంగా మాట్లాడుతారని స్పష్టమైంది.

తేజస్వికి దగ్గరయ్యేందుకు సామ్రాట్

తేజస్వికి దగ్గరయ్యేందుకు సామ్రాట్

ఇదిలా ఉండగా, తేజస్వినికి సామ్రాట్ చేరువయ్యేందుకు నానా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. మాటలతో మభ్యపెట్టేందుకు తన తెలివి తేటలను ప్రదర్శిస్తున్నాడు. నీవంటే నాకు చాలా ఇష్టం.. అందుకే సెన్సిటివ్‌గా బిహేవ్ చేస్తున్నాను అని తేజస్విని సామ్రాట్ ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు సమాధానంగా మనం కలిసి కేవలం 15 రోజులే అవుతున్నది. అది గుర్తుంచుకో అని తేజస్విని చురకలు అంటించింది.

భానుశ్రీ కంటతడి

భానుశ్రీ కంటతడి

ఇక, 50 బాటిళ్లలో చెరుకు రసం తీసే టాస్క్‌లో గ్రీన్ టీమ్ సభ్యులు నీళ్లు కలపడం వివాదంగా మారింది. గణేష్, గీతా మాధురి, శ్యామల చెరుకు రసంలో నీళ్లు కలపడాన్ని సంచాలకులు భానుశ్రీ పసిగట్టింది. ఆ వ్యవహారంపై ఇంటిసభ్యులపై భానుశ్రీ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో శ్యామల, భానుశ్రీ మధ్య కొంత గొడవ చోటుచేసుకొన్నది. దాంతో భానుశ్రీ కంటతడి పెట్టుకొన్నది.

విజేతగా ఎల్లో టీమ్

విజేతగా ఎల్లో టీమ్

చెరుకు రసం టాస్క్‌లో బిగ్‌బాస్ నిబంధనలు ఉల్లంఘించి నీళ్లు కలిపినందుకు గాను ఆ పనిని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ తర్వాత ఎల్లో టీమ్‌ను విజేతగా ప్రకటించారు. విజయం సాధించిన ఎల్లో జట్టు సభ్యులు ఆనందంతో గంతులేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X