twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేజస్వి, సామ్రాట్ ఫుల్ రొమాన్స్.. బిగ్‌బాస్‌2లో ఆ సీన్ రిపీట్

    By Rajababu
    |

    Recommended Video

    తేజస్వి, సామ్రాట్ ఫుల్ రొమాన్స్

    గత కొద్దికాలంగా ఉలుకు పలుకు లేకుండా సాగుతున్న బిగ్‌బాస్2 రియాలిటీ షోలో కొంత సందడి మొదలైంది. మూడో వారానికి చేరుకొన్న ఈ షో 16వ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి. తెలుగు బిగ్‌‌బాస్ హోస్ట్ నాని ఇచ్చిన ఝలక్‌తో హౌస్‌లో సెలబ్రిటీ కొంత దారికి వచ్చినట్టే కనిపిస్తున్నారు. విభేదాలు పరిష్కరించుకొని సెలబ్రిటీలు ఒకర్నొకరు స్నేహభావంతో పలుకరించుకోవడం కనిపించింది.

    ఫ్రెండ్లీ వాతావరణం

    ఫ్రెండ్లీ వాతావరణం

    గతవారం కౌశల్‌తో కిరిటీ దురుసుగా ప్రవర్తించడం బిగ్‌బాస్ హౌస్‌లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తన తప్పును సరిదిద్దుకోవడానికి కిరీటీ క్షమాపణలు కోరడంతో కొంత సహృద్బావ వాతావరణం కనిపించింది. అలాగే తనీష్, కౌశల్ కౌగిలించుకోవడం, దీప్తి సునైనా, భానుశ్రీ, దీప్తి, శ్యామల అప్యాయతతో మాట్లాడుకోవడం లాంటి అంశాలతో హౌస్‌లో వాతావరణం మెరుగుపడింది.

    సామ్రాట్, తేజస్వి రొమాన్స్

    సామ్రాట్, తేజస్వి రొమాన్స్

    మూడోవారంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో తేజస్వి, సామ్రాట్ రెడ్డి మధ్య రొమాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటి రోజు నుంచే వారి మధ్య కెమిస్ట్రీ ఇతర సెలబ్రిటీలకు భిన్నంగా కనిపించింది. తాజాగా సోమవారం ఎపిసోడ్‌లో రొమాన్స్ శృతిమించింది. ఇతర సెలబ్రిటీలకు దూరంగా ఉండి గుసగుసలాడుకోవడం వారి మధ్య కొత్తగా అనిపించింది.

    సామ్రాట్ గుండెలపై

    సామ్రాట్ గుండెలపై తేజస్విని వాలిపోవడంతో కొందరు అవాక్కయ్యారు. అంతేకాకుండా సామ్రాట్‌కు తేజస్విని తినిపించడం కూడా అందరి అనుమానాలకు బలం చేకూరేలా చేసింది. తేజస్వి వెంటపడటం వారి మధ్య పెరిగిన ఆకర్షణకు సాక్ష్యంగా నిలిచింది.

    వారి కెమిస్ట్రీ అదిరింది

    నీతో ఒక మాట చెప్పాలని సమ్రాట్ ఊరించడం.. ఏ చెప్పాలనుకొన్నవాని ఆసక్తిగా తేజస్వి ప్రయత్నించడం వారి కెమిస్ట్రీకి అద్దం పట్టింది. రానున్న రోజుల్లో వారి మధ్య జరుగుతున్న రొమాన్స్‌తో ప్రేక్షకులకు కొంత అనుభూతి కలుగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    శివబాలాజీ, హరితేజ సీన్ రిపీట్

    శివబాలాజీ, హరితేజ సీన్ రిపీట్

    బిగ్‌బాస్1 షోలో ఇలాంటి ఆరోగ్యకరమైన రొమాన్స్ హరితేజ, శివబాలాజీ మధ్య కనిపించింది. కాకపోతే తమ హద్దుల్లో ఉండి వారు ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. హరితేజ, శివబాలాజీ సీన్ మళ్లీ రిపీట్ అవుతుందనే అభిప్రాయం కలుగుతున్నది.

    English summary
    Bigg Boss 2 Telugu Day 4 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Samart Reddy become first captain for bigg boss2 season. Now Samrat Reddy, Tejaswi romance become hot topic in the show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X