అయ్యో పాపం అనుకొన్న కౌశల్.. షాకిచ్చిన గణేష్.. ఏమిటో వింత ప్రవర్తన!
బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమంలో 52వ రోజు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొన్నది. కెప్టెన్ టాస్క్ కోసం జరిగిన ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచలేకపోయిన గణేష్, గీతా మాధురిని జైల్లో పెట్టారు. అయితే తన వద్ద నున్న జైల్ ఫ్రీ పవర్ కార్డును ఉపయోగించాలని కౌశల్ నిర్ణయించుకొన్నాడు. అయితే పాపం అని ఏదో సహాయం చేయాలనుకొన్న కౌశల్‌కు గణేష్ షాక్ ఇవ్వడాన్ని అత్యధిక సంఖ్యంలో ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Recommended Video


జైలుకు వెళ్లిన గణేష్
కెప్టెన్ టాస్క్ ఎంపిక కోసం పోటీపడిన గణేష్ సరైన ఫెర్హార్మెన్స్ ఇవ్వకపోవడంతో బిగ్‌బాస్ జైల్లో పెట్టారు. దాంతో తన వద్ద పవర్‌ను ఉపయోగించి గణేష్‌ను జైలు నుంచి విడిపిస్తానని బిగ్‌బాస్‌కు కౌశల్ విన్నవించుకొన్నాడు. కౌశల్ విన్నపాన్ని ఆమోదించి గణేష్‌కు జైలు విముక్తి కలిగించాలని సూచించాడు.

విముక్తి కలిగించిన కౌశల్
కౌశల్ తీసుకొన్న నిర్ణయాన్ని కొంత మంది సభ్యులు అభినందించగా.. మరికొందరు పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలో గణేష్ వద్దకు కౌశల్ వెళ్లి .. నా వద్ద ఉన్న పవర్‌తో నిన్ను జైలు నుంచి విడిపించాలని అనుకొన్నాను. బిగ్‌బాస్ కూడా అనుమతి ఇచ్చాడు అని చెప్పాడు.

కౌశల్‌కు గణేష్ షాక్
కౌశల్ తీసుకొన్న నిర్ణయాన్ని గణేష్ అభినందించకపోవడం చర్చనీయాంశమైంది. నీవు నీ పవర్‌ను ఉపయోగించే ముందు నన్ను ఓసారి అడిగితే బాగుండు. నాకు జైల్లోనే ఉండటం నచ్చింది. అనవసరంగా నీ ఛాన్స్‌ను వేస్ట్ చేశావు. మరోసారి ఎవరికైనా పనికి వచ్చేది కాదా అని గణేష్ అనడం కౌశల్‌కు షాక్ గురిచేసింది.

కౌశల్‌తో గణేష్ వాగ్వాదం
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫర్వాలేదు అని కౌశల్ నచ్చచెప్పే ప్రయత్నం చేయగా.. నాకు జైలులో ఉండాలన్నది కోరిక అని గణేష్ అన్నాడు. నీవు గతంలో నాకు జైలులో ఉండటం ఇష్టం లేదు అని చెప్పడం వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని చెప్పిన విషయానికి గణేష్ కన్విన్స్ కాలేదు.

చురుకుగా కౌశల్ ఆర్మీ
ఇదిలా ఉండగా, కౌశల్ తరపున సోషల్ మీడియాలో ఓ ఆర్మీ చాలా చురుకుగా పనిచేస్తున్నది. ఇటీవల నూతన్ నాయుడు తిరిగి ఇంటిలోకి వెళ్లడానికి కౌశల్ ఆర్మీ తన వంతు సహాయాన్ని అందించింది. ప్రస్తుతం కౌశల్‌తో పెట్టుకొనే వారు ఇంట్లో ఉండలేరు అనే సెంటిమెంట్ కొనసాగుతుంది. అయితే ఆ సెంటిమెంట్‌ను బాబు గోగినేని బ్రేక్ చేస్తాడా లేదా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











