అమిత్‌కు ‘పవర్’ షాకిచ్చిన కమల్.. లోకనాయకుడికి బాబు గిఫ్ట్

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Day 50 Highlights Kamal Hassan Enters Into The Show

సాధారణంగా శని, ఆదివారాల్లోనే బిగ్‌బాస్‌లోకి హోస్ట్‌గా వస్తారు. కానీ నాని శుక్రవారమే కనిపించి కమల్ సార్ వస్తున్నాడని ఓ శుభవార్త చెప్పి వెళ్లాడు. బిగ్‌బాస్‌2లోని 54వ రోజు ఇంట్లోకి విలక్షణ నటుడు కమల్ హాసన్ రాకతో సభ్యులు చాలా ఆనందంగా గడిపారు. కమల్‌ను చూడగానే హౌస్‌మేట్స్ ఉద్వేగంలో ఊగిపోయారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండానే శుక్రవారం ఎపిసోడ్ సరదాగా గడిచిపోయింది. మోటర్ బైక్ టాస్క్‌తో ఇంటి సభ్యులు తమ ప్రతిభా పాటవాలను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించారు.

గబ్బర్ సింగ్ పాటకు డ్యాన్స్

గబ్బర్ సింగ్ పాటకు డ్యాన్స్

శుక్రవారం ఉదయమే లేచి గబ్బర్ సింగ్ పాటకు డ్యాన్స్ చేసి రొటీన్ పనుల్లో మునిగిపోయారు. అంతలోనే నాని వచ్చి వారికి షాక్ ఇచ్చారు. తాను ఎందుకు వచ్చానో చెప్పి ఆయన నిష్క్రమించారు. ఆ తర్వాత కమల్ ఇంట్లోకి ప్రవేశించారు.

ఇంట్లోకి కమల్ హాసన్

ఇంట్లోకి కమల్ హాసన్

ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సభ్యుడికి మిలటరీ టీ షర్టు ఇవ్వడంతో వాటిని ధరించి కమల్‌తో సంభాషించారు. బాబు గోగినేని తాను హేతువాది అని చెప్పడంతో మాది అంతా ఒక మైండ్ సెట్ అని కమల్ పేర్కొన్నాడు. ఆ తర్వాత కమల్‌కు బాబు గోగినేని ఓ టీషర్ట్ బహుకరించాడు. నూతన్ నాయుడు సామాజిక న్యాయం అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.

కాళ్లు మొక్కి కమల్ ఆశ్వీరాదం

కాళ్లు మొక్కి కమల్ ఆశ్వీరాదం

కమల్ వస్తుండగానే ఇంటి సభ్యులు పరుగెత్తికెళ్లి కౌగిలించుకొన్నారు. కొందరు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకొన్నారు. ఒక్కొక్కరిని పలకరించి కమల్ మాట్లాడారు. ఆ తర్వాత విశ్వరూపం2 సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించి ఆ సినిమా ప్రమోషన్‌ను చేశారు. ఆ తర్వాత విశ్వరూపం2 సినిమా బృందం ఇంట్లోకి ప్రవేశించింది. హీరోయిన్ పూజా కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, సినిమాటోగ్రాఫర్ శివదత్తా ఇంట్లోకి ప్రవేశించారు.

అమిత్‌కు పవర్ కార్డు

అమిత్‌కు పవర్ కార్డు

తాను ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో ఇంటి సభ్యుల్లో ఒకరికి ఎలిమినేషన్‌కు గురికాకుండా రెండు వారాలపాటు ఇంట్లో ఉండేందుకు ఓ పవర్ కార్డు ఇస్తానని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రాష్ట్రాలు, భాషలు ఉన్నా భారతీయులుగానే భావించాలి. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అమిత్ తివారి తెలుగు నేర్చుకొని టాలీవుడ్‌లో రాణిస్తున్నందున అతడికి నేను పవర్ కార్డు ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఎమోషన్‌తో అమిత్

ఎమోషన్‌తో అమిత్

ఇంటి సభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడిన తర్వాత కమల్ ఇంటి నుంచి నిష్క్రమించారు. కానీ కమల్ వదిలిన మెమొరీస్ మాత్రం చాలా సేపు సెలబ్రిటీలను వెంటాడాయి. అమిత్ మాత్రం కమల్ ఇచ్చిన షాక్‌ నుంచి చాలా సేపు తేరుకోలేకపోయారు. కమల్ ప్రేమకు పాత్రుడైనందుకు బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఉద్వేగానికి లోనయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X