twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌశల్‌పై రెచ్చిపోయిన తనీష్.. బిగ్‌బాస్‌లో 100 రోజు మాటల యుద్ధం.. బిగ్‌బాస్ వార్నింగ్!

    |

    Recommended Video

    కౌశల్‌పై రెచ్చిపోయిన తనీష్.. బిగ్‌బాస్‌లో 100 రోజు మాటల యుద్ధం!

    బిగ్‌బాస్ ఇంట్లో గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ మరోసారి ఇంటి సభ్యుల మధ్య చిచ్చు రేపింది. కెప్టెన్సీ టాస్క్ రూల్స్ అర్ధం చేసుకోవడంలో ఇంటి సభ్యులతో సహా, సంచాలకుడు విఫలమయ్యారని హోస్ట్ నాని వీకెండ్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే విషయం వీకెండ్ తర్వాత తీవ్ర వివాదానికి కారణమైంది. బిగ్‌బాస్ తెలుగు షో 100 రోజున రచ్చ రచ్చగా మారింది. ఆదివారం ఇంట్లో జరిగిన విషయాలు ఏమిటంటే..

    నాని అంటే గౌరవం

    నాని అంటే గౌరవం

    కెప్టెన్సీ టాస్క్‌ను నాని తప్పుపట్టడంపై కౌశల్ స్పందించాడు. నానిపై గౌరవం కారణంగా నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ టాస్క్‌లో నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి అంటూ ఇంటి సభ్యులను కౌశల్ నిలదీశాడు.

    సంచాలకుడిగా కౌశల్ డిజాస్టర్

    సంచాలకుడిగా కౌశల్ డిజాస్టర్

    కౌశల్ స్పందనకు రోల్ రైడా జవాబు ఇస్తూ .. మీరు ఇప్పటికీ కరెక్టే అని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. అందుకు బిగ్‌బాస్ ఇచ్చిన రూల్స్ కరెక్ట్‌గా ఫాలో అయ్యాను అని కౌశల్ అన్నాడు. దానిపై తనీష్ స్పందిస్తూ.. సంచాలకుడిగా కౌశల్ డిజాస్టర్ అని నాని చెప్పాడనే విషయాన్ని వెల్లడించారు.

    గీత మాధురి జోక్యం

    గీత మాధురి జోక్యం

    కెప్టెన్సీ టాస్క్ కోసం రాసిన రూల్స్ తప్పని అంటే మేము బిగ్‌బాస్‌ను తిట్టినట్టు. లేదా మీరు తప్పు అంటే బిగ్‌బాస్ తిట్టినట్టు కాదు అని గీతా మాధురి అన్నారు. దాంతో నేను మీమ్మల్ని తిట్టలేదు కదా అని కౌశల్ అనడంపై వివాదం సీరియస్ అయ్యింది. సంచలకుడిగా నేను గేమ్ ఆడాను అని కౌశల్ అనడంపై వివాదం మరింత ముదిరింది.

    నేను శిక్షకు రెడీ

    నేను శిక్షకు రెడీ

    ఒకవేళ నేను తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి రెడీ అని కౌశల్ అనడంంతో తనీష్, గీతా మాధురి రెచ్చిపోయారు. మేము శిక్ష అనుభవిస్తామని చెబితే తప్పు.. మీరంటే తప్పు కాదా అని తనీష్ నిలదీశాడు.

    ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ వార్నింగ్

    ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ వార్నింగ్

    బిగ్‌బాస్ ఇంట్లో వివాదం ముదరడంతో బిగ్‌బాస్ రంగంలోకి దిగాడు. కౌశల్‌, గీతా, తనీష్ అలా ఇంటి సభ్యులందరికీ బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులెవ్వరూ రూల్స్ పాటించడం లేదని బిగ్‌బాస్ తీవ్రంగా మందలించడం తాజా ప్రోమోలో చూపించారు. అసలు ఇంట్లో ఏం జరిగిందనే విషయం ఈ రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో స్పష్టమవుతుంది.

    English summary
    Bigg Boss2 Telugu 100 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 99 days of the game, Amit Tiwari Eliminated from the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X