Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కౌశల్ కూతుర్ని వివాదంలోకి లాగిన గీతా.. బిగ్‌బాస్ కాబట్టి వదిలేస్తున్నా.. బయట సంగతి చూస్తా.. తనీష్
Recommended Video
బిగ్‌బాస్‌లో 101వ రోజు గందరగోళంగా ముగిసింది. సెప్టెంబర్ 20న నా కూతురు బర్త్ డే.. కాబట్టి ఓ ఐదు నిమిషాలు పంపిస్తే.. కేక్ కట్ చేసి వెంటనే తిరిగి పంపిస్తాను అని నానికి గత ఆదివారం కౌశల్ చేసిన రిక్వెస్ట్‌పై గీతా, సామ్రాట్, దీప్తి, రోల్ రైడా, తనీష్ చర్చించుకొన్నారు. కౌశల్ కూతురు విషయం పెద్ద వాగ్వాదానికి దారి తీసింది. ఇంట్లో ఏం జరిగిందంటే..
కౌశల్ కూతురు ఇంట్లోకి వస్తే
కౌశల్ కూతురు ఇంట్లోకి వస్తే ఆయనకు పాజిటివ్ అవుతుంది. కౌశల్‌కు మానసికంగా బూస్టింగ్ అవుతుంది అని గీత టాపిక్ లేవనెత్తింది. ఆ మాటలు విన్న కౌశల్.. నేను లేనప్పుడు నా గురించి, లేదా నా కూతురు గురించి మాట్లాడవద్దు. కూతురు వస్తే బూస్టింగ్ అవుతుందని ఎలా అంటారు అని నిలదీశారు.
ఆవేశంతో ఊగిన కౌశల్
కౌశల్ కూతురు బూస్టింగ్ అంశాలపై కౌశల్, ఐదుగురు ఇంటి సభ్యుల మధ్య భారీగా మాటలు విసురుకొన్నారు. కౌశల్‌పై ఇంటి సభ్యులందరూ మాటలతో దాడికి దిగడంతో కౌశల్ ఆవేశంతో ఊగిపోయాడు. దాంతో ఐదుగురు సభ్యులపై అరిచాడు.
కుక్కల మాదిరిగా ఎందుకు
నేను ఒక్కడినే మాట్లాడితే పదిమంది నాపై కుక్కల మాదిరిగా ఎందుకు పడుతారు అని కౌశల్ కోపంతో ఊగిపోయారు. దాంతో కౌశల్‌పై సామ్రాట్, తనీష్, గీతా, రోల్ రైడా ఆవేశంగా పైకి దూసుకెళ్లారు. అరేయ్.. మాటలు మంచిగా రానివ్వు రా అంటూ చేతి వేలిని చూపిస్తూ కౌశల్‌పై మాటలు తీవ్రస్థాయిలో సామ్రాట్ వదిలాడు.
బిగ్‌బాస్ కాబట్టి వదిలేస్తున్నా
ఇక తనీష్ అయితే బిగ్ బాస్ ఇల్లు కాబట్టి వదిలేస్తున్నాను. గేట్ బయటకు వెళ్లిన తర్వాత నీ అంతు చూస్తాను. బయటకు వెళ్లాక నేనేంటో చూపిస్తా. నీ అంతు చూస్తానని బెదిరించే విధంగా కౌశల్‌పై తనీష్ విరుచుకుపడ్డాడు. కౌశల్‌పై తనీష్ తీవ్ర స్థాయిలో మాటలు వదిలాడు.
నేను లేకుండా నా ఫ్యామిలీపై
నాపై, నా ఫ్యామిలీపై మీరు అనవసరంగా మాటల వదలడం వల్ల నేను అలా అనాల్సి వచ్చింది. మిమ్మల్ని నేను కుక్కలు అని అనలేదు. కేవలం ఉదాహరణగా మాత్రమే తీసుకొన్నాను. మీరు కుక్కలైతే దానిని మీరు అన్వయించుకోండి అని కౌశల్ క్లారిటీ ఇచ్చారు. కౌశల్ మాటలతో రోల్ రైడా కన్నీరు పెట్టుకొన్నారు.
ఫినాలే టాస్క్‌లో సామ్రాట్
ఇంటిలో ఈ వివాదం ముగిసిన తర్వాత బిగ్‌బాస్ రేస్ టు ఫినాలే టాస్క్‌ను ప్రారంభించాడు. తనీష్, సామ్రాట్, దీప్తి నల్లమోతు ఇసుకను కాపాడుకొనే టాస్క్‌ను కొనసాగించారు. తనీస్, సామ్రాట్ ఇసుక కంటైనర్లలోని ఇసుకను పారేసేందుకు కౌశల్ ప్రయత్నించాడు. చివరకు ఈ పోటీలో సామ్రాట్ విజేతగా నిలిచాడు.
ఫినాలే టాస్క్ లెవెల్ 2
గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో రేస్ టు ఫినాలే టాస్క్ రెండో లెవల్ ప్రారంభమవుతుంది. ఈ పోటీలో రోల్ రైడా, సామ్రాట్ తలపడుతారు. ఈ టాస్క్‌లో కోడిగుడ్లను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ కోడిగుడ్లు కాపాడుకొంటారో వారు ఫైనల్‌కు నేరుగా వెళుతారు.