»   » బిగ్‌బాస్ నుంచి దీప్తి సునైన అవుట్.. స్విమ్మింగ్ పూల్‌లో దూకిన తనీష్.. విషాదంలో ఇంటి సభ్యులు!

బిగ్‌బాస్ నుంచి దీప్తి సునైన అవుట్.. స్విమ్మింగ్ పూల్‌లో దూకిన తనీష్.. విషాదంలో ఇంటి సభ్యులు!

By Rajababu A
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Bigg Boss Season 2 Telugu : Episode 70 Highlights...!

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 70వ రోజున ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఎలిమినేషన్‌కు ముందు గీత గోవిందం దర్శకుడు పరుశురాం, హీరో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత దీప్తి సునైనతో సీక్రెట్ టాస్క్‌ను నానీ, విజయ్, పరుశురాం పర్యవేక్షణలో జరిపించారు. టాస్క్‌లో భాగంగా గీతా, సామ్రాట్‌ను లడ్డుతో కొట్టింది. నిద్రిస్తున్న అమిత్‌పై నీళ్లు పోసింది. ఈ వారం దీప్తి సునైనా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా ఏమి జరిగిందంటే..

    బిగ్‌బాస్‌లోకి విజయ్ దేవరకొండ

    బిగ్‌బాస్‌లోకి విజయ్ దేవరకొండ

    నాని వేదికపైకి రాగానే విజయ్ దేవరకొండ, పరుశురాంను వేదికపైకి పిలిపించారు. ఆ తర్వాత సినిమా గురించి కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత విజయ్ వచ్చిన సందర్భంగా కొత్తగా ఓ గేమ్ ఆడుదామని దీప్తి సునైనాతో సిక్రెట్ టాస్క్ ఆడించారు.

    దీప్తి సునైనాతో సీక్రెట్ టాస్క్

    దీప్తి సునైనాతో సీక్రెట్ టాస్క్

    సీక్రెట్ టాస్క్‌లో భాగంగా దీప్తి సునైనకు ఫోన్, బ్లూటూత్ ఇచ్చారు. చెవిలో బ్లూటూత్ పెట్టుకొని నాని, విజయ్ దేవరకొండ చెప్పినట్టు దీప్తి సునైనా చేసింది. తనీష్‌ను స్విమ్మింగ్ పూల్‌లో నెట్టడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత రోల్ రైడాను స్విమ్మింగ్ పూల్‌లోకి తోయడానికి చేసిన ప్లాన్ కూడా బెడిసి కొట్టింది.

    సీక్రెట్ టాస్క్‌లో సునైన కష్టాలు

    సీక్రెట్ టాస్క్‌లో సునైన కష్టాలు

    సీక్రెట్ టాస్క్‌లో భాగంగా తనీష్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి దూకమని చెప్పగా ఎందుకు అని అడిగాడు. ఎలిమినేషన్‌ కాకుండా ఉండటానికి అని దీప్తి చెప్పగా వెంటనే స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాడు. ఆ తర్వాత దీప్తి సునైనాతో సీక్రెట్ టాస్క్ అని చెప్పించారు. విజయ్ దేవరకొండతో ఇంటి సభ్యులు మాట్లాడిన తర్వాత ఇంకా ఇంకా పాటను ప్లే చేస్తే అంతా డ్యాన్స్ చేశారు.

    దీప్తి సునైనా ఎలిమినేషన్ ఇలా

    దీప్తి సునైనా ఎలిమినేషన్ ఇలా

    చివరగా నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదట రోల్ రైడా ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత సునైనాను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. పూజా రామచంద్రన్‌ను ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించినట్టు నాని వెల్లడించారు. పది నిమిషాల్లో వస్తువులు ప్యాక్ చేసుకోమని చెప్పడంతో దీప్తి అందుకు సిద్దమైంది.

    విషాదంలో ఇంటి సభ్యులు

    విషాదంలో ఇంటి సభ్యులు

    దీప్తి సునైనా ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అందరూ దీప్తిని కౌగిలించుకొని బాధను పంచుకొన్నారు. తనీష్ కంటనీరు పెట్టుకొని ఉద్వేగానికి గురయ్యాడు. ఆ విధంగా సునైనా బిగ్‌బాస్ యాత్ర ముగిసింది.

    ఉద్వేగానికి గురైన సునైనా

    ఉద్వేగానికి గురైన సునైనా

    ఇంటి నుంచి నాని వద్దకు బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన సునైనాకు తన బిగ్‌బాస్ జర్నీని చూపించగా ఆమె కంటతడి పెట్టుకొన్నారు. ఉద్వేగానికి లోనైన సునైనాను నాని ఓదార్చారు. తనీష్, సామ్రాట్‌, గీతాతో మాట్లాడింంది. చివర్లో తనీష్‌పై సునైనా బిగ్‌బాంబ్ వేసింది.

    తనీష్‌పై బిగ్‌బాంబు

    తనీష్‌పై బిగ్‌బాంబు

    బిగ్‌బాంబ్‌ ప్రకారం తనీష్ ఉదయం పాట ప్లే చేయగానే లేచి స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి. అలా బిగ్‌బాస్ ఆదేశం వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. తనపై బిగ్‌బాంబు వేసినందుకు తనీష్ ఆనందంగానే ఒప్పుకొన్నాడు. అలా దీప్తి సునైన బిగ్‌బాస్ జర్నీ ముగిసింది.

    English summary
    Bigg Boss 2 Telugu 70 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. On 70th day, a interesting task was assigned to Bigg Boss contestent. On 70th day, Vijay Devarakonda entered into house. Deepti Sunaina eliminated from the Bigg Boss house
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more