Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్‌బాస్ నుంచి దీప్తి సునైన అవుట్.. స్విమ్మింగ్ పూల్‌లో దూకిన తనీష్.. విషాదంలో ఇంటి సభ్యులు!
Recommended Video
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 70వ రోజున ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఎలిమినేషన్‌కు ముందు గీత గోవిందం దర్శకుడు పరుశురాం, హీరో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత దీప్తి సునైనతో సీక్రెట్ టాస్క్‌ను నానీ, విజయ్, పరుశురాం పర్యవేక్షణలో జరిపించారు. టాస్క్‌లో భాగంగా గీతా, సామ్రాట్‌ను లడ్డుతో కొట్టింది. నిద్రిస్తున్న అమిత్‌పై నీళ్లు పోసింది. ఈ వారం దీప్తి సునైనా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా ఏమి జరిగిందంటే..
బిగ్‌బాస్‌లోకి విజయ్ దేవరకొండ
నాని వేదికపైకి రాగానే విజయ్ దేవరకొండ, పరుశురాంను వేదికపైకి పిలిపించారు. ఆ తర్వాత సినిమా గురించి కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత విజయ్ వచ్చిన సందర్భంగా కొత్తగా ఓ గేమ్ ఆడుదామని దీప్తి సునైనాతో సిక్రెట్ టాస్క్ ఆడించారు.
దీప్తి సునైనాతో సీక్రెట్ టాస్క్
సీక్రెట్ టాస్క్‌లో భాగంగా దీప్తి సునైనకు ఫోన్, బ్లూటూత్ ఇచ్చారు. చెవిలో బ్లూటూత్ పెట్టుకొని నాని, విజయ్ దేవరకొండ చెప్పినట్టు దీప్తి సునైనా చేసింది. తనీష్‌ను స్విమ్మింగ్ పూల్‌లో నెట్టడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత రోల్ రైడాను స్విమ్మింగ్ పూల్‌లోకి తోయడానికి చేసిన ప్లాన్ కూడా బెడిసి కొట్టింది.
సీక్రెట్ టాస్క్‌లో సునైన కష్టాలు
సీక్రెట్ టాస్క్‌లో భాగంగా తనీష్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి దూకమని చెప్పగా ఎందుకు అని అడిగాడు. ఎలిమినేషన్ కాకుండా ఉండటానికి అని దీప్తి చెప్పగా వెంటనే స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాడు. ఆ తర్వాత దీప్తి సునైనాతో సీక్రెట్ టాస్క్ అని చెప్పించారు. విజయ్ దేవరకొండతో ఇంటి సభ్యులు మాట్లాడిన తర్వాత ఇంకా ఇంకా పాటను ప్లే చేస్తే అంతా డ్యాన్స్ చేశారు.
దీప్తి సునైనా ఎలిమినేషన్ ఇలా
చివరగా నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదట రోల్ రైడా ప్రొటెక్టెడ్ జోన్లోకి వెళ్లాడు. ఆ తర్వాత సునైనాను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. పూజా రామచంద్రన్‌ను ప్రొటెక్టెడ్ జోన్లోకి పంపించినట్టు నాని వెల్లడించారు. పది నిమిషాల్లో వస్తువులు ప్యాక్ చేసుకోమని చెప్పడంతో దీప్తి అందుకు సిద్దమైంది.
విషాదంలో ఇంటి సభ్యులు
దీప్తి సునైనా ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అందరూ దీప్తిని కౌగిలించుకొని బాధను పంచుకొన్నారు. తనీష్ కంటనీరు పెట్టుకొని ఉద్వేగానికి గురయ్యాడు. ఆ విధంగా సునైనా బిగ్‌బాస్ యాత్ర ముగిసింది.
ఉద్వేగానికి గురైన సునైనా
ఇంటి నుంచి నాని వద్దకు బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన సునైనాకు తన బిగ్‌బాస్ జర్నీని చూపించగా ఆమె కంటతడి పెట్టుకొన్నారు. ఉద్వేగానికి లోనైన సునైనాను నాని ఓదార్చారు. తనీష్, సామ్రాట్, గీతాతో మాట్లాడింంది. చివర్లో తనీష్‌పై సునైనా బిగ్‌బాంబ్ వేసింది.
తనీష్‌పై బిగ్‌బాంబు
బిగ్‌బాంబ్ ప్రకారం తనీష్ ఉదయం పాట ప్లే చేయగానే లేచి స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి. అలా బిగ్‌బాస్ ఆదేశం వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. తనపై బిగ్‌బాంబు వేసినందుకు తనీష్ ఆనందంగానే ఒప్పుకొన్నాడు. అలా దీప్తి సునైన బిగ్‌బాస్ జర్నీ ముగిసింది.