For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోల్‌రైడా ముఖం పచ్చడి.. తనీష్‌కు దీప్తి భర్త వార్నింగ్.. అమిత్ కొడుకుకు దెబ్బ తగిలి..!

    |
    Bigg Boss 2 Telugu : Episode 94 highlights

    బిగ్‌బాస్ రియాలిటీ షోలో 92వ రోజు భావోద్వేగాలు కనిపించాయి. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను బిగ్‌బాస్ నిర్వహించాడు. టాస్క్ జరుగుతుండగానే సామ్రాట్ తల్లి, అమిత్ భార్య, కుమారుడు, దీప్తి నల్లమోతు ఫ్యామిలీ ఇంటిలోకి వచ్చారు. ఇంటి సభ్యుల రాకతో బిగ్‌బాస్ సెలబ్రిటీల ఆనంద రెట్టింపైంది. ఇంటిలో ఇంకా ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకొందాం..

    ఎప్పటిలానే కామెంట్లు

    ఎప్పటిలానే కామెంట్లు

    బిగ్‌బాస్ హౌస్‌లో 92 రోజు ఎప్పటిలానే ఒకరిపై మరొకరు కామెంట్లు విసురుకొన్నారు. కౌశల్ ఎప్పటిలానే కెలికి కజ్జాలు పెట్టుకోవడం కనిపించింది. తనీష్, రోల్‌రైడా, సామ్రాట్ ఇంటి సభ్యుల గురించి చర్చించుకొన్నారు.

    లగ్జరీ బడ్జెట్ టాస్క్

    లగ్జరీ బడ్జెట్ టాస్క్

    లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం ఫ్రీజ్, రివర్స్, ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్స్ గేమ్ ఆడాలని సూచించాడు. ఫ్రీజ్ అవుతూ వారు చేసిన ఫీట్స్‌తో సరదాగా కనిపించాయి. ఇంటి సభ్యులు లగ్జరీ టాస్క్ ఆడుతుండగా ప్రతీ సభ్యుడి కుటుంబ సభ్యులు వచ్చారు.

    ఇంటిలోకి సామ్రాట్ మదర్

    ఇంటిలోకి సామ్రాట్ మదర్

    ఇంటి సభ్యులు ఫ్రీజ్ అయిన సమయంలో ముందుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి సామాట్ర్ తల్లి లోనికి ప్రవేశించారు. తల్లిని చూడగానే సామ్రాట్ ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లో ప్రతీ సెలబ్రిటీని సామ్రాట్ ప్రేమగా, ఆప్యాయంగా పలకరించాడు. సామ్రాట్ తల్లి చూపిన ప్రేమకు కౌశల్ కంటతడి పెట్టాడు.

    అమిత్ కుమారుడు, భార్య

    అమిత్ కుమారుడు, భార్య

    ఆ తర్వాత అమిత్ కుమారుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అమిత్ ఫ్రీజ్‌లో ఉన్నాడు. కుమారుడు వచ్చి అమిత్‌ను కౌగిలించుకొన్నాడు. అనంతరం అమిత్ భార్య వచ్చింది. ఇంటి సభ్యులతో అప్యాయంగా మాట్లాడుకొన్నారు. బయటకు పరిగెత్తబోయి అమిత్ కొడుకు డోర్‌ను కొట్టుకోవడంతో తల బొప్పి కట్టింది.

    ఇంట్లోకి జోకర్ ప్రవేశించి

    ఇంట్లోకి జోకర్ ప్రవేశించి

    ఇలా లగ్జరీ బడ్జెట్ టాస్క్ కొనసాగుతుండగానే ఇంట్లోకి జోకర్ ప్రవేశించాడు. ఇంటి సభ్యులు ఫ్రీజ్‌లో ఉండగా అందర్ని ఆటపట్టించి బాగా నవ్వించాడు. రోల్ రైడా ముఖం పచ్చడయ్యేలా కేక్‌తో కొట్టాడు. కేక్ తినిపించాడు. కౌశల్‌, రైల్ రైడాకు గిలిగింతలు పెట్టాడు. జోకర్ చేసిన హాస్యానికి ఎప్పుడూ లేని విధంగా కౌశల్ ఫుల్లుగా నవ్వాడు.

    దీప్తి భర్త శ్రీకాంత్ ప్రవేశించి

    దీప్తి భర్త శ్రీకాంత్ ప్రవేశించి

    ఇంటి సభ్యులు ఆనందంగా టాస్క్ ఆడుతుంటే దీప్తి కుమారుడు దీప్తి, భర్త శ్రీకాంత్ వచ్చారు. వారిని చూసి ఆనందంతో గెంతులు వేసింది. ఇంటిలోకి తీసుకెళ్లి మాట్లాడుకొన్నారు. భర్త, కుమారుడిని ముద్దులతో ముంచెత్తింది. నాన్‌స్టాప్‌గా గలగలా మాట్లాడేసింది.

    తనీష్‌కు వార్నింగ్

    తనీష్‌కు వార్నింగ్

    ఇంటి నుంచి బయటకు వెళ్తూ కాస్త చూసి ఆడు అని తనీష్‌కు దీప్తి భర్త వార్నింగ్ మాదిరిగా ఇచ్చి వెళ్లాడు. దాంతో తనీష్ మనస్తాపానికి గురయ్యాడు. తనీష్ బాధపడటం చూసి సామ్రాట్ ఓదార్చాడు.

    English summary
    Bigg Boss2 Telugu 92 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 91 days of the game, Shyamala Eliminated from the house. 92nd Luxury Budget task organised. Samrat, Deepti, Amit family entered in house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X