నాని ప్రశ్నల వర్షం.. నీళ్లు మింగిన గీతా మాధురి.. తుస్సుమన్న బిగ్‌బాస్ ఎలిమినేషన్‌!

హోస్ట్ నాని రాకతో బిగ్‌బాస్ 97వ రోజు భావోద్వేగాల మధ్య సాగింది. వారాంతం కావడం ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోల్‌రైడా, కౌశల్, గీతా మాధురికి నాని క్లాస్ పీకారు. ఇంటి సభ్యుల ఫ్యామిలీ రాకతో వారికి కలిగిన అనుభూతిని అడిగి తెలుసుకొన్నారు. ఇంకా ఏం జరిగిందంటే..

గీతాకు సోషల్ మీడియా తిప్పలు

గీతాకు సోషల్ మీడియా తిప్పలు

సోషల్ మీడియా అకౌంట్లు, ట్విట్టర్, ఫేస్ బుక్ ప్రచారంపై గీతా మాధురి మాట్లాడిన విషయాన్ని మొట్టమొదట పాయింట్ అవుట్ చేశారు. మీకు బయట సోషల్ మీడియా ప్రచారం గురించి ఎవరు చెప్పారు అని నాని నిలదీయడంతో నాకు ఎవరూ చెప్పలేదు అని అన్నారు. చివరికి పూజా, నూతన్ నాయుడు తదితరులు పేర్లను ప్రస్తావించింది. కౌశల్ గురించి నూతన్ నాయుడు చెప్పాడని చివరకు గీతా తేల్చేసింది.

గీతా కామెంట్లను తప్పుపట్టిన కౌశల్

గీతా కామెంట్లను తప్పుపట్టిన కౌశల్

గీతా మాధురి తన పేరును ప్రస్తావించడంపై కౌశల్ తప్పుపట్టారు. నాకు 10 రోజుల ముందే బిగ్‌బాస్ ఆఫర్ గురించి తెలిసింది. అప్పటికే నేను పూర్తి చేయాల్సిన టెలివిజన్ ఎపిసోడ్స్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాను. నాకు సోషల్ మీడియా అకౌంట్ల గురించి అసలే తెలియదు అని కౌశల్ చెప్పాడు.

రోల్ నీలో దమ్ము ఉందా?

రోల్ నీలో దమ్ము ఉందా?

రోల్ రైడాను కౌశల్ కామెంట్ చేసిన తీరుపై నాని తీవ్రంగా స్పందించాడు. రోల్ రైడా.. బిగ్‌బాస్ హౌస్‌లో మంచి అనిపించుకోవడమే కాదు. మంచి కోసం నిలబడటం కూడా చాలా ముఖ్యమైంది. మీకు ఓ తప్పనిపించవచ్చు. మరో కరెక్ట్ అనిపించవచ్చు. దానిని అక్కడికక్కడే అడిగే దమ్ము నీలో ఉందా లేదా. కౌశల్ నిన్ను అంటే గ్రూప్ మీటింగ్ పెట్టి బాధపడటం ఎందుకు అని నాని నిలిదీశాడు.

కౌశల్‌పై నాని సీరియస్

కౌశల్‌పై నాని సీరియస్

కౌశల్ కామెంట్‌పై నాని అడిగిన ప్రశ్నలకు రోల్ రోడా సమాధానం ఇస్తూ.. మొదట కౌశల్ గారు.. అలా అన్నప్పుడు నేను స్పందించాను అని అన్నాడు. దాంతో ఏమన్నాడని నాని ప్రశ్నించగా.. రోల్ రైడా చెప్పిన సమాధానంతో నాని సీరియస్ అయ్యాడు.

కౌశల్‌కు షాకిచ్చిన నాని

కౌశల్‌కు షాకిచ్చిన నాని

రోల్ రైడాను అలా అన్నావా అని నాని ప్రశ్నించగా అవును అని కౌశల్ తలూపాడు. దాంతో అది తోటి ఇంటి సభ్యుడిపై చేసిన చాలా దారుణమైన స్టేట్‌మెంట్ అని నాని పేర్కొన్నాడు. దాంతో చిన్న పిల్లలు వచ్చిన ట్రాన్స్‌లో ఉన్నాను అని పేర్కొనగా.. నీవు అన్న తర్వాతే పిల్లలు ఇంట్లోకి వచ్చారు అని నాని ఝలక్ ఇచ్చారు.

ఫ్యామిలీ మెంబర్స్ రాక గురించి

ఫ్యామిలీ మెంబర్స్ రాక గురించి

ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఇంటి సభ్యుల అనుభూతిని తెలుసుకొన్నారు. తనీష్, సామ్రాట్, గీతా, కౌశల్, అమిత్, రోల్ రైడా, దీప్తి అలా పేరు పేరున ఒక్కొక్కరి అనుభవాలు అడిగి తెలుసుకొన్నాడు. నందు, గీతా మాధురి ఎపిసోడ్‌పై నాని జోకులు పేల్చారు. వారి రొమాన్స్‌పై ఇంటి సభ్యులు సెటైర్లు వేశారు.

ఎలిమినేషన్ ప్రక్రియ వాయిదా

ఎలిమినేషన్ ప్రక్రియ వాయిదా

ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తూ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను ఆదివారానికి వాయిదా వేశాడు. దాంతో టెన్షన్‌ను తట్టుకోలేకపోతున్నాం అని గీతా మాధురి అని చెప్పగా.. మీరు ఎదురు చూస్తున్నారని తెలిస్తే. మేము వెయిటింగ్‌లోనే పెడుతాం అని నాని చురకలు అంటించారు. దీంతో ఎలిమినేషన్ టెన్షన్ రేపటికి వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X