twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహా ప్రభో.. ఇక నస ఆపు.. దీప్తిపై సెటైర్ల దాడి.. చేతులెత్తి నాని నమస్కారం!

    |

    బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించిన 99వ ఎపిసోడ్‌ ఆరంభం నుంచే కంటెస్టెంట్ దీప్తి నల్లమోతుతో హోస్ట్ నాని ఆడుకొన్నాడు. సందు దొరికితే చాలూ సెటైర్లతో అల్లాడించాడు. ఆదివారం 9 గంటలకు ప్రసారమైన షోలో నాని వేదికపైకి వచ్చినప్పటికీ.. దీప్తి బాత్రూం వద్దే మేకప్ అవుతుండటంతో వాట్ నాన్సెన్స్ అంటూ నాని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వెంటనే వెళ్లి వాళ్లను పిలుచుకరండి అంటూ పంపించండంతో వారిని తీసుకొచ్చారు. ఇంకా తమషా విషయాలు ఏం జరిగాయంటే..

    జంధ్యాల మార్కు మహాప్రభో

    జంధ్యాల మార్కు మహాప్రభో

    ఆదివారం ఫన్ కోసం ఆడే ఆటకు నీ మంచి కోరి అని టైటిల్ పెట్టామని నాని చెప్పగానే.. దీప్తి సమాధానం ఇస్తూ.. మీరు పెట్టడం.. అది బాగా లేకపోవడమా? అని అన్నారు. కానీ దాని వెనుక ఏదో ట్విస్టు ఉండకపోదు అని తనదైన శైలిలో పేర్కొన్నారు. వెంటనే నాని మీరు చెప్పేది జంధ్యాల మార్కు మహా ప్రభో కాదుగా అని సెటైర్ వేశారు.

    మీతో అంత ధైర్యమా

    మీతో అంత ధైర్యమా

    వైట్ బోర్డు తీసుకురమ్మని నాని చెప్పగా.. దీప్తి మాట్లాడుతూ.. మేము బొమ్మలు గీయాలా? అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా మిమ్మల్ని పెట్టుకొని అంత ధైర్యం చేయలేం అని నాని చురక అంటించారు. అంతలోనే ఏదో ఇంట్రస్టు గేమ్ ఉండబోతుందా అని తనీష్ అనగానే.. ఇంట్రస్టు ఉండేవే ప్లాన్ చేస్తాం అని నాని అన్నారు.

    కిందపడి గిలగిలా కొట్టుకోవడం

    కిందపడి గిలగిలా కొట్టుకోవడం

    బోర్డుపై తన గురించి పెట్టిన కామెంట్ల గురించి దీప్తి మాట్లాడుతూ నస పెట్టడంతో అందరూ నిద్రపోయినట్టు నటించారు. ఇంకా ఆపకపోవడంతో నాని మెట్లమీద కూర్చొన్నాడు. కొందరు కిందపడి గిలగిలా కొట్టుకొన్నారు. నాని అరే ఫిట్స్ వస్తున్నాయంటూ కామెడీ చేశారు. దాంతో ఇంత అరాచకమా అని దీప్తి అనడం ఆమె వంతు అయింది.

    నేలపైన నాని

    నేలపైన నాని

    దీప్తి నస ఆపకపోవడంతో నాని కింద పడుకొనేందుకు ప్రయత్నించాడు. ఎవడ్రా నా సూట్ ఇంత టైట్‌గా కుట్టింది ఎవర్రా అంటూ కామెంట్ చేశారు. నస పెట్టకుండా వ్యక్తి గురించి వివరణ ఇవ్వకుండా ఒకే ముక్కలో ఇంటి సభ్యుడి పేరు చెప్పమని సూచించాడు. అయినా ఆపకపోవడంతో నేను వెళ్లిపోతాను అంటూ వేదిక నుంచి నాని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

    చేతులెత్తి దండం పెట్టిన నాని

    చేతులెత్తి దండం పెట్టిన నాని

    చివరకు దీప్తి తన మాటలను ఆపడంతో నాని ఊపిరి పిల్చుకొన్నాడు. ఫైనల్ రోజున బిగ్‌బాస్‌ను కంప్లీట్ చేస్తే ఎంత ఊరట వస్తుందో.. అలాంటి ఫీలింగ్ వచ్చింది అని చెప్పాడు. నాకు మాట్లాడుకొనే ఛాన్స్ ఇవ్వాలి అని నాని అనగా.. వారమంతా మీరు మాట్లాడాలి. శనివారం, ఆదివారం నేను మాట్లాడుతాను అని నాని అన్నారు. ఓ దశలో దీప్తి ఇక ఆపు అంటూ చేతులెత్తి నాని దండం పెట్టడం చూస్తే ఆమె నస ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    English summary
    Bigg Boss2 Telugu 99 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 99 days of the game, Amit Tiwari Eliminated from the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X