Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మహా ప్రభో.. ఇక నస ఆపు.. దీప్తిపై సెటైర్ల దాడి.. చేతులెత్తి నాని నమస్కారం!
బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించిన 99వ ఎపిసోడ్ ఆరంభం నుంచే కంటెస్టెంట్ దీప్తి నల్లమోతుతో హోస్ట్ నాని ఆడుకొన్నాడు. సందు దొరికితే చాలూ సెటైర్లతో అల్లాడించాడు. ఆదివారం 9 గంటలకు ప్రసారమైన షోలో నాని వేదికపైకి వచ్చినప్పటికీ.. దీప్తి బాత్రూం వద్దే మేకప్ అవుతుండటంతో వాట్ నాన్సెన్స్ అంటూ నాని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వెంటనే వెళ్లి వాళ్లను పిలుచుకరండి అంటూ పంపించండంతో వారిని తీసుకొచ్చారు. ఇంకా తమషా విషయాలు ఏం జరిగాయంటే..
జంధ్యాల మార్కు మహాప్రభో
ఆదివారం ఫన్ కోసం ఆడే ఆటకు నీ మంచి కోరి అని టైటిల్ పెట్టామని నాని చెప్పగానే.. దీప్తి సమాధానం ఇస్తూ.. మీరు పెట్టడం.. అది బాగా లేకపోవడమా? అని అన్నారు. కానీ దాని వెనుక ఏదో ట్విస్టు ఉండకపోదు అని తనదైన శైలిలో పేర్కొన్నారు. వెంటనే నాని మీరు చెప్పేది జంధ్యాల మార్కు మహా ప్రభో కాదుగా అని సెటైర్ వేశారు.
మీతో అంత ధైర్యమా
వైట్ బోర్డు తీసుకురమ్మని నాని చెప్పగా.. దీప్తి మాట్లాడుతూ.. మేము బొమ్మలు గీయాలా? అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా మిమ్మల్ని పెట్టుకొని అంత ధైర్యం చేయలేం అని నాని చురక అంటించారు. అంతలోనే ఏదో ఇంట్రస్టు గేమ్ ఉండబోతుందా అని తనీష్ అనగానే.. ఇంట్రస్టు ఉండేవే ప్లాన్ చేస్తాం అని నాని అన్నారు.
కిందపడి గిలగిలా కొట్టుకోవడం
బోర్డుపై తన గురించి పెట్టిన కామెంట్ల గురించి దీప్తి మాట్లాడుతూ నస పెట్టడంతో అందరూ నిద్రపోయినట్టు నటించారు. ఇంకా ఆపకపోవడంతో నాని మెట్లమీద కూర్చొన్నాడు. కొందరు కిందపడి గిలగిలా కొట్టుకొన్నారు. నాని అరే ఫిట్స్ వస్తున్నాయంటూ కామెడీ చేశారు. దాంతో ఇంత అరాచకమా అని దీప్తి అనడం ఆమె వంతు అయింది.
నేలపైన నాని
దీప్తి నస ఆపకపోవడంతో నాని కింద పడుకొనేందుకు ప్రయత్నించాడు. ఎవడ్రా నా సూట్ ఇంత టైట్‌గా కుట్టింది ఎవర్రా అంటూ కామెంట్ చేశారు. నస పెట్టకుండా వ్యక్తి గురించి వివరణ ఇవ్వకుండా ఒకే ముక్కలో ఇంటి సభ్యుడి పేరు చెప్పమని సూచించాడు. అయినా ఆపకపోవడంతో నేను వెళ్లిపోతాను అంటూ వేదిక నుంచి నాని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
చేతులెత్తి దండం పెట్టిన నాని
చివరకు దీప్తి తన మాటలను ఆపడంతో నాని ఊపిరి పిల్చుకొన్నాడు. ఫైనల్ రోజున బిగ్‌బాస్‌ను కంప్లీట్ చేస్తే ఎంత ఊరట వస్తుందో.. అలాంటి ఫీలింగ్ వచ్చింది అని చెప్పాడు. నాకు మాట్లాడుకొనే ఛాన్స్ ఇవ్వాలి అని నాని అనగా.. వారమంతా మీరు మాట్లాడాలి. శనివారం, ఆదివారం నేను మాట్లాడుతాను అని నాని అన్నారు. ఓ దశలో దీప్తి ఇక ఆపు అంటూ చేతులెత్తి నాని దండం పెట్టడం చూస్తే ఆమె నస ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.