For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంట్లో నందు హంగామా.. సామ్రాట్, గీత రొమాన్స్‌పై రచ్చ..దీప్తికి జైలుశిక్ష.. కౌశల్‌కు చేదు అనుభవం

  |
  Bigg Boss Season 2 Telugu : Episode 96 Highlights.

  బిగ్‌బాస్ ఇంట్లో 95, 96 రోజు తీపి, చేదు అంశాలతో సాగిపోయింది. ఇంట్లోకి గీతా మాధురి భర్త నందు ప్రవేశించి హంగామా చేశాడు. ఇంటి సభ్యులందరితో సరదాగా మాట్లాడారు. అలాగే ఇంట్లో సామ్రాట్, గీతా మాధురి రొమాన్స్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. దానిపై గీత, సామ్రాట్ మాట్లాడుకొన్నారు. అలాగే ఇంట్లో చేసిన తప్పు పనికి దీప్తికి బిగ్‌బాస్ జైలుశిక్ష విధించాడు. ఇంకా ఏమి జరిగిందంటే..

  ఇంట్లో నందు హంగామా

  ఇంట్లో నందు హంగామా

  గీతా మాధురి భర్త ఇంట్లోకి ప్రవేశించాడు. వచ్చి రాగానే హౌస్‌లో హంగామా చేశాడు. ఇంటి సభ్యులందరితో కలిసి ఎమోషనల్ అయ్యాడు. తనీష్‌ను కౌగిలించుకొని కంటతడి పెట్టుకొన్నాడు. కూర్చోవచ్చా. రూల్స్ ఒప్పుకొంటాయా? అని కౌశల్‌తో నందూ మజాక్ చేశాడు.

  గీతతో రొమాంటిక్‌గా నందు

  గీతతో రొమాంటిక్‌గా నందు

  ఇక ఇంట్లోకి వెళ్లి గీతాతో నందు రొమాంటిక్‌గా వ్యవహరించాడు. ఏ కెమెరాలు చూస్తున్నాయి. దిండ్లు అడ్డం పెట్టుకొని ఏదైనా చేద్దాం అనేంతగా రెచ్చిపోయాడు. దాంతో గీతా మాధురికి గుండె దడ ప్రారంభమైంది. గీతాను ముద్దులతో ముంచెత్తాడు.

  మాటలు జాగ్రత్తగా

  మాటలు జాగ్రత్తగా

  నీవు బాగా ఆడుతున్నావు. నీ గేమ్ నీవు ఆడు. నీవు మాట్లాడే మాటలే నిన్ను జడ్జ్ చేస్తాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. సామ్రాట్‌తో జాగ్రత్తగా ఉండు అని చెవిలో గుసగుసలాడాడు. నీ మీద ఏదైనా, ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు అంతగా పట్టింపు ఉండదు. నీ పేరేంట్స్, నా పేరెంట్స్‌ నమ్మరు అని నందూ అన్నాడు.

  గీత మాధురి నస పెట్టి

  గీత మాధురి నస పెట్టి

  నందుని మాట్లాడనివ్వకుండా నస గీత పెట్టేసింది. మీరు ఎలా భరిస్తున్నారో ఈమెను అంటూ నందు తమాషాలాడాడు. మేము ఆమె నసను భరించలేకపోతున్నామని కౌశల్ కూడా వంత పాడాడు. బిగ్‌బాస్ ఆదేశాలు రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తూనే చాలా సేపు ఇంట్లోనే ఉన్నాడు. బిగ్‌బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీతో నన్ను ఇక్కడే ఉండనివ్వు అంటూ నందు అనడం గమనార్హం.

  సామ్రాట్, గీత రిలేషన్‌పై రూమర్లు

  సామ్రాట్, గీత రిలేషన్‌పై రూమర్లు

  తాము అతిసన్నిహితంగా ఉండటంపై బయట వినిపిస్తున్న మాటలపై సామ్రాట్, గీత మాధురి చర్చించుకొన్నారు. ఒకరు పోయిన తర్వాత మరొకరా అనే మాటలు వినిపించాయని అని అమ్మ చెప్పింది. మనం ఏం చేశామని అలా అనుకొంటున్నారు అని సామ్రాట్‌తో గీతా వాపోయింది. అయినా ఇప్పుడు అలా అనుకోవడం లేదట అని సామ్రాట్ అన్నారు.

  ఇంట్లో దొంగలు పడ్డారు

  ఇంట్లో దొంగలు పడ్డారు

  ఇంట్లో టాస్క్ ఆడుతూ అందరూ ఫ్రీజ్ మోడ్‌లో ఉండగా దొంగలు వచ్చి వస్తువులను ఎత్తుకెళ్లారు. అమిత్, దీప్తి దొంగలతో ఫైటింగ్ చేసేంత పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ బిగ్‌బాస్ వస్తువులను పంపించాడు. దాంతో ఇంటి సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు.

  ఇంట్లో కెప్టెన్ టాస్క్

  ఇంట్లో కెప్టెన్ టాస్క్

  ఇక బిగ్‌బాస్ కెప్టెన్ కోసం టాస్క్ ప్రారంభమైంది. రంగులతో నింపిన గ్లాసులను ఇచ్చి వాటిలో రంగు పడిపోకుండా చివరి వరకు ఉన్నవారు కెప్టెన్‌ అవుతాడు అని సూచించాడు. సగం గ్లాస్ ఉన్నాగానీ ఖాళీ గ్లాస్‌గా పరిగణిస్తామని చెప్పాడు. సీజన్‌ మొత్తానికి నామినేట్ అయినందున కౌశల్ ఈ పోటీకి అర్హుడు కాదని చెప్పాడు. అలాగే ఈ టాస్క్‌ కోసం సంచాలకుడిగా వ్యవహరించాడు.

  ఈ వారం కెప్టెన్ లేకుండానే

  ఈ వారం కెప్టెన్ లేకుండానే

  గ్లాసులో రంగు నీళ్లను కాపాడుకోవడానికి సభ్యులు శతవిధాల ప్రయత్నించారు. కానీ ఒకరిపై మరొకరు దాడి చేసి గ్లాస్‌లోని రంగు నీళ్లను కిందపడేసేలా చేశారు. చివరి వరకు ఎవరూ మిగిలి ఉండకపోవడంతో ఈ వారం కూడా బిగ్‌బాస్ హౌస్‌‌ కెప్టెన్‌ లేకుండానే గడిచిపోనున్నది.

  దీప్తి నల్లమోతుకు జైలుశిక్ష

  దీప్తి నల్లమోతుకు జైలుశిక్ష

  బిగ్‌బాస్ హౌస్‌లో దీప్తి నల్లమోతుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇంటి ఆస్తిని ధ్వంసం చేసినందున్న దీప్తికి బిగ్‌బాస్ శిక్ష విధించాడు. కెమెరాపై ఉండే గ్లాస్‌ను పగలకొట్టడంతో దీప్తి శిక్షకు గురైంది. ఇంటిలోని కెమెరా ముందుకు వెళ్లి తప్పైందని బిగ్‌బాస్‌కు చెప్పు. అనంతరం జైల్లోకి వెళ్లాలి. బిగ్‌బాస్ ఆదేశం వచ్చే వరకు జైల్లోనే ఉండాలి అని శిక్ష విధించాడు.

  English summary
  Bigg Boss2 Telugu 93,94 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 91 days of the game, Shyamala Eliminated from the house. 94th Luxury Budget task organised. Geeta Madhuri husband Nandu entered in house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X