బిగ్‌బాస్‌ నుంచి నందిని అవుట్, రోల్ రైడా దౌడ పగిలింది.. పోలీసుల అదుపులో సామ్రాట్.. తనీష్ కంటతడి

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 57 Highlights

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 56వ రోజు భావోద్వేగాల మధ్య సాగిపోయింది. ఎలిమినేషన్ డే కావడంతో ఒకరు ఇంటి నుంచి వీడిపోయారు. అందుకు ముందు ఇంట్లో ఫ్రెండ్ షిప్‌ డే సెలబ్రేషన్ బాగా జరిగాయి. ఒక్కొక్కరు తమ స్నేహ జీవితంలో మధురమైన అనుభావాలను పంచుకొన్నారు. తనీస్, సామ్రాట్ ఎమోషనల్ అయ్యారు. నందినీ వెళ్తూ ఒకరిపై బిగ్‌బాంబ్ విసిరింది. ఇంట్లో ఏమి జరిగిందంటే..

ఫ్రెండ్ షిప్ డే విషెస్

ఫ్రెండ్ షిప్ డే విషెస్

ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే కావడంతో ఇంట్లో సభ్యులకు నాని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి రావాలని నాని కోరగా.. ఆయన ఓ ఉపాయంతో బయట ఆవరణలో ఉన్న గోడ ఏక్కి అందరికీ కనిపించారు.

సభ్యులకు ఫ్రెండ్స్ వీడియో విషెస్

సభ్యులకు ఫ్రెండ్స్ వీడియో విషెస్

నాని మళ్లీ వేదికపై వచ్చి సభ్యుల ఫ్రెండ్స్ మాట్లాడిన, విషెష్ చెప్పిన వీడియోను అందరికీ చూపించారు. తమ స్నేహితులు చెప్పిన విషయాలతో సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రోల్ రైడా ఓ ఆసక్తికరమైన సంఘటనను చెప్పాడు.

రోల్ రైడా లవ్ ప్రపోజ్

రోల్ రైడా లవ్ ప్రపోజ్

రోల్ రైడా తన ఏరియాలో ఉండే ఓ అమ్మాయికి ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకొన్నాడు. ఆమెను రైల్వే స్టేషన్ రమ్మని చెప్పి లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ముగ్గురికి ఫోన్ చేయగా వారు వచ్చి రోల్ రైడాను గూబ పగిలేలా కొట్టారట. ఈ విషయాన్ని చెప్పి రోల్ రైడా అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాడు.

సామ్రాట్ జైల్లో ఉన్న సమయంలో

సామ్రాట్ జైల్లో ఉన్న సమయంలో

సామ్రాట్ తన జీవితంలో ఇటీవల జరిగిన చేదు సంఘటనను వివరించాడు. తనపై తన భార్య పెట్టిన కేసును ఈ సందర్బంగా చెప్పాడు. ఆ సమయంలో నన్ను మూడు రోజులు పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారించారు. ఆ మూడు రోజులు నాతో ఉండి నా స్నేహితుడు అండగా నిలిచాడు. అతడంటే నాకు చాలా ఇష్టం. నాకు సోదరుడు లాంటి వాడు అనే ఉద్వేగానికి లోనయ్యాడు.

తనీష్ ఎమోషనల్‌గా

తనీష్ ఎమోషనల్‌గా

తనీష్ తన జీవితంలో చోటు చేసుకొన్న గడ్డు పరిస్థితిని చెప్పుకొని ఉద్వేగానికి లోనయ్యాడు. తన చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. తమ్ముడిని ఇంజినీరింగ్ చదవించడానికి డబ్బుల లేకపోతే నాని ఫోన్ చేసి అడిగాను. ఆ సమయంలో నాకు ఆర్థికంగా అండగా నిలిచాడు. ఆ విషయమే కాకుండా చాలా సార్లను సరైన దారిలో నడిపించాడు అని తనీష్ ఎమోషనల్ అయ్యాడు.

ఇంట్లోకి గూఢచారి

ఇంట్లోకి గూఢచారి

ఇంటి సభ్యులకు నాని, బిగ్‌బాస్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. చిలసా, గూఢచారి చిత్రాల్లో నటించిన హీరోలు, డైరెక్టర్, నటీనటులను బిగ్‌బాస్ వేదికపైన కనిపించారు. కానీ ఇంట్లోకి పంపించకపోవడంతో వేదికపై నుంచే ఇంటి సభ్యులతో మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి వారు బెస్ట్ విషెస్ చెప్పారు. వారు వెళ్లిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.

నందిని ఎలిమినేషన్

నందిని ఎలిమినేషన్

ఎలిమినేషన్ ప్రక్రియలో నందినీ, దీప్తి నల్లమోతు, గణేష్ ఉన్నారు. మొదట గణేష్‌ను ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించడంతో దీప్తీ, నందినీ మిగిలారు. వారిలో నుంచి నందిని ఈ వారం ఎలిమినేట్ చేస్తూ బిగ్‌బాస్ తీసుకొన్న నిర్ణయాన్ని నాని వెల్లడించారు. ఇంటిలో నందినినీ సభ్యులు ఓదార్చారు. ఆ తర్వాత వేదికపైకి వచ్చి నానితో జత కలిసింది.

గీతా మాధురి నీవు ఇన్పిపిరేషన్

గీతా మాధురి నీవు ఇన్పిపిరేషన్

ఎలిమినేట్ అయిన నందినీ బిగ్‌బాస్ జర్నీని చూపించారు. ఆ తర్వాత గీతా మాధురి, దీప్తి, తనీష్‌తో మాట్లాడింది. గీతా మాధురి నాకు ఇన్సిపిరేషన్, తల్లిదండ్రులు గుర్తుకు రాకుండా ప్రేమను పంచావు అని దీప్తిని, నీవు నీలాగే ఉండు అని తనీష్‌కు చెప్పింది.

రోల్ రైడాపై బిగ్ బాంబు

రోల్ రైడాపై బిగ్ బాంబు

చివరగా రోల్ రైడాపై బిగ్‌బాంబ్ విసిరింది. బిగ్‌బాంబులో భాగంగా రోజు ఒకరికి రోల్ రైడా మసాజ్ చేయాలి. ఆ సమయంలో ఇంటిలోని సమస్యలపై సభ్యుడితో చర్చించాలి. తనపై నందిని బిగ్‌బాంబ్ వేస్తుందని అనుకోలేదు. ఇది పెద్ద షాక్ అని రోల్ రైడా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X