twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాహ్! క్యా బాత్ హై... శ్రీముఖితో పిసికించాడుగా, బిగ్‌‌బాస్ భలే చేశాడంటూ కామెంట్స్!

    |

    Recommended Video

    Bigg Boss Today Promo : Koditey goda baddalaipovali #BiggBossTelugu3

    బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎప్పుడు ఏమైనా జరుగవచ్చు. మనం ఊహించుకున్నట్లు అక్కడ ఉండటం సాధ్యం కాదు. కంటెస్టెంట్లు, ప్రేక్షకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ బిగ్ బాస్ వెరైటీ టాస్కులతో షోను నడిపిస్తూ ఉంటాడు. బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంటరైన తర్వాత శ్రీముఖి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

    అసలే లౌడ్ స్పీకర్... బిగ్ బాస్ షోలో పై చేయి సాధించడానికి ఈ యాంకర్ చేస్తున్న పనులు చూసి ఆడియన్స్ సైతం ఆశ్చర్య పోతున్నారు. హౌస్‌లోకి ఎంటరైన తర్వాత గ్లామర్ డోస్ కూడా బాగా పెంచేసింది. ఇంట్లో టెక్కులు ప్రదర్శిస్తున్న ఆమెకు బిగ్ బాస్ కేక పుట్టించే టాస్క్ ఇచ్చాడు.

    శ్రీముఖితో పిడకలు పిసికించిన బిగ్ బాస్

    శ్రీముఖితో పిడకలు పిసికించిన బిగ్ బాస్

    బుధవారం ఉదయం విడుదలైన ప్రోమో వీక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది. అలీ రెజా, శ్రీముఖి కలిసి వంద పిడకలు గొడకు కొట్టాల్సిందిగా బిగ్ బాస్ సూచించారు. ఈ రోజు ప్రసారం అయ్యే షోలో ఈ పిడకలు టాస్క్ భలే ఆసక్తికరంగా సాగుతుందని స్పష్టం అవుతోంది.

    శ్రీముఖి గురించి జనం ఏమనుకుంటున్నారు?

    శ్రీముఖి గురించి జనం ఏమనుకుంటున్నారు?

    బిగ్ బాస్ రియాలిటీ షో చూసే వారు ఇంట్లో శ్రీముఖి చేస్తున్న పనులపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఆమె చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తోందని, అక్కడి విషయాలు ఇక్కడ చెబుతూ మానిప్యులేట్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం గేమ్ అంటే అలానే ఉంటుంది, శ్రీముఖి పర్ఫెక్ట్ ప్లేయర్ అంటూ సమర్ధిస్తున్నారు.

    ఈసారి ఎలిమినేషన్ లిస్టులో...

    ఈసారి ఎలిమినేషన్ లిస్టులో...

    ఈ సారి ఎలిమినేషన్ లిస్టులో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. అందులో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. ఈ 8 మందిలో ఒకరు ఈవారాంతం బయటకు వెళ్లిపోవడం కాయం.

    ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి

    బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందుకోసం బిగ్ బాస్ ఎలాంటి పనులు చెప్పినా చేయడానికి మొహమాట పడటం లేదు. ఇందులో భాగంగానే గ్లామరస్ యాంకర్ శ్రీముఖి పిడకలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కొడితే గోడ పడిపోవాలి అనే రేంజిలో శ్రీముఖి, అలీ పిడకలు కొట్టడం ప్రోమోలో హైలెట్ అయింది.

    English summary
    Bigg Boss gave interesting Cow dung cake task to Srimukhi and Ali. This time the elimination list has a total of 8 members. Among them are Srimukhi, Himaja, Zafar, Mahesh Vitta, Varun Sandesh, Vithika, Purnavi and Rahul Sipliganj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X