బిగ్ బాస్ తెలుగు 2 లేటెస్ట్ ప్రోమో అదుర్స్
బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. హీరో నాని హోస్ట్ చేస్తున్న ఈ షోకు సంబంధించి ప్రోమో ఇటీవల విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో రకం... స్నేహితులు, ప్రేమికులు, నవ్వించేవారు, కవ్వించేవారు, మిలమిల మెరిసేవారు, మినిమంగా బ్రతికేసేవారు, ఎదురెల్లి పోరాడేవారు, సున్నితమైనవారు, మహా ముదుర్లు, ఎవరికి ఏం కావాలో, ఎవరేం కావాలో డిసైడ్ చేసేది మాత్రం.... బాగ్ బాస్ అంటూ విడుదల చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

జూన్ 10 నుండి నాని హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మొదలు కాబోతోంది. తొలి సీజన్ 70 రోజుల పాటు, 14 మంది సెలబ్రిటీలతో సాగింది. అయితే సీజన్ 2లో చాలా మార్పులు చేశారు. ఈ సారి 100 రోజుల పాటు షో సాగబోతోంది. కంటెస్టెంట్స్ సంఖ్య కూడా 14 నుండి 16కు పెంచారు.
గత సీజన్ మాదిరిగానే సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు... శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో మొదలు కాబోతోంది.


Click it and Unblock the Notifications











