Karthika Deepam.. కార్తీక్, దీప ఫోటోలకు దండలు.. ఘోర ప్రమాదం ఎలా జరిగిందంటే?

చిక్‌మంగళూరులో విహార యాత్రకు వెళ్లిన కార్తీక్, దీప కుటుంబం పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసింది. కార్తీక్, దీప కలిసి మందుకొట్టి ఆనందంలో మునిగిపోయారు. దీప చేసిన హడావిడికి కార్తీక్ థ్రిల్ అయ్యారు. ఉదయమే దీపను లేపి గుడ్ మార్నింగ్ మేడమ్ అంటూ కార్తీక్ పలకరించాడు. రాత్రి ఏమైంది అంటూ దీప అడిగితే.. కాస్త ఎక్కువే చేశావు. మందు కొట్టాం. డ్యాన్స్ చేశాం. చాలా బాగుంది. కానీ నాకు ఆనందం కలిగించేలా అని కార్తీక్ జవాబిచ్చాడు. అయితే నేను ఎక్కువగా మాట్లాడానా డాక్టర్ బాబు అంటే.. ఈ కష్టాలు, బాధలను మరిచిపోయే విధంగా ఉండాలి. అంటే ఇక్కడే ఉండిపోవాలి అనేలా ఉంది అని కార్తీక్ అంటే.. అత్త, మామ, ఆదిత్య, శ్రావ్యను వదిలేసి ఎలా ఉంటాం అని దీప ప్రశ్నించింది. అయితే ఒకసారి నన్ను ఏరా అని పిలువు అని కార్తీక్ అడిగితే.. రాత్రి ఎక్కువగా వాగి ఉంటానా? అని ప్రశ్నించింది. ఇలా రొమాంటిక్ కార్తీక్, దీప మధ్య సంభాషణ జరిగింది. ఇంకా తాజా ఎపిసోడ్‌ 1296లో ఏం జరిగిందంటే?

చచ్చేదాక నిన్ను వదలను అంటూ

చచ్చేదాక నిన్ను వదలను అంటూ

చిక్ మంగళూరులో కార్తీక్ కుటుంబం అనేక ప్రదేశాలు సందర్శిస్తూ ఫోటోలు తీసుకొంటూ కనిపించారు. కార్తీక్, దీపను శౌర్య ఫోటోలు తీస్తూ.. నాన్నను పట్టుకో అమ్మ.. అంటే.. నీవు ఫోటోలు తీయి.. కానీ అది ఇది చెప్పు అని దీప అంది. దాంతో నాన్నను నువ్వైనా అమ్మను పట్టుకో అంటే.. నేను చచ్చేదాక అమ్మను వదలను అంటూ కార్తీక్ అంటే.. అలా అనకు అంటూ కార్తీక్ నోరును మూసింది. ఆ తర్వాత కారు నడుపుతాను అంటూ హిమ పట్టుబట్టింది. అయితే కార్తీక్ వారించాడు. అయితే నన్ను నిరాశపరిచావు అంటూ హిమ అని అంది. హిమకు కారు నడిపించాలనే పిచ్చి పట్టింది అంటే.. చిన్నప్పుడు నేను కూడా అలానే చేసే వాడిని అంటూ కార్తీక్ అన్నాడు. ఆ తర్వాత చిక్ మంగళూరు సందర్శనకు వెళ్లారు. హిమను తనపై కూర్చోపెట్టుకొని కార్తీక్ కారు నడిపించుకొంటూ ముందుకు వెళ్లారు.

నిన్ను వదిలి ఉండలేను అని దీప

నిన్ను వదిలి ఉండలేను అని దీప

కార్తీక్ కారు నడుపుతుండగా.. హిమ స్టీరింగ్ తిప్పుతూ నాకు కారు డ్రైవింగ్ వచ్చేసింది అంటే.. స్టీరింగ్ తిప్పడం వస్తే.. కారు డ్రైవింగ్ వచ్చినట్టు కాదు అని కార్తీక్ అంటే.. హిమను వెనుకకు పంపించు.. కారు డ్రైవింగ్ ఏమిటి అంటూ దీప అసహనం వ్యక్తం చేసింది. అయితే హిమ వ్యవహారంతో కంగారు పడిన దీప ఆలోచనల్లో పడింది. దాంతో ఈ కొండలు, గుట్టల్లో హోటల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నావా? అని కార్తీక్ అంటే.. నాకు ఏ హోటల్ పెట్టే ఆలోచన లేదు. నేను వంటలు చేసే ఇంట్రెస్ట్ లేదు. నీవు ఎక్కడుంటే.. నేను అక్కడే ఉంటాను. నిన్ను వదలి నేను ఉండను అంటూ దీప సమాధానం చెప్పింది. దాంతో మనం ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్దాం అంటూ శౌర్య చెప్పింది.

ఫంక్షన్‌కు రానంటూ సౌందర్య

ఫంక్షన్‌కు రానంటూ సౌందర్య

ఇదిలా ఉంటే.. కార్తీక్‌కు ముప్పు ఉందనే బెంగతో ఉన్న సౌందర్యను ఫంక్షన్‌కు తీసుకెళ్లేందుకు ఆనందరావు, ఆదిత్య ఒప్పించారు. అయితే సౌందర్య ఇంకా ఆందోళనగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కార్తీక్‌కు ఫోన్ కలిసి ఉంటే.. అమ్మ ప్రశాంతంగా ఉండేది. కానీ నెట్ వర్క్ ప్రాబ్లెం వల్ల కాల్ కలువడం లేదు. అన్నయ్య కూడా ఫోన్ చేయడం లేదు. ఈ నెట్ వర్క్ ప్రాబ్లెం లేకపోతే.. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లెం ఉండేది కాదేమో.. సరే మమ్మిని తీసుకొని వెళ్దాం అని ఆనందరావు అని చెబితే... తల్లిని తీసుకొని ఆదిత్య బయలుదేరేందుకు సిద్దపడ్డారు.

నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ

నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ

అయితే కార్తీక్‌పై బెంగతో మానసికంగా కుంగిపోయిన సౌందర్య.. నేను రాలేను. మీరు వెళ్లి రండి అని చెప్పింది. మీరు వెళ్లి రండి.. నాకు మానసికంగా ప్రశాంతత లేదు. మీ ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదు అని అంటే.. అంకుల్ వాళ్లు రెండుసార్లు ఫోన్ చేశారు. వాళ్లు వెయిట్ చేస్తుంటారు. వెళ్లకపోతే బాగుండదు అంటూ ఆదిత్య అన్నాడు. అయితే నన్ను ఇబ్బంది పెట్టకు మీరు వెళ్లిరండి. నేను ఇంట్లోనే ఉంటాను అని సౌందర్య అన్నారు. దాంతో ఆదిత్య, ఆనందరావు, శ్రావ్య ఫంక్షన్‌కు వెళ్లిపోయారు.

కార్తీక్ గురించి సౌందర్య ఆందోళన పడుతూ

కార్తీక్ గురించి సౌందర్య ఆందోళన పడుతూ

కార్తీక్ గురించి సౌందర్య మరింత కంగారుపడింది. పూజారి చెప్పిన విషయాన్ని అందరూ విన్నారు. కానీ నాకే ఎంత టెన్షన్ ఎందుకు? నేను అనవసరంగా ఆందోళనపడుతున్నానా? లేదు లేదు.. కన్నబిడ్డ కష్టపడితే.. నేనే బాధపడాల్సి ఉంటుంది కదా.. కడలిలో ఎగిసిపోయే కెరటాల్లా కష్టాలు అనుభవించిన నాకు.. ఇది ఎందుకు కంగారు పెడుతున్నది. కానీ.. ఏదో ఊహించని సంఘటన జరుగుతుందని కీడు శంకిస్తున్నది. ఇలా నెట్ వర్క్ లేదని తెలిస్తే.. వాళ్లను మరో ప్రదేశానికి పంపించే దానిని అంటూ కార్తీక్ కుటుంబానికి ఫోన్ ప్రయత్నించింది.

అమ్మా కారులో కూర్చో అంటూ హిమ

అమ్మా కారులో కూర్చో అంటూ హిమ

హిమ ముందు కారు నడుపుతుండగా.. మొబైల్‌లో మెసేజ్ రావడంతో నెట్ వర్క్ వస్తుందని కార్తీక్ అంటూ ఫోన్ చూశాడు. అయితే తల్లి నుంచి చాలా మిస్ కాల్స్ రావడంతో ఏంటి? మమ్మి చాలా కాల్స్ చేసింది అంటూ కారు పక్కనే ఆపాడు. కాల్ చేయడానికి ప్రయత్నిస్తే.. నెట్ వర్క్ లభించలేదు. దాంతో నెట్‌వర్క్ కోసం ప్రయత్నిస్తూ ముందుకు కార్తీక్ వెళ్లడంతో.. తనను వెంబడిస్తూ దీప వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే హిమ ఆపి కారులో కూర్చోపెట్టింది. నేను నడిపినట్టు యాక్టింగ్ చేస్తాను. నువ్వు నా పక్కన కూర్చో అని హిమ అంటే.. నీకు డ్రైవింగ్ పిచ్చి పట్టింది అంటూ శౌర్య అంది.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
కార్తీక్, దీప, హిమ ఫోటోలకు దండలు..

కార్తీక్, దీప, హిమ ఫోటోలకు దండలు..


ఇక నేను కూడా నాన్నమ్మకు ఫోన్ ట్రై చేస్తానంటూ పక్కకు శౌర్య వెళ్లడంతో బలవంతంగా తల్లి దీపను కారులో కూర్చోపెట్టింది. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లింది. కారు కంట్రోల్ తప్పడంతో దీప భయపడిపోయింది. కార్తీక్ అని అరవడంతో.. హిమ కారు నడుపుతూ ముందుకు తీసుకెళ్లడం చూసిన కార్తీక్ షాక్ అయ్యాడు. కారు వెంట పరుగెత్తుతూ చివరకు కారు డోర్ తీసి లోనికి వెళ్లాడు. కానీ అంతలోనే రాయిపైకి కారు ఎక్కి.. లోయలోకి పల్టీలు కొడుతూ పడింది. ఆ తర్వాత కార్తీక్, దీప, హిమ ఫోటోలకు దండలు వేయడం షాకింగ్‌గా మారింది. తాజా ఎపిసోడ్ ప్రోమో మరింత ఆసక్తిని రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X