Karthika Deepam ఫుల్లుగా మందు తాగేసి దీప రచ్చ.. వంటలక్క పెగ్గుపై పెగ్గుకొట్టడంతో కార్తీక్ బేజారు

చిక్‌మంగళూరు విహారయాత్రకు వెళ్లిన కార్తీక్, దీప ఫ్యామిలీకి ముప్పు పొంచి ఉందనే పూజారి హెచ్చరికలతో సౌందర్య ఆందోళనలో మునిగిపోయింది. తన కుమారుడికి ఎలాంటి ముప్పు కలుగుతుందనే ఆలోచనల్లో పడిన సౌందర్యకు భర్త ఆనందరావు ధైర్యం చెబుతూ.. కార్తీక్ ఇంట్లోని వెళ్లిపోయి.. పస్తులుంటే.. వాడిని తిరిగి తీసుకొచ్చావు. వాడికి డాక్టర్ సర్టిఫికెట్ వచ్చింది. మళ్లీ ప్రాక్టీస్ చేసుకొంటున్నాడు. బిడ్డ ప్రాబ్లెం కూడా క్లియర్ అయింది. ఇంకా బాధపడటానికి ఏముంది? నీవేందుకు బాధపడుతున్నావు. బాధపడటానికి అలవాటు పడి.. అనవసరంగా బాధపడుతున్నావు అని ఆనందరావు అంటే.. మీరు ఎంత ధైర్యం చెప్పినా నా మనసు ప్రశాంతంగా లేదు. భయం గుప్పిట్లో బందీ అయిపోయి.. దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను అని సౌందర్య అంటే.. భయం పిరికిది.. మనసు చాటున ఉండి భయపెడుతుంది. ఆ భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండు అని సౌందర్యకు ఆనందరావు చెప్పాడు. ఇంకా కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1295లో ఇంకా ఏం జరిగిందంటే..

ఫుల్లుగా తాగేసిన దీప..

ఫుల్లుగా తాగేసిన దీప..

ఇక చిక్‌మంగళూరులో కార్తీక్, దీప ఇద్దరూ ట్రిప్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీప తెచ్చిన లిక్కర్ బాటిల్‌ను ఓపెన్ చేసి ఇద్దరు పార్టీ చేసుకొన్నారు. పెగ్గు మీద పెగ్గు వేస్తూ ఎంజాయ్ చేశారు. తాగను తాగనంటూనే ఫుల్ తాగేస్తున్నావు అంటూ కార్తీక్ అన్నాడు. మీరు గొప్ప అంటే.. మీరు గొప్ప అని ఇద్దరూ పొగుడుకొన్నారు. ఇంకా ఓ పెగ్గు కావాలని దీప అడిగితే.. వద్దు అని కార్తీక్ వారించాడు. దాంతో నాకు మందు ఎక్కువైందని అనుకొంటున్నారా? నిన్ను ఎత్తుకోనా? ఫస్ట్ టైమ్ మందు తాగుతున్నానని భయపడుతున్నారా? నేను పెద్ద పెద్ద కష్టాలే చూశాను. ఈ రెండు పెగ్గులు ఎంత అంటూ దీప.. భర్తను ఎత్తుకొనేందుకు ప్రయత్నం చేసింది. ఏదైనా ఎంజాయ్ ఇక్కడే చేయాలి.. హైదరాబాద్ వెళ్తే.. ఎవరి గొడవల్లో వాళ్ల పడిపోతాం అని కార్తీక్‌తో దీప అంది.

డీజే టిల్లు, పైసా వసూల్ పాటలకు చిందులు

డీజే టిల్లు, పైసా వసూల్ పాటలకు చిందులు


మందు మత్తులో దీప హంగామా చేసింది. కార్తీక్‌ను ఏరా అంటూ వాగుడు మొదలుపెట్టింది. బయట మ్యూజిక్ వినిపిస్తే.. బయటకు వెళ్లి డ్యాన్స్ చేద్దాం పద అంటూ దీప బలవంతం చేసింది. నీవు డ్యాన్స్ చేస్తావా? అంటే.. ఏమిటి నాకేమటి తక్కువ.. నాకు వయసు మీరిందనుకొంటున్నావా? అని కార్తీక్‌తో దీప అంది.. కార్తీక్, దీప ప్రేమలో మునిగి ముద్దులు పెట్టుకొంటూ ట్రిప్‌ను ఎంజాయ్ చేశారు.

మామా.. ఏక్ పెగ్ లావ్ అంటూ..

మామా.. ఏక్ పెగ్ లావ్ అంటూ..

రిసార్టు బయటకు వెళ్లి డీజే టిల్లు, పైసా వసూల్ పాటకు డ్యాన్స్ చేసేందుకు ప్లాన్ చేశారు. మందు మత్తులో తూలుతూ హల్‌చల్ చేశారు. మందు ఎక్కువైందని దీపను కార్తీక్ వారించాడు. కిందపడబోతుంటే.. పట్టుకొన్నాడు. కింద పడిపోతానని భయమా? నేను నీకు ఎప్పుడో పడిపోయాను అంటూ దీప హంగామా చేసింది. చివరకు మామా ఏక్ పెగ్ లా అంటూ బాలకృష్ణ పాటకు స్టెప్పులేసి ఇరుగదీసింది.

కార్తీక్‌ను బెడ్‌పైకి లాగేసుకొని

కార్తీక్‌ను బెడ్‌పైకి లాగేసుకొని


రాత్రి మందు పార్టీని జోరుగా ఎంజాయ్ చేసిన దీప, కార్తీక్ ఉదయాన్ని లేచి హ్యాపీగా ఒకరినొకరు మాటలు చెప్పుకొంటూ కనిపించారు. దీపను చూస్తూ రాత్రి చేసిన హంగామా నీకు గుర్తుందా అంటూ కార్తీక్ తన మనసులో అనుకొన్నాడు. ఇద్దరం మందు కొట్టడం ఏమిటి? డ్యాన్స్ చేయడం ఏమిటి? ఇదంతా ఊహించుకొంటేనే చాలా బాగుంది దీప అంటూ కార్తీక్ మనసులో అనుకొంటూ సంతోషంలో మునిగిపోయాడు. మగత నిద్రలో ఉన్న దీపను ముద్దు పెట్టుకోబోతే.. కార్తీక్‌ను బెడ్‌పైకి లాగేసుకొంది. రాత్రి నేనేమైనా ఎక్కువ చేశానా అని దీప అంటే.. చాలా ఎక్కువే చేశావు. నన్ను చాలా ఆనందంలో ముంచెత్తావు అని కార్తీక్ అంటే.. లేదు.. నేనేమైనా ఎక్కువ చేశానా? అంటూ దీప అడిగితే.. లేదు లేదు అంటూ కార్తీక్ సమాధానం చెప్పారు.

కార్తీక్, దీపపై మోనిత కుట్రలు

కార్తీక్, దీపపై మోనిత కుట్రలు

ఇక కార్తీక్, దీప ఫ్యామిలీతోపాటు చిక్‌మంగుళూరుకు వెళ్లిన విషయం మోనిత తెలుసుకొని షాక్ తిన్నది. సకుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లావా? నీవు చిక్ మంగళూరు వెళితే.. నేను కామ్‌గా ఉండటం సరికాదు కదా.. గాలిలో ధూళిలా..నీవు ఎక్కడుంటే.. నేను అక్కడ ఉండాలి కదా.. నువ్వు మార్చినట్టుగా నేను మార్చుకోలేను అని మోనిత ఆవేశపడింది. గతంలో చిక్ మంగళూరులో దీపపై కార్తీక్ అనుమానం వచ్చేలా, ఆ తర్వాత వారిద్దరిని విడదీయడానికి చేసిన ప్లాన్స్ అన్నీ మోనిత గుర్తు చేసుకొన్నది.

కారు ప్రమాదంలో కార్తీక్, దీప మృతి?

కారు ప్రమాదంలో కార్తీక్, దీప మృతి?

ఇక కార్తీకదీపం సీరియల్ తాజా ప్రోమోలో మరో ట్విస్టు చోటు చేసుకొన్నది. కూతురు హిమ తన తల్లి దీపను కారు ఎక్కించుకొని స్టార్ట్ చేయడం, కారు కంట్రోల్ చేయలేకపోతున్న సమయంలో వారిని రక్షించుకొనేందుకు కార్తీక్ ప్రయత్నించాడు. ఎలాగోలా కారులోకి కార్తీక్ వెళ్లిన వెంటనే అది లోయలో పడి పేలిపోవడం కనిపించింది. ఆ తర్వాత కార్తీక్, దీప, హిమ ఫోటోలకు దండ వేయడం మరో ట్విస్టుగా మారింది. ఈ ప్రోమో తదుపరి ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X