For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam‌ లో భారీ ట్విస్టు.. బలవంతంగా హిమకు తాళి కట్టిన నిరుపమ్.. షాక్‌లో శౌర్య

  |

  డాక్టర్ నిరుపమ్‌కు జ్వాలా అలియాస్ శౌర్య చేత ఐ లవ్ యూ చెప్పించాలని చేసిన ప్రయత్నం విఫలం కావడంతో హిమ ఆలోచనల్లో పడింది. ఏడడుగులు నడిచి జ్వాలా తన మనసులోని ప్రేమను వ్యక్తం చేయడానికి సిద్దమైన సమయంలో ఆమెకు ఫోన్ రావడం.. ఫోన్‌లో మాట్లాడుతూ ఐ లవ్ యూ చెప్పకుండా వెళ్లిపోవడంపై హిమ తీవ్రంగా ఆలోచించింది. నా పేరు చెప్పి జ్వాలాను ఎవరు బెదిరించారు. శత్రువు అంటూ నా కోసం వెతుకుతున్న జ్వాలాకు నా పేరుతో ఎవరు కాల్ చేశారు. దీని వెనకు ఎవరైనా ఉన్నారా? ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకు? నేనే హిమ అని చెప్పేస్తాను. నేను హిమ అని తెలిస్తే.. కోపంతో అరిస్తుందేమో... అని అనుకొన్నది. అయితే మళ్లీ.. నేనే హిమ అని చెబితే.. జ్వాలా తన నిర్ణయాన్ని మార్చుకొంటుదేమో.. నిరుపమ్, జ్వాలా కలిసే అవకాశం చేజారిపోతుందేమో అనే సందేహాలు హిమలో కలిగాయి. కార్తీకదీపం సీరియల్ 1379 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  హిమ నాటకాన్ని గ్రహించిన శోభ

  హిమ నాటకాన్ని గ్రహించిన శోభ

  హాస్పిటల్ పెట్టిన డాక్టర్ శోభ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొన్నది. అయితే ఇప్పటికే మీరు ఎక్కువగా లోన్లు తీసుకొంటున్నారు అని బ్యాంక్ ప్రతినిధి అంటే.. నాకు తెలుసు అన్నట్టు సైగ చేసింది. నేను హాస్పిటల్ పెట్టి అప్పుల్లో పడ్డాను. నిరుపమ్‌ను పెళ్లి చేసుకొంటేనే నేను అప్పుల్లో నుంచి బయటపడుతాను. జ్వాలా, హిమను అడ్డు తొలగించుకొంటేనే నా సమస్యలు తీరిపోతాయి అని శోభ అనుకొన్నది. అంతలోనే పేషెంట్ రావడంతో.. రిపోర్టులు చూసి.. మీ బ్లడ్ గ్రూప్ రేర్ అని శోభ అంటే.. లాస్ట్ టైమ్ బ్లడ్ దొరకపోతే.. హిమ అనే డాక్టర్ బ్లడ్ ఇచ్చింది అనగానే శోభ కంగారు పడింది. హిమ అని పేరు తప్పు చెబుతున్నారేమో అంటే.. లేదు.. సహాయం తీసుకొన్న వారి పేరు ఎలా మరిచిపోతామని పేషెంట్ అన్నారు.

  నీవు మహానటివి అంటూ

  నీవు మహానటివి అంటూ

  అయితే హిమ క్యాన్సర్ అని నాటకం ఆడుతుందా అనే అనుమానం శోభకు వచ్చింది. హిమకు క్యాన్సర్ లేదనే విషయాన్ని బయటపెట్టేందుకు శోభ ప్లాన్ చేసింది. మళ్లీ బ్లడ్ డొనేషన్ కోసం హిమను పిలిపించింది. హిమ బ్లడ్ డొనేషన్ కోసం రావడంతో శోభ సంతోషపడింది. దొరికావే అంటూ శోభ ఆనందపడిపోయింది. హిమ బ్లడ్ డొనేషన్ చేసి వస్తుంటే శోభ ఎదురుపడింది. శోభను చూడగానే.. హిమ కంగారు పడింది. డాక్టర్‌ను కలుద్దామని వచ్చాను అంటే.. బాగానే నాటకం ఆడుతున్నావు. అమాయకంగా ఉంటావు కానీ.. నీలో మంచి మహానటి ఉంది అని శోభ ఎద్దేవా చేసింది. అంతలోనే పేషెంట్స్ వచ్చి.. మీరు గొప్ప సహాయం చేసి.. మమ్మల్ని ఆదుకొన్నారు అంటూ అనగానే మరింత ఇబ్బంది పడింది.

  క్యాన్సర్ ఓ నాటకం అంటూ

  క్యాన్సర్ ఓ నాటకం అంటూ

  బ్లడ్ డొనేషన్ తర్వాత హిమకు క్యాన్సర్ వ్యాధి లేదనే విషయం శోభకు అర్ధమైంది. మరీ నిరుపమ్‌ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరించిందనే ఆలోచనల్లో పడింది. నిరుపమ్‌ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ ఒక నాటకం.. హిమకు క్యాన్సర్ ఉందని ఓ నాటకం.. నిరుపమ్‌కు జ్వాలాను ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం మూడో నాటకం అంటూ శోభ మనసులో అనుకొన్నది. ఈ నాటకాన్ని బయటపెట్టి.. నిరుపమ్‌ను సొంతం చేసుకొంటాను అని డాక్టర్ శోభ మనసులో అనుకొన్నది.

  హిమను వెంటాడిన ప్రశ్నలు

  హిమను వెంటాడిన ప్రశ్నలు

  అయితే తాను బ్లడ్ డొనేషన్ చేసి శోభకు దొరికిపోవడంతో హిమ కంగారు పడిపోయింది. అమ్మా, నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. శౌర్యను జాగ్రత్తగా చూసుకో అంటూ తల్లిదండ్రులు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని కన్నీరుపెట్టుకొన్నది. ఒకవేళ నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే.. నిరుపమ్, జ్వాలా పరిస్థితి ఏమిటి? అయితే నేను చనిపోతే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? ఒకవేళ చనిపోయిన తర్వాత నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే.. జ్వాలా పరిస్థితి ఏమౌతుంది అనే ప్రశ్నలు హిమను వెంటాడాయి.

  అందుకే ఐ లవ్ యూ చెప్పలేదు..

  అందుకే ఐ లవ్ యూ చెప్పలేదు..


  డాక్టర్ సాబ్‌కు ఐ లవ్ యూ చెబితే బాగుండు.. ఫోన్ వచ్చి డిస్ట్రబ్ చేసింది. నా కోసం హిమ వెతుకున్నదా? నేను హిమ కోసం నేను వెతుకుతుంటే.. ఆమె నా కోసం వెతుకుతున్నది. హిమ పేరు చెప్పి ఎవరైనా నాటకం ఆడుతున్నారా? హిమ పేరుతో నాటకం ఆడాల్సిన పని ఎవరికి ఉంది? లాంటి ప్రశ్నలు జ్వాలాను వెంటాడాయి. అక్కడి నుంచి నేరు నిరుపమ్ వద్దకు వెళ్లింది. ఐ లవ్ యూ చెప్పకుండా వెళ్లినందుకు డాక్టర్ సాబ్‌కు కోపం వచ్చిందేమో.. ఇప్పుడు సారీ చెప్పాలా? అని మనసులో అనుకొంటూ.. డాక్టర్ సాబ్ హిమ కనిపించడం లేదు అంటే.. బయటకు వెళ్లింది అని నిరుపమ్ సమాధానం చెప్పాడు. అసలు విషయం ఏమిటంటే.. అనుకోకుండా ఫోన్ వచ్చింది.. అందుకే ఐ లవ్ యూ చెప్పకుండా వెళ్లిపోయాను. మీరు ఆ రోజు నాకు ఐ లవ్ యూ చెప్పారు. అప్పుడు నేను చాలా సంతోషపడిపోయాను. నేను మీకు నచ్చడం నా అదృష్టం. మీరంటే నాకు ఇష్టం. ఈ విషయం చెప్పాలని చాలా రోజల క్రితం అనుకొన్నాను. కానీ తింగరి చెప్పకుండా ఆపింది. మీరంటే చాలా ఇష్టం. ప్రాణం.. ఐ లవ్ యూ అని చెబితే.. సీటులో నుంచి నిరుపమ్ వెళ్లిపోయాడు.

  హిమకు తాళికట్టిన నిరుపమ్

  హిమకు తాళికట్టిన నిరుపమ్

  కార్తీకదీపం సీరియల్‌లో మరో భారీ ట్విస్టుకు తెరలేపారు. డాక్టర్ నిరుపమ్, జ్వాలా, హిమ, శోభ మధ్య సాగుతున్న ప్రేమ, పెళ్లి నాటకానికి ముగింపు పలికారు. జ్వాలాను లాక్కెళ్లి.. గుడిలో హిమకు నిరుపమ్ తాళి కట్టాడు. ఇప్పుడు మనం భార్య,భర్తలం. ఇక మనల్ని ఎవరు విడదీయలేరు అని నిరుపమ్ చెప్పడం ప్రోమోలో కనిపించింది. నిరుపమ్, హిమ పెళ్లిని శౌర్య చూసి షాక్‌కు గురైంది. అయితే ఈ ఎపిసోడ్ నిజమా? ఎవరైనా కలగన్నారా? అనేది వచ్చే ఎపిసోడ్‌లో తేలిపోతుంది.

  English summary
  Karthika Deepam may 15th Episode number 1379.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X