twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam వంటలక్క బతికే ఉందా? శౌర్య వెతికిన చోటే దీప.. బిగ్ ట్విస్ట్

    |

    సౌందర్య చీరె తెచ్చి ఇచ్చి పూజకు వెళ్దామని చెప్పడంతో హిమ కంగారు పడింది. అంతలోనే ప్రేమ్ వచ్చి.. చీరె ఎందుకు? ఏదైనా పూజ ఉందా? అంటే..బావ..నాన్న గుడికి వెళ్దామంటుంది. నిరుపమ్, శౌర్య పెళ్లి చేయడానికి నీ వద్ద ప్లాన్ ఉందని చెప్పావు కదా అని హిమ అంటే.. ఇంకా చాలా టైమ్ ఉంది అని ప్రేమ్ అన్నాడు. అయితే రోజులు తగ్గి.. గంటలు వరకు వచ్చింది అంటే.. ఈ పెళ్లిని ఆపేందుకు రకరకాలుగా ఆలోచిస్తున్నాను అని హిమకు ప్రేమ్ చెప్పాడు. అయితే హిమను పెళ్లి చేసుకొంటే.. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది కదా.. ఈ విషయం హిమకు చెబితే ఎలా ఉంటుందని అనుకొంటూ.. మళ్లీ ఎందుకులే అని ప్రేమ్ మనసు మార్చుకొన్నాడు. అయితే ఈ పెళ్లిని ఎలాగోలా ఆపేస్తాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది.. అది ఫెయిల్ అయితే.. మరో బ్రహ్మండమైన ప్లాన్ ఉంది. అది ప్రయోగిస్తాను అంటూ ప్రేమ్ చెప్పాడు. కార్తీకదీపం సీరియల్‌ 1430 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    శౌర్యతో తాత సెల్పీ

    శౌర్యతో తాత సెల్పీ


    చీర కట్టుకొని పూజకు సిద్దమైన శౌర్యను చూసి తాత ఆనందరావు చూసి ఆనందపడిపోయాడు. కుందనపు బొమ్మలా.. తెలుగు ఆడపడుచులా ఉన్నావు అని ఆనందరావు అంటే.. నీకు ఏమి పనిలేదు. నన్ను పొగడటం తప్ప అని అంటే...నేను ముసలివాడిని అయ్యాను. నా మనవరాళ్లను చూసి ఆనందపడటం కంటే ఇంకా ఏం పని ఉంటుంది. నీతో నేను ఒక సెల్ఫీ దిగుతాను.. దగ్గరకు రా అంటూ పిలిచాడు. సెల్ఫీ దిగుతుంటే.. కెమెరా వైపు చూసి నవ్వు అంటూ సెల్ఫీ దిగాడు. ఇది నా జీవితంలో నా తొలి సెల్పీ అంటూ.. ఈ ఫోటోను చూస్తే.. శౌర్య ఆటో డ్రైవర్ అంటారా.. ఇంతకు నీవు ఆటో డ్రైవర్ ఎలా అయ్యావు అంటే.. తన కథను చెప్పడం మొదలుపెట్టింది.

    శౌర్యను కలిసిన వారణాసి

    శౌర్యను కలిసిన వారణాసి

    హిమపై కోపంతో పారిపోవడం, నాన్నమ్మ కలిస్తే.. నీవు మళ్లీ కలిస్తే నేను పారిపోతాను. హిమ ఉన్న ఇంట్లో నేను ఉండను అని చెప్పింది. అయితే ఓ రోజు ఆటోడ్రైవర్ వారణాసి శౌర్యను వెతుక్కొంటూ వెళ్లాడు. అయితే నిన్ను నానమ్మ పంపించిందా అని అడిగితే.. శౌర్యకు వారణాసి అబద్దం చెప్పాడు. దీపమ్మ, డాక్టర్ బాబు దేహాలను కూడా చూడలేకపోయాను. వారి కోసం వెతుకుతున్నాను అని వారణాసి చెప్పాడు. దాంతో నేను కూడా అమ్మ,నాన్న వెతుక్కొంటూ ఇక్కడికి వచ్చాను. నీవు ఇంకా ఆటో నడుపుతున్నావా? నీవు నాకు ఆటో నేర్పించాలి అని శౌర్య అంటే.. నీవు ఆటో నడపటం ఏమిటి? నీవు పెద్దింటి అమ్మాయివి ఆటో నడపటం ఏమిటి? అని వారణాసి అంటే. హిమ ఉన్న ఇంటికి నేను రాను. ఇక్కడే ఆటో నడుపుకొంటూ బతుకుతాను అని హిమ చెప్పింది.

    అమ్మ,నాన్నలు బతికే ఉంటారని

    అమ్మ,నాన్నలు బతికే ఉంటారని

    యాక్సిడెంట్ తర్వాత కనిపించకుండా పోయిన తన తల్లిదండ్రుల గురించి వారణాసితో కలిసి వెతికింది. ఓ హాస్పిటల్‌లో వెతుకుతుండగా.. బెడ్‌పై దీప (వంటలక్క) ట్రీట్‌మెంట్ తీసుకొంటూ కనిపించింది. అయితే ఆమెను గమనించకుండా.. శౌర్య వారణాసి వెళ్లిపోయారు. హాస్పిటల్‌లో వినాయకుడి ముందు చేతులు జోడించి.. మా అమ్మనాన్నలు ఎప్పటికైనా కనిపిస్తారా అంటూ ప్రశ్నించింది. వారణాసి వాళ్లు ఇక్కడ లేరంటే.. ఇంకా ఎక్కడో ఉన్నారన్నటే కదా అని హిమ అంటే.. ఇక్కడ లేరంటే.. ఎక్కడో ఉన్నట్టే అని వారణాసి అంటే.. అమ్మ, నాన్న బతికే ఉండి ఉంటారు. అందుకే నేను ఇక్కడే ఉంటాను అని శౌర్య చెప్పింది. అమ్మ, నాన్న ఎక్కడ ఉన్నారు.. త్వరగా కనిపించండి అంటూ ఏడ్చిన విషయాన్ని ఫ్లాష్ బ్యాక్ రూపంలో తాతయ్యకు శౌర్య చెప్పింది.

    అమ్మ నా వెనుక సీట్లోనే ఉన్నట్టు

    అమ్మ నా వెనుక సీట్లోనే ఉన్నట్టు

    వారణాసి ఆటోలో అమ్మ కూర్చొని ప్రయాణించేది. అందుకే నేను ఆటోనే నడుపుతున్నాను. నా ఆటో వెనుక అమ్మ.. త్వరగా రా అంటూ రాయించాను. ఆటో నడుపుతూ వెనక్కి చూస్తే.. అమ్మ కూర్చొని ఉన్నట్టు అనిపిస్తుంది. ఆటోలో కూర్చొని చిరునవ్వు చిందిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పటికైనా ఆటో నేర్చుకోవాలనుకొన్నాను. అమ్మను కూర్చొపెట్టుకొని ఆటో నడుపాలని కోరిక అలానే మిగిలింది. ఆటో అంటే అందరికి చిన్నచూపు. కానీ నాకు అది వరం అని శౌర్య ఎమోషనల్ అయ్యింది.

    యాక్సిండెంట్ సమయంలో దీప

    యాక్సిండెంట్ సమయంలో దీప


    అయితే శౌర్య మాటలు వింటున్న ఆనందరావు కాస్త దూరంగా జరిగితే.. ఎందుకు దూరంగా ఉంటున్నావని శౌర్య అడిగితే.. నీ వద్దకు వారణాసిని పంపింది మేమే అని ఆనందరావు చెప్పాడు. అయితే మీరు అప్పటి నుంచే నన్ను మోసం చేయడం చేస్తున్నారా అంటే.. శౌర్యను సౌందర్య లాగిపెట్టి కొట్టింది. నీ వద్దకు వచ్చి.. రమ్మంటే రానని చెప్పావు అని సౌందర్య అంటే.. అప్పుడే ఇలా చెంపపై కొట్టి చెబితే బాగుండేది కదా. అలా చేస్తే అమ్మ కోరిక మేరకు నేను కలెక్టర్ అయ్యేదానిని కదా అని శౌర్య అంటే.. యాక్సిడెంట్ సమయంలో శౌర్యను బాగా చూసుకో అని నాన్న చెప్పిన మాటకు నెరవేర్చలేకపోతున్నానే బాధ నాలో ఉంది అని శౌర్య అంది. అప్పటి నుంచే నీవు మోసం చేస్తున్నావా అంటూ శౌర్య, హిమ గొడవపడుతుంటే.. ఇక ఆపండి.. మీరు గుడికి బయలుదేరండి అని వార్నింగ్ ఇచ్చింది. వచ్చేటప్పుడు ఫోటోలకు దండం పెట్టి రండి.. చెప్పింది. అయితే కార్తీక్, దీప ఫోటోలకు దండలు తీసేయడం చూసి సౌందర్య కంగారుపడింది.

    నీ పెళ్లే నాకు పెద్ద ప్రాబ్లెం

    నీ పెళ్లే నాకు పెద్ద ప్రాబ్లెం


    ఒకవైపు పెళ్లి రోజు దగ్గరపడుతుండటంతో నిరుపమ్ కంగారుపడ్డాడు. శౌర్యను పెళ్లి చేసుకోమని హిమ పట్టుపడుతుంది. పెళ్లి పీటల మీద నుంచి మళ్లీ పారిపోతుందా అని నిరుపమ్ మనసులో అనుకొన్నాడు. అయితే తన సోదరుడు ప్రేమ్ అదోలా ఉండటం చూసి... అలా ఉన్నావేంటి అంటే.. మూడ్ బాగాలేదు అని అంటే.. నా పెళ్లి కానివ్వు.. నీ హెల్త్ గురించి ఆలోచిస్తా అంటే.. నీ పెళ్లే నాకు పెద్ద ప్రాబ్లెం అని ప్రేమ్ అన్నాడు. అంతలోనే హిమ నుంచి ఫోన్ రావడంతో నిరుపమ్ షాకింగ్ మూడ్‌లోకి వెళ్లాడు.

    వంటలక్క రీ ఎంట్రీ

    వంటలక్క రీ ఎంట్రీ

    ఇదిలా ఉండగా.. కార్తీకదీపం తాజా ఎపిసోడ్‌లో తదుపరి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో భారీ ట్విస్ట్ ఇచ్చారు. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్న వంటలక్క అలియాస్ దీప బెడ్ మీద నుంచి లేచినట్టు చూపించారు. బెడ్ పైనుంచి లేచిన దీప.. కార్తీక్ అంటూ అరిచింది. ఈ ట్విస్టుతో కార్తీకదీపం సీరియల్ మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.

    English summary
    Karthika Deepam 10th August Episode number 1430.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X