Karthika Deepam కార్తీక్ కోసం మార్చురీకి వెళ్లిన దీప.. అసలేం జరిగిందంటే?
యాక్సిడెంట్ తర్వాత స్పృహలోకి వచ్చిన దీప.. భర్త కార్తీక్ కోసం హాస్పిటల్ పరిసర ప్రాంతాలన్నీ వెతికి అలసిపోయి ఓ చోటు కూర్చున్నది. అయితే దీప బాధను చూసి తట్టుకోలేని డాక్టర్ వచ్చి.. మీ డాక్టర్ బాబు ఎవరు? ఎక్కడ ఉంటారు అని ప్రశ్నలు వేశాడు. దాంతో డాక్టర్ బాబు నా భర్త. హైదరాబాద్‌లో ఆయన ఫేమస్ కార్డియాలజిస్ట్. చిక్‌మంగళూరుకు విహార యాత్రకు వచ్చిన సమయంలో జరిగిన ప్రమాదాన్ని వివరంగా డాక్టర్‌కు చెప్పింది. కార్తీకదీపం సీరియల్ 1432 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

డాక్టర్ బాబు నన్ను వదలి వెళ్లడు
నా కార్తీక్ ఎప్పుడూ నన్ను వదిలి వెళ్లడు. నాతోనే డాక్టర్ బాబు ఉంటాడు. నా కార్తీక్ బతికే ఉంటాడు అన్నయ్య అని డాక్టర్‌తో తన ఆవేదనను పంచుకొన్నది. అయితే దీప ఆవేదన అర్దం చేసుకొన్న డాక్టర్.. నీవు అన్నయ్య అని అన్నావు కదా.. నీకు నేను సహాయం చేస్తాను అంటూ దీపకు డాక్టర్‌గా నిలిచాడు.

మార్చురీకి వెళ్లి చూద్దాం అంటూ
అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత కార్తీక్ బతికి ఉంటే.. నిన్ను విడిచి వెళ్లిపోయి ఉండడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఏ యాక్సిడెంట్‌లో చనిపోయినా ఆ డెడ్ బాడీలన్నింటిని ఇక్కడ హాస్పిటల్‌లోకి తెస్తారు. కాబట్టి మనం హస్పిటల్ మార్చురికి వెళ్లి వెతుకుదాం అని దీపకు డాక్టర్ చెప్పాడు. అయితే దీప మార్చురికి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో.. నీవు ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే మన నమ్మకం నిజమవుతుంది అని డాక్టర్ ఒప్పించి దీపను మార్చురీలోకి తీసుకెళ్లాడు.

కార్తీక్ ధరించిన షూస్ కనిపించడంతో
మార్చురీలో బెడ్స్‌పై ఉన్న డెడ్ బాడీలపై దుప్పట్లు కప్పి ఉండటంతో ముఖాలు కనిపించలేదు. అయితే మీకు ప్రమాదం జరిగిన రోజు వచ్చిన డెడ్ బాడీ ఇదే అని డాక్టర్ చూపించగా.. ఆ పక్కనే యాక్సిడెంట్ జరిగిన రోజు కార్తీక్ ధరించిన షూస్ కనిపించాయి. దాంతో మరింత దు:ఖంలో

ఊపిరి పీల్చుకొన్న దీప
అయితే దీప బెదిరిపోతుంటే.. భయపడకు.. ఒక్కసారి ముఖంపై దుప్పటి తీసి చేస్తే మన డౌట్స్ క్లియర్ అవుతాయి. రా అమ్మా అంటూ బతిమిలాడుతూ.. ముఖంపై దుప్పటి తీశాడు. దాంతో ఆ ముఖాన్ని చూడటానికి భయపడటంతో.. ధైర్యం తెచ్చుకొని మెల్లగా చూడమని చెబితే .. అటు వైపు చూసి ఊపిరి పీల్చుకొన్నది. దాంతో మన నమ్మకమే నిజమైంది. డాక్టర్ బాబు కోసం మనం వెతుకుదాం.. అప్పటి వరకు మా ఇంటికి వెళ్దాం అంటూ దీపను డాక్టర్ తీసుకెళ్లాడు.

డాక్టర్ బాబు తల్లి ఆవేదన
దీపను తీసుకొని ఇంటికి వెళ్లిన డాక్టర్.. అమ్మా.. ఇంటికి నీ కూతురుని తీసుకొస్తానని చెప్పానుగా అంటూ తన తల్లికి దీపను పరిచయం చేశాడు. దీపను చూసి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి నీ కోసం ఎంత తాపత్రయం పడ్డాడో.. నీకు అంతా మంచి జరగాలని నేను దేవుడిని కోరుకొన్నాను. నీకు జరిగిన సంఘటన పగవాడికి కూడా జరగకూడదు. ఏది జరిగినా అంతా మంచికే అనుకొందాం అని డాక్టర్ తల్లి చెప్పింది.


Click it and Unblock the Notifications











