Karthika Deepam డాక్టర్ సాబ్ పెళ్లి పనులు ప్రారంభం.. నిరుపమ్ పెళ్లి ఎవరితో అంటే?
ఐ లవ్ యూ అంటూ జ్వాలా మాటల గురించి డాక్టర్ నిరుపమ్ తీవ్రంగా ఆలోచింపజేశాయి. జ్వాలా మనుసులో ప్రేమ ఉందని తెలిసినప్పుడు హిమ తమ గురించి చెప్పాల్సింది. ఆ ప్రేమను మొగ్గలోనే తుంచి వేస్తే ఇంత సమస్య ముందుకు వచ్చేది కాదు. జ్వాలాలో నాపై ప్రేమ పెరగకుండా ఉండేది. హిమ అతి మంచితనం వల్లే ఇదంతా జరిగిందా? అదేంటో గానీ.. జ్వాలాకు నేను ప్రేమించడం లేదని చెప్పడానికి కుదర్లేదు. జ్వాలాను పెళ్లి చేసుకోవాలని హిమ విచిత్రమైన కోరికను కోరుతున్నది. ఇవేం నాకు అర్ధం కావడం లేదు అని నిరుపమ్ ఆలోచనల్లో పడ్డారు. కార్తీక దీపం సీరియల్‌లో 1380 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

ఆశ్రమానికి రమ్మంటూ ఫోన్
మోనిత కుమారుడు రవ్విడ్లీ వద్దకు జ్వాలా వెళ్లింది. మోనిత కుమారుడైనంత మాత్రాన రవ్విడ్లీని ఎందుకు దూరం పెట్టాలి అంటూ మనసులో అనుకొన్నది. జ్వాలాను చూడగానే.. ఏంటి అసలు రావడం లేదు అంటే... ఇదిగో డబ్బు తీసుకో.. చదువుకు ఉపయోగించుకో అని జ్వాలా ఇస్తే.. డబ్బు ఇవ్వడానికే వచ్చావా? అని రవ్విడ్లి అన్నాడు. దాంతో అలాంటి మాటలు మాట్లాడకుండా డబ్బు తీసుకో అని జ్వాలా చెప్పింది. అంతలోనే హిమ ఫోన్ చేస్తే.. రవ్విడ్లీ వద్ద ఉన్నాను. నీవు కూడా డబ్బులు ఇస్తున్నట్టు తెలిసింది అని జ్వాలా అంటే.. నీవు ఆశ్రమానికి రా అంటూ చెబితే.. నువ్వే రవ్విడ్లీ వద్దకు రా.. ఇద్దరం కలిసి ఆశ్రమంకు వెళ్దాం అని జ్వాలా చెప్పింది.

డాక్టర్ నిరుపమ్ పలు ఆలోచనలతో
జ్వాలా విషయంలో హిమ ఇలా ఎందుకు చేస్తున్నది. మా మధ్య ఉన్న ప్రేమను జ్వాలాకు ఎందుకు చెప్పలేకపోతున్నది. జ్వాలాలో ఆశలు పెంచుతున్నది. మా బావను నేను ప్రేమిస్తున్నానని సూటిగా చెప్పవచ్చు కదా. ఈ రోజు ఎలాగైనా చెప్పేస్తాను. బావను ప్రేమిస్తున్నానని చెబితే.. కాసేపు బాధపడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే.. నేను ఎందుకు హిమను పెళ్లి చేసుకోకూడదు. ముహుర్తాలు పక్కన పెట్టి హిమను తీసికెళ్లి నేను తాళి కడితే.. అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్టు అవుతుంది అని నిరుపమ్ తన మనసులో అనుకొన్నాడు. హిమను గుడికి రమ్మని చెప్పాడు.

డాక్టర్ శోభకు భయంకరమైన కల
గుడి వద్దకు వచ్చిన హిమను బలవంతంగా లోనికి లాక్కెళ్లాడు. అమ్మవారి విగ్రహం ముందు ఉన్న పసుపు కుంకుమను తీసుకొని.. హిమ నుదుటిపైన పెట్టాడు. అక్కడే ఉన్న తాళిని తీసుకొని.. పూజారిని పెళ్లి మంత్రాలు చదవమన్నాడు. హిమ ఊహించని విధంగా నిరుపమ్ ఆమె మెడలో తాళి కట్టాడు. రెండు చేతులు పట్టుకొని అమ్మవారికి మొక్కించాడు. ఈ రోజు నుంచి నా భార్యవు. నీవు నా అర్దాంగివి. నా శరీరంలో సగభాగానివి. ఇక నుంచి నువ్వు నేను ఒక్కటే.. ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పాడు. ఇదంతా డాక్టర్ శోభ కలగనడంతో పెద్ద ట్విస్టుగా మారింది. కల నుంచి బయటపడిన శోభ .. ఒకవేళ నిరుపమ్, హిమ పెళ్లి చేసుకొంటే.. నో.. వారిద్దరిని విడదీసి.. నిరుపమ్ పెళ్లి చేసుకోంటానని డాక్టర్ శోభ మనసులో అనుకొన్నది.

నానమ్మ నటిస్తుందా? అంటూ జ్వాలా
హిమ పేరుతో వచ్చిన ఫోన్ కాల్ గురించి జ్వాలా రకరకాలుగా ఆలోచించింది. హిమ ఎందుకు ఇలా ఫోన్ చేస్తున్నది. హిమ కావాలనే చేస్తున్నదన్నమాట.. నేను ఏడిపించానని.. నానమ్మకు చెప్పిందా? నానమ్మకు తెలిస్తే.. ఊరుకోదు కదా.. నానమ్మకు తెలిసినా నటిస్తుందా? నానమ్మ అలాంటి పనులు చేయదు. నానమ్మకు నటించడం సాధ్యం కాదు. నానమ్మకు హిమ నాకు గురించి చెప్పలేదా? హిమకు ఎందుకింద పొగరు అని జ్వాలా కోపంతో ఊగిపోయింది.
Recommended Video


హిమతో పెళ్లి.. పనులు మొదలెట్టండి
ఇదిలా ఉండగా.. తన తల్లిదండ్రులను పిలిచి నిరుపమ్ తన పెళ్లి గురించిన ప్లాన్స్ చెప్పాడు. హిమను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. ఆయుష్షు తక్కువైనా నేను పెళ్లి చేసుకొంటాను. పెళ్లి పనులు మొదలుపెట్టండి. పెళ్లి పనులు దేనితో మొదలుపెడుతారు అంటూ తన తల్లి స్వప్నను అడిగితే.. పసుపు కొట్టడంతో అంటూ సమాధానం చెప్పింది. ఇక దాంతో పెళ్లి పనులు మొదలుపెట్టండి. నాకు కాబోయే భార్య కోసం చీరలు కొనండి అంటూ నిరుపమ్ ఉత్సాహంగా చెప్పుకొంటూ పోయారు. అయితే ఇంకా హిమ అంటే నిరుపమ్‌కు ఇంత పిచ్చా అని స్వప్న మనసులో అనుకొన్నది.


Click it and Unblock the Notifications











