Karthika Deepam మనసులో ప్రేమను చెప్పేందుకు డాక్టర్ నిరుపమ్.. జ్వాలా ఏం చేసిందంటే?

సౌందర్య, జ్వాలా అలియాస్ ఇద్దరు సూపర్ మార్కెట్ వద్ద ఎదురుపడ్డారు. జ్వాలాను చూస్తూ.. మంచి పనులే చేస్తావు. కానీ పొగరే ఎక్కువ అంటూ సౌందర్య కామెంట్ చేసింది. అయితే నీ నుంచే ఆ పొగరు వచ్చింది అంటూ జ్వాలా అనడంతో.. ఏమిటి నా నుంచి నీకు పొగరు రావడం ఏమిటి అని సౌందర్య ప్రశ్నించింది. అయితే మాకు నీ మాదిరిగానే పెద్దలు ఉంటారు కదా.. వారి నుంచి పొగరు వారసత్వంగా వచ్చిందనేది నా ఉద్దేశం అని జ్వాలా కవరింగ్ ఇచ్చింది. ఇదే నోటి దురుసు తగ్గించుకో అంటే.. మా రక్తంలో ఉందంటూ జ్వాలా సమాధానం చెప్పింది. అయితే నానమ్మను వెంబడించి.. హిమ అడ్రస్ కనుక్కోవాలి అని మనసులో అనుకోంది. అయితే.. కార్తీకదీపం సీరియల్ 1342 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే...

నానమ్మతో జ్వాలా ఫైట్

నానమ్మతో జ్వాలా ఫైట్

సౌందర్యతో జ్వాలా మాట్లాడుతూ... ఎప్పుడో తప్పిపోయిన మనవరాలి గురించి ఎందుకు వెతుకుతున్నారు? అంటే. ఆ రోజు కూడా సవాలక్ష ప్రశ్నలతో విసిగించావు. ఈ రోజు కూడా అదే విధంగా ప్రశ్నలు వేస్తున్నావు అని సౌందర్య అంది. దాంతో ఇంతకు ఆర్టిస్ట్ మీ మనవరాలి బొమ్మ గీచిందా? అని అంటే.. ఆమెకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. నేనే వెళ్లి తెచ్చుకొంటాను అని సౌందర్య చెప్పింది. ఒకవేళ ఆర్టిస్ట్ ఇచ్చిన బొమ్మను చూసి.. నేను శౌర్య అని తెలిస్తే.. నన్ను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో అని శౌర్య మనసులో అనుకొన్నది. అయితే హిమను మాత్రం వదిలేది లేదు. నా ప్రతీకారం తీర్చుకొంటాను అని జ్వాలా అనుకొన్నది. అయితే నానమ్మ కారును ఫాలో అవుదామని అనుకొంటే. ఫోన్ రావడంతో ఆగిపోయింది. అయితే నానమ్మ ఆర్టిస్ట్ గీసిన బొమ్మను చూస్తే సమస్య తప్పదు అంటూ మనసులో అనుకొన్నది.

సౌందర్యకు షాకిచ్చిన ఆర్టిస్ట్ గీత

సౌందర్యకు షాకిచ్చిన ఆర్టిస్ట్ గీత

అయితే సౌందర్య కారును వెంబడించి ఆర్టిస్ట్ ఇంటికి చేరుకొన్నది. అయితే నానమ్మ కంటే ముందే వెళ్లి నా ఫోటోను తీసుకొందామనుకొన్నాను. కానీ నానమ్మ ముందు వచ్చింది అని జ్వాలా మనసులో అనుకొంటుంటే.. ఏమే.. నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు. నీ సంగతి ఏంటి అని సౌందర్య అంటే.. నువ్వేంటి ఇక్కడ అంటే.. నా మనవరాలి ఫోటో తీసుకోవడానికి వచ్చాను. మరీ నువ్వెందుకు వచ్చావు అని సౌందర్య ప్రశ్నించింది. దాంతో నేను మా ముత్తాత బొమ్మ గీయించడానికి వచ్చాను అని లోపలికి వెళ్లారు. అయితే లోపలికి వెళ్లగానే ఆర్టిస్ట్ గీత గురించి అడిగితే.. ఆమె ఆఫీస్ కాలి చేసి వెళ్లిపోయారు. ఆమె గీసిన బొమ్మలన్నీ పాత పేపర్ వాళ్లకు ఇచ్చాం అని చెప్పగానే సౌందర్య షాక్ తిన్నది. తనకు ఉన్న ఒకే ఒక ఆశ చేజారిందనే బాధతో వెళ్లిపోయింది.

మీ మనవరాలు అంటే అంత ప్రేమనా?

మీ మనవరాలు అంటే అంత ప్రేమనా?

ఆర్టిస్ట్ గీత లేకపోవడంతో నిరాశలో మునిగిన సౌందర్యను చూస్తూ.. బాధలో ఉన్నట్టు ఉన్నావు అంటే.. చేతిలో ఉన్న ఒక్క అవకాశం చేజారిందని బాధపడుతుంటే.. విసిగిస్తావేమిటి? అని సౌందర్య విసుక్కొన్నది. అయితే నీకు నీ మనవరాలు అంటే అంతా ప్రేమనా అంటే.. అవును. నా మనవరాలు ఎవరో తెలిస్తే.. చాలా పనులు అవుతాయి అని సౌందర్య అంటే.. మీకు మీ మనవరాలి కంటే.. పనులే ముఖ్యంగా కనిపిస్తున్నాయి అంటే.. మేము మనవరాలి కోసం వెతికించాం. కానీ కుదర్లేదు. గీతతో బొమ్మ వేయిద్దామని అనుకొంటే.. ఇలా జరిగింది అంటూ సౌందర్య బాధపడింది. అయితే కారులో సౌందర్య బయలుదేరితే.. ఎక్కడికి వెళ్తున్నావు అంటే.. పార్కు వెళ్తాను.. లేదంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తా లేదంటే.. సినిమాకు వెళ్తా.. నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి అంటూ సౌందర్య వెళ్లిపోయింది. నానమ్మను వెంబడించాలనుకోగా.. ఆటో ట్రబుల్ ఇవ్వడంతో జ్వాలా అక్కడే ఉండిపోయింది.

హిమను బెదరగొట్టిన జ్వాలా

హిమను బెదరగొట్టిన జ్వాలా

ఆర్టిస్ట్ గీత తన బొమ్మ గీస్తే.. తన పరిస్థితి ఏమిటనే టెన్షన్‌లో ఉన్న హిమ.. జ్వాలా ఇంటికి వచ్చింది. జ్వాలా లేకపోవడంతో ఎదురు చూస్తున్న హిమను పిన్ని, బాబాయ్ ఊరడించారు. అంతలోనే జ్వాలా వచ్చి షాక్ ఇచ్చింది. ఆర్టిస్ట్ గీత ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లింది. కానీ చెత్త పేపర్ల వాడి వద్దకు వెళ్లి ఫోటో చూశాను. ఆమె గీసింది నీ బొమ్మే జ్వాలా అనడంతో హిమ ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అయింది. అయితే హిమ టెన్షన్ చూసి.. ఇదంతా జోక్ అని చెప్పడంతో హిమ ఉపశమనం పొందింది.

జ్వాలాకు నిరుపమ్ ఫోన్ చేసి..

జ్వాలాకు నిరుపమ్ ఫోన్ చేసి..


డాక్టర్ నిరుపమ్ జాగింగ్‌కు వెళ్లి.. జ్వాలాకు ఫోన్ చేశాడు. అర్జెంట్‌గా నిన్ను కలువాలి అంటే.. మీరు రమ్మంటే.. ఎక్కడికైనా వస్తాను అని జ్వాలా అంటే.. నా మనసులోని మాటను చెప్పుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం అని డాక్టర్ నిరుపమ్ చెబితే.. నేను ఫలానా చోటుకు వస్తాను.. మీరు అక్కడికి రండి అంటూ జ్వాలా హ్యాపీగా ఫీలయ్యింది. నిరుపమ్ మనసులో మాట చెప్పాలనుకొంటే.. అది ఊహించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది అని జ్వాలా సంబరపడిపోయింది. ఇద్దరు ప్రేమికులు దిల్ దీవానా కేఫ్‌లో కలువబోతున్నారు అంటూ జ్వాలా ఆటోలో బయలుదేరింది. ఆటోలో వెళ్తూ.. నాపై ఉన్న ప్రేమ గురించి చెప్పబోతున్నారేమో అనుకొంటూ వెళ్తుండగా.. డీజిల్ అయిపోవడంతో ఆటో ఆగిపోయింది. లిఫ్ట్ కోసం ప్రయత్నిస్తే.. ఎవరూ ఆగలేకపోవడంతో అసహనంతో ఊగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X