twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నిరుపమ్ నాకు పడటం అదృష్టం.. నీకు దురదృష్టం.. హిమతో శౌర్య

    |

    భర్తను వదిలేసి ఎందుకు ఒంటరిగా ఉంటున్నాననే విషయంపై నిరుపమ్‌కు స్వప్న క్లారిటీ ఇచ్చింది. నాతో పెళ్లికి ముందు మీ నాన్న సత్యం మరో అమ్మాయిని ప్రేమించాడంట. ఏదో కారణంగా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు. అయితే సత్యంను తప్ప మరోకరిని పెళ్లి చేసుకోను. మరొకరితో పిల్లల్ని కననని శపథం చేసిందంట. ఆ తర్వాత నన్ను మీ నాన్న పెళ్లి చేసుకొన్నాడు. కొన్నాళ్లకు మీ నాన్న ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకొన్నది. కానీ పెళ్లి తర్వాత మీ నాన్నతో ఆమె ఇద్దరు పిల్ల్ని కన్నది. ఈ విషయంలో ఎవరు ఎవర్ని మోసం చేశారో ఇప్పటికైనా అర్ధం అవుతుందనుకొంటాను. అందుకే మీ నాన్నను దూరంగా పెట్టాను అని స్వప్న కన్నీళ్లు పెట్టుకొంటూ తన జీవితంలో చోటు చేసుకొన్న పరిస్థితులను నిరుపమ్‌కు వివరించింది. కార్తీకదీపం సీరియల్‌లో 1358 సీరియల్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    హిమ నష్ట జాతకురాలు

    హిమ నష్ట జాతకురాలు


    మీ నాన్న చేసిన పనికి నేను కుమిలిపోవడం లేదు. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిన్ను ఇష్టపడే వారు రెడీగా ఉన్నారు. నువ్వెందుకు బాధపడుతావు. ప్రేమలో మోసపోవడమనేది మనకు వారసత్వంగా వస్తున్నదేమో. మీ నాన్నను నమ్మి నేను మోసపోయాను. మీ నాన్న తన ప్రేమ విషయాన్ని పెళ్లి జరిగిన మొదటి రోజే సిన్సియర్‌గా చెబితే నమ్మేశాను. కానీ అలాంటి మోసం చేశాడు. ఇక హిమ నష్టజాతకురాలు. ఆమె మోసం చేస్తే నీవు ఎందుకు బాధపడుతావు. ఎప్పటిలా ఉండు. హాస్పిటల్‌కు వెళ్లకు. ఆ దరిద్రపు మోహాన్ని చూడాల్సి వస్తుంది అని స్వప్న అంటే.. నేను వెళ్లున్నాను అంటూ స్వప్న వారిస్తున్నా నిరుపమ్ వెళ్లిపోయాడు.

     డాక్టర్‌ను కొట్టిన శౌర్య

    డాక్టర్‌ను కొట్టిన శౌర్య


    హాస్పిటల్‌లో ఓ అమ్మాయి విషం తాగితే నర్సు ఓ డాక్టర్‌కు కాల్ చేసింది. కారులో ఉన్న ఆమె నర్సును వీడియో కాల్ చేసి.. అడ్వాన్స్ కట్టించుకో. ఐదు లక్షలు అవుతుందని చెప్పు. ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయండి అంటూ చెప్పింది. కారులో వెళ్తుండగా.. ఆమెకు మౌలాలి నుంచి కారులో వస్తున్న హిమ, శౌర్య అలియాస్ జ్వాలా ఎదురు పడ్డారు. హిమ కారు మధ్యలో ట్రబుల్ ఇవ్వడంతో రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అయితే తన కారుకు అడ్డుగా ఉన్న హిమ కారును చూసి ఊగిపోతూ బయటకు దిగండి అంటూ అరిచింది. కారు దిగిన హిమను డాక్టరమ్మ గట్టిగా కొట్టింది. అది చూసి శౌర్య వచ్చి డాక్టర్‌ను రెండు పీకింది. దాంతో నన్ను కొడుతావా అంటే.. నీవు ఎందుకు కొట్టావు.. అంటే కారు మధ్యలో ఆగిపోయింది అని శౌర్య చెబితే.. కారు బాగా ఉందా లేదా అని చూసుకోరా? ప్రశ్నించింది.

    కళ్లు నెత్తికి ఎక్కించుకోకు..

    కళ్లు నెత్తికి ఎక్కించుకోకు..


    కారు ఆగిపోవడంలో మా తప్పు లేదు. అంత మాత్రాన కొడుతావా? అని శౌర్య చెప్పింది. జాగ్రత్తగా మాట్లాడు.. నాకు నోటి దురద అని డాక్టర్ అంటే.. నాకు చేతి దురద ఎక్కువ. ఎవరో కొట్టారని బాధపడకు. జ్వాలా కొట్టారని గుర్తుపెట్టుకో. హిమను కొట్టినందుకు సారీ చెప్పు అంటే.. నేను ఎప్పుడు సారీ చెప్పలేదు అంటే.. ఇప్పుడు నాతో మొదలుపెట్టు. నీకు మంచి బోణి జరుగుతుంది అని అంటే.. సారీ అని డాక్టర్ చెప్పి వెళ్లడానికి ప్రయత్నిస్తే.. హల్లో.. నేను కొట్టినప్పుడు కళ్లజోడు కిందపడింది. దాన్ని తీసుకో. కళ్లజోడు పెట్టుకోవాలి. కానీ కళ్లను నెత్తికి ఎక్కించుకోవద్దు అని శౌర్య క్లాస్ పీకింది. కారులో డాక్టర్ వెళ్తుంటే.. స్వప్న కాల్ చేసింది. ఓసారి ఇంటికి రా.. పెళ్లి గురించి మాట్లాడాలి అంటూ చెప్పింది.

    శౌర్య, నిరుపమ్‌ను కలుపాలని

    శౌర్య, నిరుపమ్‌ను కలుపాలని


    అయితే కారు చెడిపోతే నడుచుకొంటూ వెళ్తూ.. కారు చెడిపోతే పోయింది. కానీ ఇలా నడుస్తూ రావడం బాగుంది అని శౌర్య అంటే అవును అని హిమ సమాధానం చెప్పింది. హిమ మౌనంగా ఆలోచిస్తుంటే.. ఏం ఆలోచిస్తున్నావు అని అంటే.. కారు చెడిపోయింది అంటే.. మెకానిక్‌కు చెప్పాం కదా.. వాళ్లే చూసుకొంటారు. ఎందుకు టెన్షన్ పడుతావు అని శౌర్య చెప్పింది. నా టెన్షన్ నిన్ను, నిరుపమ్‌ను కలపాలనేది. నాకు నిరుపమ్ అంటే ప్రేమ.. కానీ శౌర్యకు నిరుపమ్ అంటే ప్రేమ. నిరుపమ్‌కు ప్రేమ కలిగేలా చేయాలి అని హిమ అంది.

    డాక్టర్ సాబ్ ఐ లవ్ యూ చెప్పాడు

    డాక్టర్ సాబ్ ఐ లవ్ యూ చెప్పాడు


    హిమ మాటలకు అడ్డుపడుతూ.. డాక్టర్ గారు చాలా అందంగా ఉంటాడు. నీవు బావ బావ అని ప్రేమగా పిలుస్తుంటావు. నీవు డాక్టర్, ఆయన డాక్టర్. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా అనేది నా డౌట్ అని శౌర్య అంటే.. నాకు పెళ్లి ఇష్టం లేదు అని నిశ్చితార్థం రోజున చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అలా ఆలోచిస్తుండగా.. మీరు బావమరదళ్లు.. కలిసి తిరుగుతారు. డాక్టర్ సాబ్ కంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడు అని శౌర్య అంటే.. నాకు మీ డాక్టర్ సాబ్ నచ్చలేదు అని హిమ అంటే.. ఆయన నచ్చకపోవడానికి ఒక్క కారణం చెప్పు అంటే.. డాక్టర్ సాబ్‌కు నా మనసులో చోటు లేదు అని హిమ అంటే.. నా మనసులో డాక్టర్ సాబ్‌కు చోటుంది. డాక్టర్ సాబ్ నా జాన్, నా జీవితం. డాక్టర్ సాబ్ నాకు ఐ లవ్ యూ చెప్పాడు అని శౌర్య చెప్పింది. దాంతో అవునా? అని హిమ అంటే.. ఒకరోజు డాక్టర్ సాబ్ బాగా మందేశాడు. అప్పుడు నాకు ఐ లవ్ యూ అని నిరుపమ్ అన్నాడు అంటే.. ఐ లవ్ యూ నాకు చెప్పాడు. నిశ్చితార్థం బ్రేకప్ అయిన రోజు అలా నాకు చెప్పాడు అని హిమ చెప్పింది.

    నీ దురదృష్టం హిమ అంటూ

    నీ దురదృష్టం హిమ అంటూ


    హిమతో శౌర్య మాట్లాడుతూ.. ఇన్నాళ్లు డాక్టర్ సాబ్ ఎవరికి పడలేదు అంటే అది నా అదృష్టమే. అందరూ దురదృష్టవంతులే. చివరకు నీవు కూడా దురదృష్టం. అది నా అదృష్టం. నీ దురదృష్టం. నాకు డాక్టర్ సాబ్ ఐ లవ్ యూ చెప్పారు కానీ.. నేను చెప్పలేదు. నాకే ధైర్యం రావడం లేదు అని శౌర్య అంటే.. ఒకవేళ శౌర్య ఐ లవ్ యూ చెబితే.. నిరుపమ్ రిజెక్ట్ చేస్తే ఏమైనా ఉందా అంటే.. కొన్నాళ్లు ఈ విషయాన్ని ఆపాలి అని హిమ మనసులో అనుకొన్నది. అయితే ఈ రోజో లేదా రేపో నేను డాక్టర్ సాబ్‌కు ఐ లవ్ యూ చెప్పేస్తాను. నీవ కాస్తా హెల్ప్ చేయి అని శౌర్య అంటే.. తప్పకుండా చేస్తాను. అది నా బాధ్యత అంటూ హిమ బాధతో ప్రామిస్ చేసింది.

    English summary
    Karthika Deepam May 21st Episode number 1358. Shourya Slaps Doctor
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X