For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam సొంత తమ్ముడిని గుర్తించిన హిమ, శౌర్య.. కార్తీకదీపంలో భారీ ట్విస్టు

    |

    స్కూల్‌లో తన తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడటంతో రవ్విడ్లీ తన తోటి విద్యార్థులతో గొడవ పడ్డాడు. దాంతో తీవ్రంగా గాయపడిన రవ్విడ్లీకి జ్వరం రావడంతో జ్వాలాకు కాల్ చేయడం జరిగింది. రవ్విడ్లీ జ్వరంతో బాధపడుతున్నారని తెలుసుకొన్న జ్వాలా అలియాస్ శౌర్య, హిమతో కలిసి రవ్విడ్లీ ఇంటికి బయలుదేరింది.

    అయితే నాకు ఎవరు లేరా, బంధువులు లేరా నేను అనాథనా? చుట్టాలు, అక్కాచెల్లెలు, అన్నదమ్ములు ఎవరు లేరా అంటూ కార్తీక్, మోనిత ఫోటో వద్ద రవ్విడ్లీ ఆవేదన చెందుతుంటే.. అక్కడికి జ్వాలా, హిమ చేరుకొన్నారు. దుర్గాతో మాట్లాడుతూ.. రవ్విడ్లికి ఏమైంది అంటూ జ్వాలా, హిమ ప్రశ్నించారు. కార్తీకదీపం 1341 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    స్కూల్‌లో కొట్టుకోవడం ఏమిటి?

    స్కూల్‌లో కొట్టుకోవడం ఏమిటి?

    గాయాలతో ఉన్న రవ్విడ్లిని చూసి ఏమైందిరా అంటూ హిమ, జ్వాలా కంగారు పడిపోయారు. ఏమైందిరా అంటూ ప్రశ్నిస్తే.. స్కూల్‌లో కొట్టుకొన్నాం అని చెబితే.. స్కూల్‌లో కొట్టుకోవడం ఏమిటిరా? స్కూల్‌కు పంపించేది ఇందుకేనా అని జ్వాలా కోపగించుకోవడంతో.. వాళ్లు నలుగురు.. నేను ఒక్కడిని, నన్ను వాళ్లు కొట్టారు.. నేను వాళ్లను కొట్టాను అని రవ్విడ్లీ అంటే.. నోర్మూయ్.

    నీవు డాక్టర్ కావాలని చదివిస్తున్నాం కదా అని జ్వాలా కోపగించుకొన్నది. దాంతో నాకు కూడా డాక్టర్ కావాలని ఉంది. కానీ వాళ్లు నన్ను చదువుకోనివ్వడం లేదు. నా తల్లిదండ్రుల గురించి అడుగుతున్నారు. నాకు నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు. నా పేరు కూడా నాకు తెలియదు. తెలియదంటే నవ్వుతారు. కోపం వచ్చేలా చులకనగా మాట్లాడుతారు. దాంతో వారిని కొట్టాలని అనిపిస్తుంది అని రవ్విడ్లీ ఆవేదన చెందాడు.

    ఆనంద్ నా సొంత తమ్ముడా?

    ఆనంద్ నా సొంత తమ్ముడా?

    నాకు ఎవరు లేరు.. మీకంటే అందరూ ఉన్నారు. నాకు ఎవరు లేరు. నన్ను కన్నవారు గొప్పవాళ్లంటా.. కానీ వాళ్లు ఎవరో తెలియదు. ఫోటోలు మాత్రం ఉన్నాయి. వాళ్లే నా తల్లిదండ్రులట. ఇద్దరూ డాక్టర్లేనట అని వెనుకకు చూపించగానే.. గోడపై కార్తీక్, మోనిత ఫోటోలు కనిపిచడంతో హిమ, శౌర్య షాక్ గురయ్యారు.

    గతంలో ఆనంద్‌ను ఎత్తుకొన్న క్షణాలు గుర్తొచ్చాయి. ఆనంద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. ఆనంద్ నా సొంత తమ్ముడా అని హిమ ఆవేదన చెందింది. రవ్విడ్లీని చూసి శౌర్య మాటలు పెగల్లేదు. శౌర్యను చూస్తూ.. జ్వాలా మనసులో ఏముందో అర్ధం కావడం లేదు. జ్వాలా ఏం ఆలోచిస్తుందో అని హిమ మనసులో అనుకొన్నది. అయితే రవ్విడ్లీ తన తమ్ముడు ఆనంద్ తెలియగానే.. జ్వాలా అక్కడి నుంచి పరధ్యానంతో బయటకు నడుచుకొంటూ వెళ్లింది.

    నా శత్రువుకు ఇష్టమైంది నచ్చదు

    నా శత్రువుకు ఇష్టమైంది నచ్చదు

    ఆనంద్ గురించి ఆలోచిస్తూ.. అక్కా, చెల్లె, అన్నాదమ్ముల బంధాలు అంటే నాకు ఇష్టం లేదు. కానీ నా సొంత తమ్ముడిని నేనే చేరదీశాను. మా నాన్నను టార్చర్ పెట్టిన మోనిత ఆంటీ కొడుకునే నేను చేరదీశానా? మోనిత కొడుకునే నేను చదివిస్తున్నానా? అని జ్వాలా మదనపడింది. అమ్మను మోసం చేసింది.

    అలాంటి మోనిత కొడుకును నేను చదివిస్తున్నానా? మోనిత ఆంటీ అంటే నాకు ఇష్టం లేదు. ఆనంద్ అంటే హిమకు చాలా ఇష్టం. హిమకు ఇష్టామైనది.. నా శత్రువుకు ఇష్టమైనది నాకు నచ్చాదు. ఇన్నాళ్లు నిన్ను రవ్విడ్లీ అని పిలిచిన నిన్ను ఏమని పిలువాలా? ఆనంద్ అంటే హిమకు ఇష్టం. హిమకు ఇష్టమైన ఏదీ నాకు నచ్చదు అని శౌర్య ఫీల్ అయింది.

    రవ్విడ్లీ మోనిత ఆంటీ కొడుకా?

    రవ్విడ్లీ మోనిత ఆంటీ కొడుకా?

    రవ్విడ్లీ తన సోదరుడు ఆనంద్ అని తెలియగానే హిమ హ్యాపీగా ఫీలైంది. రవ్విడ్లీ మోనిత ఆంటీ కొడుకు ఆనందా? వాడిని చూసినప్పుడల్లా మనసులో ఏదో ఫీలింగ్ వచ్చేది. నాన్న డాక్టర్, మోనిత ఆంటీ డాక్టర్.. నేను డాక్టర్.. రవ్విడ్లికి కూడా డాక్టర్ కావాలని ఉంది. ఆనంద్‌ను చూసి శౌర్య ఎందుకు వెళ్లిపోయింది? రవ్విడ్లీ ఆనంద్ తెలియక చదివించిందా? లేదా తెలిసి చదివిస్తుందా? అని హిమ కంగారు పడిపోయింది.

    అక్కా అని పిలువు అంటూ ఆనంద్‌తో హిమ

    అక్కా అని పిలువు అంటూ ఆనంద్‌తో హిమ

    హిమ, జ్వాలా వెళ్లిపోయిన తర్వాత రవ్విడ్లి అలియాస్ ఆనంద్ బాధపడుతూ కనిపించాడు. నాకు ఎవరు లేరా? నా కోసం ఎవరు రారా? అని ఆనంద్ మనసులో అనుకొంటే.. హిమ అక్కడకు వచ్చింది. హిమను చూసి రవ్విడ్లీ ఆనందంలో మునిగిపోయాడు. అయితే రవ్విడ్లిని చూసి నువ్వు నా తమ్ముడివి అంటే.. శౌర్యకు తెలుస్తుందేమో అని హిమ మనసులో అనుకొన్నది.

    ఆనంద్ వద్దకు వచ్చి.. మెడిసిన్స్ వేసుకొన్నావా అంటే వేసుకొన్నాను డాక్టరమ్మా అని చెప్పాడు. దాంతో ఇక నుంచి నీవు డాక్టరమ్మ అనకు.. అక్కా అని పిలువు అని చెప్పింది. అయితే అక్కా అని పిలిస్తే.. జ్వాలాకు కోపం వస్తుంది అని అంటే.. జ్వాలా ఉన్నప్పుడు అక్కా అని పిలువకు అని హిమ చెప్పింది.

    సౌందర్యతో జ్వాలా పొగరుగా

    సౌందర్యతో జ్వాలా పొగరుగా

    సూపర్ మార్కెట్ వద్ద సౌందర్య, జ్వాలా అలియాస్ శౌర్య ఇద్దరు ఎదురుపడ్డారు. ఏంటి సీనియర్ సిటిజన్ నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే.. సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనడానికి ఇక్కడికి వచ్చాను అని సౌందర్య చెప్పింది. అయితే తాను సూపర్ మార్కెట్‌కు సరుకులు ట్రాన్స్‌పోర్ట్ చేస్తాను అని జ్వాలా అంటే.. అవునా ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావా? అయితే నీకు పొగరే ఎక్కువగా ఉంటుంది అని సౌందర్య అంది.

    దాంతో ఆ పొగరు నీ నుంచే వచ్చింది అంటూ జ్వాలా అంటే.. నా నుంచి నీకు పొగరా అంటే... మీ లాంటి పెద్దవాళ్లు మాకు ఉన్నారు కదా.. వాళ్ల వద్ద నుంచే అని జ్వాలా సర్ది చెప్పింది.

    కార్తీకదీపం 16 వారం రేటింగ్

    కార్తీకదీపం 16 వారం రేటింగ్

    ఇదిలా ఉండగా, కార్తీకదీపం రేటింగ్ ఈ ఏడాది 16వ వారంలో మరింతగా క్షీణించింది. 15వ వారంలో 11.89 రేటింగ్ నమోదు చేసుకోగా.. 16వ వారంలో అంతకంటే తక్కువగా రేటింగ్ నమోదైంది. 16వ వారంలో కార్తీకదీపం రేటింగ్ 11.51 రేటింగ్ నమోదు చేసింది. అయితే సీరియల్స్ రేటింగ్స్ తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం ఐపీఎల్ టోర్ని జరుగుతుండటమే అని టెలివిజన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    English summary
    Karthika Deepam may 2nd Episode number 1341.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X