twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam జ్వాలాను పెళ్లి చేసుకో నిరుపమ్.. బావతో ఒట్టేపించుకొన్న హిమ

    |

    నిరుపమ్‌తో క్లోజ్‌గా ఉంటున్న జ్వాలాపై అనేక సందేహాలు డాక్టర్ శోభకు కలిగాయి. ఆటో నడుపుకొనే జ్వాలాకు, డాక్టర్లైన హిమ, నిరుపమ్‌తో అంత క్లోజ్ రిలేషన్ ఏమిటి? ఆ బంధం వెనుక ఏదో మిస్టరీ ఉంది. దానిని తెలుసుకోవాలని డాక్టర్ శోభ ఊగిపోయింది. ఇలా ఆవేశంగా ఉన్న సమయంలో పనిమనిషి వచ్చి.. ఆశ్రమానికి నిరుపమ్, ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. నిరుపమ్ సార్ చాలా బాధగా కనిపించారు. ఈ ముగ్గురి మధ్య ఏదో జరుగుతున్నది అని డాక్టర్ శోభావతి ఆవేశంగా ఊగిపోయింది. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1376లో ఇంకా ఏం జరిగిందంటే?

    చనిపోయిన తర్వాత నా ప్రేమ మరో వ్యక్తిలో

    చనిపోయిన తర్వాత నా ప్రేమ మరో వ్యక్తిలో

    నిరుపమ్‌తో తనకు సోకిన క్యాన్సర్ వ్యాధి గురించి హిమ ఉద్వేగంగా మాట్లాడుతూ.. నీవు నా మెడికల్ రిపోర్ట్స్ చింపేస్తున్నావు. దేవుడు క్యాలెండర్‌లో నా ఆయుష్సును చించేస్తున్నాడు. చూడు ఇవి నా లేటేస్ట్ రిపోర్టులు. ఎందుకు బావ.. ఇవన్నీ చూసి కూడా నాపై ఎందుకు ప్రేమను పెంచుకొంటున్నావు అని హిమ అంటే.. నీ మీద ప్రేమ ఎప్పటికి తరగదు అని నిరుపమ్ అన్నాడు. అయితే నేను కూడా నిన్ను ప్రేమించాను. కానీ నేను ఈ లోకాన్ని వెళ్లి వెళ్తున్నాను. అప్పుడు నేను ఉండను కదా.. నా ప్రేమ కూడా ఉండదు. అందుకని నా మాట విను బావ.. మనిషి పోయిన తర్వాత కళ్లు, అవయవాలు దానం చేస్తారు కదా.. నేను చనిపోయిన తర్వాత నా ప్రేమను వేరే వ్యక్తి ద్వారా అందిస్తున్నాను, దానిని నీవు స్వీకరించాలి. నా బదులుగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని హిమ అంటే.. ఏం మాట్లాడుతున్నావు అంటూ నిరుపమ్ గట్టిగా అరిచాడు. దాంతో నేను వేరే అమ్మాయిని పరిచయం చేస్తాను. ఆమెను పెళ్లి చేసుకో అంటూ హిమ అంటే.. ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా అంటూ నిరుపమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

    జ్వాలాను పెళ్లి చేసుకో బావ

    జ్వాలాను పెళ్లి చేసుకో బావ


    హిమ మాటలకు అడ్డుపడుతూ.. ఇంతకు ఎవరా అమ్మాయి అని నిరుపమ్ అడిగితే.. నీవు పెళ్లి చేసుకొంటానని మాటిస్తేనే చెబుతాను. నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే.. నేను చూపించే అమ్మాయిని పెళ్లి చేసుకొంటావా? హిమ అడిగితే.. నీ మీద ప్రేమ ఉంటే.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమనడం సరిగా లేదు అని నిరుపమ్ సమాధానం ఇచ్చాడు. నా ప్రేమను తనలో చూసుకోవాలి అని అంటూ నిరుపమ్ చేతిని తన చేతిలోకి తీసుకొని.. బావ నాకు నీవు ప్రామిస్ చేస్తున్నావు. ఇదిగో.. ఇదే.. నీవు ప్రామిస్ చేస్తున్నట్టు భావిస్తున్నాను. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో బావ.. ఆ అమ్మాయే నీకు కరెక్ట్ అని హిమ అంటే.. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో చెప్పమనగానే.. జ్వాలా అంటూ నిరుపమ్‌కు చెప్పింది.

    జ్వాలా, హిమ మధ్య బంధంపై అనుమానం

    జ్వాలా, హిమ మధ్య బంధంపై అనుమానం


    జ్వాలాను నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? అదే కరెక్ట్. ఆమె నిన్ను బాగా చూసుకొంటుంది. నేను ఎలాగూ చచ్చిపోతున్నాను. నా మాట విను అని హిమ అంది.. దాంతో జ్వాలాను ఎందుకు చేసుకోమంటున్నావు.. ఆమె ఏంటిది? నేను ఏంటిది అని నిరుపమ్ అంటే.. జ్వాలాకు నీవు అంటే ఇష్టం. నా మీద నీకు ప్రేమ ఉన్నా.. జ్వాలానే పెళ్లి చేసువాలి అంటూ హిమ కింద పడిపోయింది. అయితే హిమ, నిరుపమ్ మధ్య జరిగిన మాటలు చాటుగా విన్న డాక్టర్ శోభ చాలా కన్‌ఫ్యూజ్ అయింది. జ్వాలాను పెళ్లి చేసుకోమని నిరుపమ్‌కు చెప్పడం ఏమిటి? ఆ రెండు ఫ్యామిలీ మధ్య ఏదో తెలియని విషయం ఉంది. దానిని తెలుసుకోవాలి అని డాక్టర్ శోభ అనుకొన్నది.

    అసలు విషయం తెలిస్తే.. గుండె ఆగిపోతుంది

    అసలు విషయం తెలిస్తే.. గుండె ఆగిపోతుంది


    అయితే డాక్టర్ శోభను కలిసిన స్వప్న... టెన్షన్ పడుతూ.. నిరుపమ్ నా మాటలు వినడం లేదు. చనిపోయే హిమనే పెళ్లి చేసుకొంటానని మొండిపట్టు పడుతున్నాడు. ఏం చేయాలో అర్ధం కావడం లేద అని స్వప్న అంటే.. అయ్మో.. జ్వాలాతో నిరుపమ్ పెళ్లి చేసేందుకు హిమ ప్రయత్నిస్తున్నది అంటూ శోభ తన మనసులో అనుకొన్నది. ఈ విషయం తెలిస్తే.. గుండె ఆగిపోతుంది అని శోభ మనసులో అనుకొన్నది. పాపం హిమది బ్యాడ్ లక్ కదా అని నిరుపమ్ అంటే.. దురదృష్టం ముందు పుట్టి.. అది తర్వాత పుట్టింది. దాని వల్లనే కార్తీక్, దీప చనిపోయారు. అది భరించలేక.. తన సోదరి ఇంటి నుంచి పారిపోయింది. అది ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడ ఉందో ఏమో అని స్వప్న చెప్పడంతో.. జ్వాలా చేతి మీద ఉన్న హెచ్ అనే పచ్చబొట్టు.. హిమ పేరు అయి ఉంటుందా అని శోభ మనసులో అనుకొన్నది.

    హిమపై కోపగించుకొన్న జ్వాలా

    హిమపై కోపగించుకొన్న జ్వాలా

    ఇక జ్వాలాను కలిసిన హిమ.. ఇక డాక్టర్ సాబ్‌తో నీ ప్రేమ వ్యవహారం చెప్పు. డాక్టర్ సాబ్ వద్దకు వెళ్లి నీ మనసులో మాట చెప్పు అని హిమ అంటే.. నేను ఐలవ్ యూ చెప్పకుండా ఎందుకు ఆపావో తెలియదు కానీ.. ఇప్పుడు చెప్పడం హ్యాపీగా ఉంది. నీవు ఏమవుతావో తెలియదు కానీ.. నీవు చేస్తున్న సహాయం మాత్రం మాటల్లో చెప్పలేను అని జ్వాలా అంది. అయితే గత జన్మలో మనమిద్దరం అక్కా చెల్లెలు అయి ఉంటామో అని హిమ అనగానే.. ఆపు హిమ.. నాకు ఆ బంధమంటే చాలా చిరాకు అని చెప్పింది. దాంతో హిమ చాలా షాక్ అయింది. ఇంకా నాపై కోపం తగ్గలేదా అని మనసులో అనుకొన్నది. అయితే జ్వాలా, హిమ బంధం గురించి తలెత్తిన అనుమానాలను తీర్చడానికి శోభ ఆర్టిస్ట్ కలిసి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నం చేసింది.

    తాజా ప్రోమోలో మరో ట్విస్టు

    తాజా ప్రోమోలో మరో ట్విస్టు

    ఇదిలా ఉండగా.. నిరుపమ్‌ను జ్వాలాను కలిపేందుకు హిమ మంచి ప్లాన్ వేసింది. నేలపై అలకరించిన పూలపై ఏడడుగుల నడుస్తూ.. ఐ లవ్ యూ చెప్పమని సూచించింది. అయితే నిరుపమ్ దగ్గరకు రాగానే.. ఫోన్ మోగింది. దాంతో ఆమె వెనుకకు వెళ్లిపోయింది. అయితే ఇంత మంచి ఛాన్స్ వస్తే.. ఎందుకు వెళ్లిపోయావు అంటే.. నాకు హిమ ఫోన్ చేసింది అంటూ చెప్పగానే.. హిమ కంగారు పడిపోయింది. తాజా ప్రోమోలో ఈ ట్విస్టు ఆసక్తికరంగా మారింది.

    English summary
    Bigg Twist in Karthika Deepam today's episode: Hima takes oath from Nirupam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X