Don't Miss!
- News బీజేపీ 7వ జాబితా: అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా పోటీ
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
Karthika Deepam ఉంచుకొంటావో.. ఊరేగుతావో.. స్వప్నకు జ్వాలా స్ట్రాంగ్ వార్నింగ్
తన ప్రేమను నిరాకరించాడనే కారణంతో నిరుపమ్ ఫోటోను, అలాగే మోసం చేసిందని హిమ ఫోటోలను శౌర్య అలియాస్ జ్వాలా చించివేసింది. అయితే ఆ ఫోటోలను సౌందర్య మళ్లీ అతికించి జ్వాలా చేతికి ఇచ్చింది. దాంతో మీరు మళ్లీ అతికించారా అంటూ జ్వాలా ప్రశ్నిస్తూ.. వాళ్లిద్దరూ మోసం చేశారు. మోసపోవడం అంటే ఓడిపోవడం కంటే ఘోరం అని జ్వాలా అంది. అయితే పేపర్లు చించినంత మాత్రాన బంధాలు చినిగిపోవు. కొన్నిసార్లు మనం భరించాలి అని సౌందర్య చెబితే.. హిమ నాతో ఎలా ఉండేదో తెలుసా? అమాయకురాలిగా ఉండేది. అన్నింటికి భయపడేది. డాక్టర్ సాబ్ చెప్పాడని.. నాతో తిప్పుకొన్నాను. దాంతో కంప్లీట్‌గా మారిపోయింది. కార్తీకదీపం సీరియల్ 1390 ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందంటే..
నా తల్లిదండ్రులను పొట్టన పెట్టుకొని..
సౌందర్య ప్రశ్నలకు జ్వాలా సమాధానం ఇస్తూ.. అవును తింగరి మారిపోయింది. నన్ను మోసం చేసేంతగా మారిపోయింది. ఆ తింగరిని క్షమించేదు లేదు. ఈ జ్వాలా ప్రేమించినా.. ద్వేషించినా ఎక్కువగానే ఉంటుందని జ్వాలా తెగేసి చెప్పింది. నా తల్లిదండ్రులను పొట్టబెట్టుకొన్న హిమ కంటే.. తింగరి చేసిన మోసమే ఎక్కువ. తింగరి మీదే కోపం ఎక్కువగా ఉంది. నేను ఏమైనా చేస్తా. నా ప్రేమను లాగేసుకొన్నది. నా జీవితాన్ని, డాక్టర్ సాబ్‌ను నా నుంచి దూరం చేసింది. క్షమించేది లేదు. వదిలేదే లేదు అని జ్వాలా ఆవేశంగా మాట్లాడింది.
డాక్టర్ శోభకు అలాంటి కల
ఇక డాక్టర్ శోభ వద్దకు వెళ్లిన హిమ.. ఒక్కసారిగా చెంపపై లాగి కొట్టింది. ఏంటి? చేయాల్సిందంతా చేసి.. రిలాక్స్‌గా తిరుగుతున్నావు. ఇంకొకసారి.. హిమ పేరుతో జ్వాలాకు ఫోన్ చేశావనుకో. నేను మా బావ వద్దకు వెళ్లి.. ఏ క్యాన్సర్ లేదు బావ అని చెప్పేస్తాను. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు నిన్ను మా అత్త స్వప్న కాదు కదా.. దేవుడు కూడా కాపాడలేడు అని హిమ వార్నింగ్ ఇచ్చినట్టు స్వప్న కలగన్నది. ఇదిలా జరిగితే నా పరిస్థితి ఏంటో అని శోభ కంగారు పడింది.
నీ ప్రేమ కోసం పెద్దరికం చేయాలా?
జ్వాలా బాధను, ఆవేదను చూసిన సౌందర్య.. నీ ప్రేమ విషయంలో నేను పెద్దరికం చేయాలా? ఆ అబ్బాయి నాకు తెలుసు. నేను ఏమైనా మాట్లాడానా? అని సౌందర్య అంటే.. డాక్టర్ సాబ్ కుండల బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. నీవు వెళితే.. నిన్ను కూడా తిడుతాడు అని అంటే.. నాకు తెలుసే.. వాడు నా మనవడు.. హిమ నా మనవరాలు. నీ తృప్తి కోసం అలా మాట్లాడుతున్నా. కానీ నేను నిరుపమ్ వద్దకు వెళ్లి ఏం మాట్లడుతాను. నీ బాధను తగ్గించడానికి నేను ఏదో మాట్లాడుతున్నా అని సౌందర్య అంది. అయితే నా జీవితంలో నిరుపమ్‌తో ప్రేమ కథ ముగిసింది అని చెప్పడంతో.. ఇక వెళ్లొస్తానే అంటూ సౌందర్య బయలుదేరబోగా.. గాఢంగా కౌగిలించుకొన్నది.
నీవు మెతకగా ఉంటే.. నెత్తికి ఎక్కి..
తండ్రి ఆనందరావుకు పెళ్లి కార్డు ఇచ్చి ఇంటికి రాగానే.. తన ఇంటి వద్ద జ్వాలా కనిపించగానే.. ఇది నా ఇంటికి వచ్చిందా? ఎంత ధైర్యం అంటూ స్వప్న మనసులో అనుకొన్నది. జ్వాలాను చూడగానే.. ఎలా ఉన్నావు అంటూ నిరుపమ్ పలకరించగానే.. ఇంటికి వచ్చిన చుట్టంలా పలకరించి.. ఇంట్లోకి పిలిచి ఆతిథ్యం ఇవ్వు.. నీవు మెతకగా ఉంటే.. ఇలాంటి వాళ్లు నెత్తికి ఎక్కి కూర్చొంటున్నారు.. వెళ్లమని చెప్పు అని స్వప్న అంటే.. నీతో చెప్పించుకోవడానికి రాలేదు. కొన్ని లెక్కలు తేల్చడానికి వచ్చాను అని జ్వాలా అంటే.. నీతో మాకు లెక్కలేంటే అని స్వప్న అంటే.. నీతో కాదు.. డాక్టర్ సాబ్తో నా లెక్కలు. అంటే.. వాడితో నీకు లెక్కలేంటే.. ఆటో తీయ్ అని స్వప్న అంటే.. ఎక్కువగా మాట్లాడకండి అని జ్వాలా జవాబు ఇచ్చింది. జ్వాలాను స్వప్న చెంపపై లాగి కొట్టింది.
ఉంచుకొంటావో.. ఊరేగుతావో..
జ్వాలాను కొట్టడంతో షాక్ తిన్న నిరుపమ్.. ఏంటి మమ్మీ అలా కొట్టావు అని అంటే.. చెంపపై కొట్టిన దెబ్బ కంటే.. మనసుపై కొట్టిన దెబ్బే చాలా బాధగా ఉంది డాక్టర్ సాబ్ అని జ్వాలా ఆవేదన చెందింది. ఇంకోసారి నాపై చేయి వేసుకొంటే.. బాగుండదు అని స్వప్నను జ్వాలా హెచ్చరించింది. నీవు ఆటో కొనిచ్చావు.. అంటూ చేతిలో కీస్ పెట్టింది. అయితే ఈ ఆటో ఇస్తే.. నా ఇంటి ముందు పెడుతావా? మేము ఏం చేసుకొన్నావాలి అని స్వప్న అంటే.. ఉంచుకొంటావో.. ఊరేగుతావో నాకు అవసరం లేదు అని జ్వాలా అంటే.. ఏంటిరా నిరుపమ్.. ఇలాంటి అలగా జనాలతో నీకు అని అంటే.. మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడు అని జ్వాలా చెప్పి వెళ్లిపోయింది.