Karthika Deepam బతికి వచ్చిన డాక్టర్ బాబు.. మళ్లీ కలిసిన కార్తీక్.. దీప.. సీరియల్‌లో బిగ్ ట్విస్ట్
యాక్సిడెంట్ నుంచి బయటపడిన దీపను చిక్ మంగళూరులోని డాక్టర్ రక్షించి ఇంటికి తీసుకెళ్లాడు. తన తల్లికి పరిచయం చేయగా..దీపను చూసి.. నీ కష్టాలు పగవాడికి కూడా రావొద్దు అని ఆవేదన చెందింది. అయితే దేవుడు నాకు కష్టాలే పెడుతున్నాడు అని దీప అంటే.. కష్టాలు పెడుతున్నాడంటే.. దేవుడు మంచి చేయడానికే అని డాక్టర్ తల్లి చెప్పింది. కార్తీకదీపం సీరియల్ తాజాగా కొనసాగుతున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 1433 లో ఏం జరిగిందంటే..

బిడ్డలను వెతుక్కొంటూ దీప
డాక్టర్ ఇంట్లో వంట చేసి అందరికి రుచికరమైన భోజనం పెట్టింది. వంటలక్క చేతి భోజనం తిని అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.ఆ తర్వాత తాను హైదరాబాద్‌కు వెళ్తానని చెప్పడంతో డాక్టర్ కుటుంబం ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేశారు.అయితే తన బిడ్డలు ఒంటరిగా ఉన్నారు. వారు నా కోసం ఎదురు చూస్తుంటారని ..తన బిడ్డలను వెతుక్కొంటూ దీప హైదరాబాద్‌కు బయలుదేరింది.

హైదరాబాద్‌కు బయలుదేరిన శౌర్య
యాక్సిడెంట్ తర్వాత తమకు దొరికిన శౌర్యను హైదరాబాద్‌కు చేర్చే ప్రయత్నం చేశారు. అయితే హిమ ఉన్న ఇంటిలో తాను ఉండనని చెప్పింది. అయితే హిమపై కోపమా? లేదా ఇంటిపై కోపమా? ఇంటిపై నీకు కోపం లేదనుకొంటా అని చంద్రుడు దంపతులు నచ్చచెప్పారు. దాంతో కన్విన్స్ అయిన శౌర్య హైదరాబాద్‌కు బయలు దేరింది.

ఒకే బస్సులో దీప, శౌర్య
రోడ్డుపై నడుచుకొంటూ దీప తన ప్రయాణాన్ని సాగించి మధ్యలో ఓ బస్సులో ఎక్కింది. ఆ తర్వాత అదే బస్సులోకి శౌర్య, చంద్రుడు దంపతులు ఎక్కారు. అలా ఒకే బస్సులో హైదరాబాద్‌కు దీప, శౌర్య బయలుదేరారు. కానీ వారిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు.

అమెరికాకు హిమ, సౌందర్య దంపతులు
అయితే కొడుకు, కోడలు ఇక లేరనే బాధతో సౌందర్య, ఆనందరావు ఇల్లు అమ్మేసి అమెరికాకు వెళ్లడానికి సిద్దమయ్యారు. కొడుకు, కోడలు ఫోటోలు చూసి బాధలో మునిగిపోయారు. మమ్మల్ని ఒంటరి వాళ్లను చేసి వెళ్లారని బాధపడ్డారు. ఎందుకు పెద్దొడా.. ఇంత అన్యాయం చేసి వెళ్లావు. మేము ఏం తప్పు చేశామని మాకు ఈ శిక్ష విధించావు. జీవితాంతం ఏడుస్తూ ఉండమని శిక్ష వేసి వెళ్లావు. డాక్టర్ బాబు అంటూ వాడి ప్రేమ కోసం తపిస్తూ.. చివరకు వాడితో కలిసి మమ్మల్ని ఒంటరి వాడిని చేసి వెళ్లావు అని సౌందర్య రోదించింది.

మళ్లీ కలిసిన కార్తీక్, దీప
ఇక కార్తీకదీపం సీరియల్ తాజా ప్రోమోలో మరో ట్విస్టుకు తెరలేపారు. పోయాయని అనుకొన్న ప్రాణాలను ప్రమాదంలో నిలబెట్టావు. ప్రమాదం జరిగిన రోజే ..పక్క ఊరి హాస్పిటల్‌లో ఒకరి చేర్చారని తెలిసింది. ఆయనేనే డాక్టర్ బాబు అయ్యేలా చూడు స్వామి.. అని దేవుడికి మొక్కుకొన్నది. అంతలోనే దీప అంటూ కార్తీక్ మాట వినిపించగానే ఆనందంలో మునిగిపోయింది. పిలుపు వినిపించిన సైడ్ పరిగెత్తుకొంటూ వెళ్లి.. చూడగా.. కార్తీక్ కనిపించాడు. దాంతో వెళ్లి అమాంతం కౌగిలించుకొన్నది.


Click it and Unblock the Notifications











