Karthika Deepam వంటలక్క జీవితంలోకి డాక్టర్ బాబు.. కార్తీక్‌ను కౌగిలిలో బంధించిన దీప

కార్తీక్‌, దీప యాక్సిడెంట్ గురైన తర్వాత సౌందర్య, ఆనందరావు మనోవేధనకు గురయ్యారు. అయితే కొడుకు, కోడలు లేకుండా ఇంద్రభవనం లాంటి ఇంటిలో ఉండటం ఎందుకని అమెరికాకు బయలుదేరారు. ఇంటిని అమ్మేసి సామన్లు సర్దుకొని అమెరికా వెళ్తూ ఆవేదనకు గురయ్యారు. డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ అంటూ తనతోనే వెళ్లిపోయావు. మాకు తీరని వ్యధను మిగిల్చావని సౌందర్య ఏడ్చింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 1434‌లో ఇంకా ఏం జరిగిందంటే..

అమెరికాకు ప్రయాణమైన సౌందర్య, ఆనందరావు

అమెరికాకు ప్రయాణమైన సౌందర్య, ఆనందరావు

అమెరికాకు ప్రయాణమవుతూ కార్తీక్, దీప ఫోటోలను ప్యాక్ చేశారు. నానమ్మ ఆవేదన చెందుతుంటే.. శౌర్య దొరుకుందా? అని హిమ అడిగితే.. నేను వెతికిస్తున్నాను.. తప్పకుండా దొరుకుతుందని సౌందర్య చెప్పింది. క్యాబ్ రావడంతో లగేజీ అంతా సర్దుకొని.. ఇంటి తాళం చెవులు సెక్యూరిటీకి ఇస్తూ.. ఇంటిని కొన్నవాళ్లు వస్తారు. వారికి ఈ తాళాలు అప్పగించండి అంటూ ఆనందరావు చెప్పాడు.

తల్లిదండ్రులను తలచుకొని శౌర్య కంటతడి

తల్లిదండ్రులను తలచుకొని శౌర్య కంటతడి

ఇదిలా ఉండగా, ఒకే బస్సులో హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న దీప, శౌర్య మధ్య డ్రామా చోటు చేసుకొన్నది. ప్రయాణంలో శౌర్య తన తల్లిదండ్రులను తలచుకొని బాధపడింది. అంతా కలిసి ఉందామని అనుకొంటుండగా.. దేవుడు ఇలా మమ్మల్ని విడదీశారు ఏంటని కంటతడి పెట్టింది. తమకు దేవుడు అన్యాయం చేశాడని రోదించింది.

శౌర్యకు వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప

శౌర్యకు వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప

మార్గమధ్యంలో బస్సు ఆపి ప్రయాణికులను భోజనాలు చేయమని కండక్టర్ అడిగారు. అయితే శౌర్య, చంద్రుడు ఫ్యామిలీ దిగి టిఫిన్ చేస్తుండగా.. దీప కూడా దిగి వారి పక్క నుంచే వెళ్లింది. శౌర్య తింటుండగా స్వరం తప్పడంతో నీళ్ల కోసం చంద్రమ్మ వెళ్లింది. వాటర్ బాటిల్ తీసుకొని 500 నోట్ ఇస్తే.. చిల్లర లేవని చెప్పడంతో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన దీపను చంద్రమ్మ చిల్లర అడగడంతో.. తన వద్ద కూడా చిల్లర లేదు. కానీ వాటర్ బాటిల్‌కు డబ్బులు ఇస్తాను. నీ బిడ్డ నా బిడ్డ లాంటిందని దీప చెప్పి వాటర్ బాటిల్ ఇప్పించింది.

శౌర్యను తలపై తట్టి దీప ఎమోషనల్

శౌర్యను తలపై తట్టి దీప ఎమోషనల్

హైదరాబాద్‌కు బస్సు చేరుకోవడంతో అందరూ దిగి వెళ్లిపోతున్నారు. దీప కూడా దిగేందుకు రాగా.. గాఢ నిద్రలో ఉన్న శౌర్య ముఖంపై దుప్పటి ఉండటంతో గుర్తు పట్టలేకపోయింది. అయితే దీపను చేసిన చంద్రమ్మ.. వాటర్ బాటిల్ కొనిచ్చినందుకు థ్యాంక్స్ చెబుదామని నా బిడ్డ అనుకొన్నది. కానీ నిద్ర పోతున్నది అంటూ చెప్పడంతో శౌర్య తలపై చేయి పెట్టి దీవిస్తూ కంటతడి పెట్టుకొన్నది. హైదరాబాద్‌లో దిగిన దీపను చూడకుండా శౌర్య వెళ్లింది.

దీప వద్దకు చేరిన కార్తీక్

దీప వద్దకు చేరిన కార్తీక్

ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్‌లో మరో బిగ్ ట్విస్టుకు తెరలేపారు. హైదరాబాద్‌కు చేరుకొన్న దీప.. నిత్యం కార్తీక్ ధ్యాసలోనే ఉంది. దేవుడు ముందు మొక్కుతూ.. నా కార్తీక్ గురించి ఆచూకీ తెలిసేలా చూడు అని మొక్కుకున్నది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పక్క ఊర్లో ఎవరో చేరారట.

అతడు కార్తీక్ అయితే బాగుండు అని మనసులో కోరుకొన్నది. అలాంటి సమయంలో దీప అంటూ కార్తీక్ పిలిచాడు. కార్తీక్ పిలుపు అందుకొని దీప పరుగులు పెట్టి డాక్టర్ సాబ్ కనిపించగానే కౌగిలించుకొన్నది. ఈ సీన్ కార్తీకదీపం అభిమానులకు ఫుల్ సంతోషంలో నింపింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X