twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నీవు విలన్‌వి.. నా శత్రువువి.. మోసం చేశావు అంటూ హిమపై శౌర్య ఆగ్రహం

    |

    తనకు డాక్టర్ నిరుపమ్ దక్కడనే కోపంతో డాక్టర్ శోభ మరో కుట్రకు తెరలేపింది. హిమపై జ్వాలా కోపగించుకొనేలా.. వారిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్లాన్ చేసింది. హిమ ఉన్న చోటుకు జ్వాలాను వచ్చేలా చేసి.. వారిద్దరి మధ్య సంభాషణను చాటుగా వినే ప్రయత్నం చేసింది. శౌర్యను చూసి ఏంటి? ఈ సమయంలో ఇక్కడికి వచ్చింది అని మనసులో అనుకొన్నది. హిమను చూడగానే.. వెళ్లు.. నా ఎదురుగా నిలుచొని మాట్లాడకు. నీ మొహం చూపించకు అని జ్వాలా అంటే.. అసలు ఏమైందంటే? అని హిమ ఏదో సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. నీవు నాతో మాట్లాడొద్దని చెప్పావుగా.. డాక్టర్ సాబ్‌ను కలువనీయకుండా చేశావు. కానీ డాక్టర్ సాబ్‌ను నువ్వు చేసుకొనేందుకు ప్లానే వేశావు. నీవు మోసకారివి. అనవసరంగా తింగరి పేరు పెట్టాను అని జ్వాలా మండిపడింది. అయితే జరిగిందేమిటంటే అని హిమ చెప్పబోగా.. ఆపు.. నీవు నాకు సంజాయిషీ ఇవ్వనక్కర్లేదు అని ఘాటుగా స్పందించింది. కార్తీకదీపం సీరియల్ 1389 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

    నీవు కూడా శత్రువే

    నీవు కూడా శత్రువే


    డాక్టర్ సాబ్‌కు నా ప్రేమ గురించి చెప్పకుండా ఆపావు. నా డాక్టర్ సాబ్‌కు, నాకు మధ్య నీవు విలన్‌వి. ఇన్నాళ్లు నా శత్రువు ఒక్కతే అనుకొన్నాను. దానికి మంచి నీవు తయారయ్యావు అని జ్వాలా అంటే.. అయ్యో.. నిన్ను ఆ శోభ తప్పుదోవ పట్టిస్తున్నది. నువ్వు, నిరుపమ్ బావ ఒక్కటి కావాలన్నదే నా కోరిక. జ్వాలా నా మాట వినడానికి ఇష్టపడటం లేదు. నన్ను తాకడానికి కూడా ఇష్టపడటం లేదు. నా జీవితం ఇలా అయిపోయిందేమిటి అని హిమ మనసులో కుమిలిపోయింది.

    నీ పేరు అలా పెట్టకుండా ఉండాల్సింది

    నీ పేరు అలా పెట్టకుండా ఉండాల్సింది


    అయితే హిమ మౌనంగా ఉండటంతో.. నీకు తింగరి అని పేరు పెట్టాను. అసలు నీ పేరు ఏమిటే.. నువ్వు చెప్పు. నీ పేరును కూడా నా చేతిపై పచ్చబొట్టు వేయించుకొంటాను. అది కూడా ఇలానే..నంగనాచిలో కనిపిస్తూ.. అమ్మ, నాన్నలను పొట్టనపెట్టుకొన్నావు. నువ్వేమో నా జీవితాన్ని, నా డాక్టర్ సాబ్‌ను తీసేసుకొన్నావు అని జ్వాలా కోపగించుకొన్నది. అయితే ఇదంతా చాటుగా చూస్తున్న శోభ.. తన హిమ అని తెలిస్తే.. ఇంకా ఎలా ఉంటుంది. ఇద్దరిని చూస్తుంటే కన్నుల పండువగా.. కడుపు నిండినట్టు ఉంది మనసులో సంతోషపడింది. అయితే హిమకు జ్వాలా ఫోన్ ప్రయత్నించడం, కాల్ కనెక్ట్ కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

    భోభ శాడిజం గురించి

    భోభ శాడిజం గురించి


    అయితే జ్వాలా గురించి ఆలోచిస్తూ.. శోభ ఫోన్ చేసి.. ఆటపట్టిస్తున్నది. నిరుపమ్‌కు దూరమవుతాననే విషయంతో శోభ శాడిజం ప్రదర్శిస్తున్నది. అసలు శౌర్య గురించి నిరుపమ్‌కు శోభ చెప్పక ముందే నేనే చెప్పేస్తా. అలాగే నాకు క్యాన్సర్ లేదని చెబుతాను. నీవుంటే నాకు ఇష్టం లేదని చెబితే నమ్ముతాడా? నిరుపమ్ బావ పరిస్థితి ఎలా ఉంటుందని హిమ మనసులో అనుకొన్నది. అయితే హిమ ముభావంగా ఉండటం చూసి.. హాస్పిటల్‌కు వెళితే ఫ్రెష్‌గా ఉంటుందేమో అని అంటే.. శాంతే లేనప్పుడు.. ఎక్కడికి వెళ్లినా శాంతి దొరకదు అని హిమం అంది.

    పెళ్లి కార్డులు ప్రింట్

    పెళ్లి కార్డులు ప్రింట్


    తాతతో హిమ మాట్లాడుతుండగా.. నిరుపమ్, స్వప్న వచ్చి.. ఇదిగో పెళ్లికారు అంటూ ఆనందరావు చేతిలో పెట్టాడు. అప్పుడే పెళ్లికార్డు ప్రింట్ చేయించావా అంటే.. వారం రోజులే ఉంది కదా అని నిరుపమ్ అన్నాడు. అయితే ఫస్ట్ కార్డు దేవుడి వద్ద పెట్టండి అంటే.. అది నేను చూసుకొంటా.. ఒక కార్డు ఇచ్చి వెళ్దామని వచ్చాం. మమ్మీకి ఇవ్వండి అని స్వప్న అంటే.. ఇలా మొక్కుబడిగా ఇస్తున్నావా అంటే.. ఇది మొక్కుబడి పెళ్లే కదా అని స్వప్న కౌంటర్ వేసింది.
    అయితే హిమ పెళ్లి చేసుకోనని మొండిపట్టు పట్టడంపై ఆనందరావు స్పందించాడు. నీవు ఒప్పకొని నిరుపమ్‌ను పెళ్లి చేసుకోమని అంటే.. లేదు.. నేను అమ్మా, నాన్నకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను. మీరు చెబితే జ్వాలాను నిరుపమ్ పెళ్లి చేసుకొంటారు అని చెప్పింది.

    నీవు వేరా? నేను వేరా?

    నీవు వేరా? నేను వేరా?


    ఇదిలా ఉండగా, జ్వాలా ఇంటికి సౌందర్య క్యారేజ్ తీసుకొని వెళ్లింది. అయితే ఇంట్లోకి అడుగుపెట్టే సరికి చినిగిన నిరుపమ్ ఫోటోలు పడి ఉన్నాయి. అలాగే కింద జ్వాలా పడుకొని ఉంటే.. గదిని సౌందర్య క్లీన్ చేసింది. ఆ తర్వాత లేచి చూసిన జ్వాలా.. ఆశ్చర్యపోయింది. నీవు ఏమిటీ.. ఈ పనులు చేయడమేమిటి అని జ్వాలా అడిగితే.. నీవు వేరు.. నేను వేరా అని సౌందర్య ప్రశ్నించింది. దాంతో అయితే నేనే శౌర్య అనే విషయం నాన్నమ్మకు తెలిసిందా అని మనసులో అనుకొన్నది. అయితే ఆ సమయంలో జ్వాలా చేతిలో ఓ కవర్ పెట్టింది. దాన్ని చూసి జ్వాలా షాక్ తిన్నది.

    English summary
    Karthika Deepam 27th June Episode number 1389.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X