For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నాలో ఆశలు ఎందుకు రేపావు.. ప్రేమను ఎందుకు కల్పించావు.. కాలర్ పట్టిన శౌర్య

    |

    హిమ, స్వప్న మధ్య వాగ్వాదం జరగడంతో సౌందర్య జోక్యం చేసుకొన్నది. దాంతో ఇప్పుడే ఇలా పొగరుగా వ్యవహరిస్తే.. పెళ్లి తర్వాత పరిస్థితి ఏమిటో. నాకు చుక్కలు చూపిస్తుందేమో. ఏదైనా ఏమైనా అందామని అనుకొంటే.. ఆరోగ్యం బాగా లేదని సానుభూతి ఒకటి అని స్వప్న అంటే.. నీ సానుభూతి ఎవరు కోరుకోవడం లేదు అని హిమగా ఘాటుగా సమాధానం ఇచ్చింది. దాంతో మమ్మీ ఏదైనా అన్నాదనుకో.. నీవైనా ఊరుకోవచ్చు కదా అని నిరుపమ్ అంటే.. ఎందుకు ఊరుకొంటుందిరా? ఈ పెళ్లి వద్దు.. నీవు శోభను పెళ్లి చేసుకో అని స్వప్న అంటే.. నీవు శోభను నిరుపమ్ బావకు ఇచ్చి పెళ్లి చేస్తే చూస్తు ఊరుకొంటామా? ఏంటి? బావే శోభను పెళ్లి చేసుకోడు అని హిమ కౌంటర్ ఇచ్చింది. దాంతో ఈ కొంపలోకి రావడమే బుద్ది తక్కువ అంటూ స్వప్న వెళిపోయింది. కార్తీకదీపం సీరియల్‌లో 1385 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    శౌర్య కోసమే ఈ నాటకం

    శౌర్య కోసమే ఈ నాటకం


    నిరుపమ్, స్వప్న వెళ్లిపోగానే హిమను సౌందర్య నిలదీసింది. క్యాన్సర్ పేరుతో ఎందుకు నాటకం ఆడుతున్నావు? చావును అడ్డం పెట్టుకొని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు. పాపం నిరుపమ్ పరిస్థితి గుర్తించావా? అంటూ సౌందర్య ప్రశ్నల వర్షం కరిపించింది. దాంతో నేను శౌర్య కోసం చేస్తున్నాను అని హిమ బాంబు పేల్చింది. శౌర్య ఎక్కడుందో నాకు తెలుసు. నేను మీకు చెప్పకుండా విషయాలు దాచాను అని చెప్పగానే సౌందర్య, ఆనందరావు షాక్ తిన్నారు. ఆ తర్వాత హిమను తీసుకొని శౌర్య వద్దకు సౌందర్య వెళ్లింది.

    నీవు నన్ను ప్రేమించడం ఏమిటి?

    నీవు నన్ను ప్రేమించడం ఏమిటి?


    నిరుపమ్‌తో జ్వాలా అలియాస్ శౌర్య వాదనకు దిగింది. నాకు ఫోన్ చేయడం లేదు. మాట్లాడటం లేదు. నేను అన్నం తినడం లేదు. ఆ రోజు అలా వెళ్లిపోయానని అలిగావా? నాపై కోపం వచ్చిందా? ప్రపంచంలో ఎవరూ కోరుకోని విధంగా నేను నిన్ను అని శౌర్య అంటుంటే.. జ్వాలా ప్లీజ్ ఆపు అంటూ నిరుపమ్ గట్టిగా అరిచాడు. అసలు నీ ఉద్దేశం? నన్ను నీవు నన్ను ప్రేమించడం ఏమిటి? వెనుక ముందు ఆలోచించకుండా నీవు చేసిన పనే పెద్ద తప్పు అని నిరుపమ్ అంటే.. కొత్తగా తప్పు అంటున్నారు? మీ మమ్మి మాటలకు లొంగిపోయారా? కొంపదీసి.. ఆ శోభను పెళ్లి చేసుకోవడానికి అంటూ జ్వాలా ఏదో అనబోతే.. షటప్.. మనసు మాట వినమని నీవే చెప్పావు కదా అని నిరుపమ్ అంటే.. నీ మనసులో ఉన్నది నేనే కదా అని జ్వాలా అంటే.. నీవు లేవు.. నీవు లేవు అని నిరుపమ్ గట్టిగా అరిచాడు.

    జ్వాలానే శౌర్య అంటూ సౌందర్యకు

    జ్వాలానే శౌర్య అంటూ సౌందర్యకు

    నా మనసులో నీవు లేవు అని నిరుపమ్ అనగానే.. ఏం మాట్లాడుతున్నావు అని జ్వాలా ప్రశ్నించింది. దాంతో నా మనసులో నీవు లేవు. నా మనసులో వేరే వాళ్లు ఉన్నారు. వాళ్లతోనే నా జీవితం. తనతోనే నా పెళ్లి అని నిరుపమ్ అనగానే.. పక్కనే చాటుగా వింటున్న సౌందర్య, హిమ షాక్ అయ్యారు. నిరుపమ్‌తో జ్వాలా గొడవ చూసి.. ఆమెతో వాడికి ఏం పని.. అలా మాట్లాడుతున్నాడు అని అంటే.. జ్వాలానే శౌర్య అని హిమ అసలు విషయం చెప్పింది. దాంతో సౌందర్య షాక్ తిన్నది.

    నీవే ఊహించుకొన్నావు అంటూ నిరుపమ్

    నీవే ఊహించుకొన్నావు అంటూ నిరుపమ్

    అంతలోనే... నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొంటున్నాను. నీ మీద ప్రేమ ఉందని ఎప్పుడైనా చెప్పానా? అంటే.. ఆ రోజు తాగి నాకు ఐ లవ్ యూ చెప్పావుగా.. అని జ్వాలా అంటే.. తాగిన సమయంలో చెప్పిన దానిని సీరియస్‌గా తీసుకొంటావా. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొంటున్నా అని నిరుపమ్ అంటే.. నీవు ఐ లవ్ యూ చెప్పడానికి ముందు నన్ను ఏడిపిస్తున్నావా అని జ్వాలా అంటే.. ఏయ్.. నేను నిన్ను ప్రేమించడం లేదు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది అంటూ కోపంతో అరిచాడు. మరీ నాలో ఆశలు ఎందుకు లేపారు. నాలో ప్రేమను ఎందుకు కల్పించారు అని జ్వాలా ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో చూడు జ్వాలా.. అవన్నీ నీవు కల్పించుకొన్నావు అని నిరుపమ్ అంటే.. మరీ నీవు నాకోసమే పుట్టావు. నా ఫ్యామిలీకి సాయం చేస్తున్నావు అని చెప్పవుగా.. ఇవన్నీ ఏమిటి అంటూ నిరుపమ్ కాలర్ పట్టుకొన్నది.

    ఆడపిల్లవని నాకు గుర్తు చేశావు అంటూ జ్వాలా

    ఆడపిల్లవని నాకు గుర్తు చేశావు అంటూ జ్వాలా

    నిరుపమ్‌ను జ్వాలా నిలదీస్తూ.. నాతో ప్రేమగా ఎందుకు ఉన్నారు. నేను ఆడపిల్లనని మీరే గుర్తు చేశారు. ప్రేమిస్తే స్నేహం అని.. స్నేహం చేస్తే ప్రేమిస్తున్నాను అని ఆడవాళ్లు అంటారు. నాపై ప్రేమను ఊహించుకోవడంలో తప్పంతా నీదే. నీతో ఇక మాట్లాడుకోవడాలు ఉండవు. వీలైతే నా పెళ్లికి రా అని నిరుపమ్ వెళ్లిపోతుంటే.. డాక్టర్ సాబ్ ఒక్క మాట.. నా ఒక్క మాటకు సమాధానం చెప్పి వెళ్లండి.. నేను ఆటో నడుపుకొనే దానిని కావొచ్చు. నీలా పెద్దగా చదువుకోకపోవచ్చు. కానీ ప్రేమించడానికి మనసు ఉందని తెలుసు. అది మీకు ఎందుకు తెలియడం లేదు. మీరు పెళ్లి చేసుకొనేది డాక్టర్‌నేనా? మనసు చంపుకొని.. నాపై ప్రేమను చంపుకొని.. ఆ శోభను పెళ్లి చేసుకొంటారా? అంటే.. నేను శోభను పెళ్లి చేసుకోవడం లేదు అని నిరుపమ్ సమాధానం చెప్పాడు.

    నీవు.. తింగరి అబద్దమే అంటూ జ్వాలా

    నీవు.. తింగరి అబద్దమే అంటూ జ్వాలా

    అయితే నీ ఫ్రెండ్‌ తింగరిని పెళ్లి చేసుకొంటారా? మీరు తింగరిని పెళ్లాడటం ఏమిటి? మీరు జోక్ చేస్తున్నారా? మీరు తింగరి కలిసి నన్ను పరీక్షిస్తున్నారు కదా.. చెప్పండి డాక్టర్ సాబ్. తింగరి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకొంటుంది అని జ్వాలా అంటే.. నేను తింగరిని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకొంటాను. నీది ఆకర్షణ మాత్రమే. నీది ప్రేమ కాదు అని నిరుపమ్ అంటే.. నాది ప్రేమ కాదని ఎలా చెబుతారు? నాది ప్రేమే అంటూ జ్వాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఊహించుకోవడం ప్రేమ కాదు. రక్తంతో బొమ్మ గీస్తే.. బొమ్మ వస్తుంది. కానీ ప్రేమ రాదు అని నిరుపమ్ అంటే.. మీరు అబద్దం.. మీరు, మీ తింగరి ఇద్దరు అబద్దమే అని జ్వాలా అంటుండగా.. నిరుపమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    English summary
    Karthika Deepam 22nd June Episode number 1385.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X