Karthika Deepam నిరుపమ్‌తో పెళ్లి ఇష్టం లేదు.. పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయిన హిమ

అత్త, మామల మ్యారేజ్ డే రోజున నిరుపమ్‌తో తన పెళ్లి గురించి నానమ్మ సౌందర్య నిర్ణయం తీసుకొన్న తర్వాత హిమ ఆనందంలో మునిగిపోయింది. అర్జెంట్‌గా జ్వాలా అలియాస్ శౌర్యను పిలిచి షాపింగ్ చేయించింది. ఐస్ క్రీమ్ షాపులోకి పిలిచి తాను హిమ అనే విషయాన్ని చెప్పాలనే టెన్షన్‌లో పడింది. ఏం ఐస్‌క్రీమ్ తింటావు అని అడిగితే.. ఐస్ క్రీమ్ కంటే నీవంటేనే ఇష్టం. నా నిశ్చితార్థంకు ముందు నేను హిమను అని తెలిస్తే.. నీవు నాకు దూరం అవుతావా? ఒకవేళ దూరమైతే నేను పెళ్లి చేసుకోలేను. నేను హిమను అని తెలిస్తే నన్ను క్షమిస్తావా? లేదా తిడుతావా? నీవు నన్ను ఏమన్నా నేను బదులు చెప్పను అంటూ హిమ మనసులో రకరకాల ప్రశ్నలు వేసుకొన్నది. కార్తీకదీపం సీరియల్‌లో 1350 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

నా మనసులో మాట చెబుతాను అంటూ హిమ

నా మనసులో మాట చెబుతాను అంటూ హిమ


ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన తర్వాత జ్వాలాతో హిమ మాట్లాడుతూ.. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకొంటున్నాను అంటే.. తింగరి నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలని అనుకొంటున్నాను. అది నా జీవితంలో ముఖ్యమైన విషయం అని జ్వాలా బదులిచ్చింది. అయితే నువ్వే చెప్పమని హిమ అంటే.. లేదు నీవ్వే చెప్పు అంటూ జ్వాలా అంది. డాక్టర్ సాబ్‌పై ఉన్న నా ప్రేమను చెప్పాలనుకొంటున్నాను అని జ్వాలా మనసులో అనుకొంటూ.. చెప్పు తింగరి అని జ్వాలా అంటే.. పెద్ద దానికి నువ్వే చెప్పు అని హిమ అన్నారు. దాంతో డాక్టర్ సాబ్ నాకు ఫోన్ గిఫ్టు ఇచ్చాడు. డాక్టర్ సాబ్ మంచివాడు కదా అని జ్వాలా అంటే.. అవును అంటూ హిమ నవ్వుల్లో మునిగిపోయింది. అయితే నీవు చెప్పాలనుకొన్నది చెప్పు అని జ్వాలా అంటే.. ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకొందా అని హిమ చెప్పింది. ఐస్ క్రీమ్ మీద పడటంతో కడిగేసుకోవడానికి వెళ్లి రావడంతో హిమ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో జ్వాలా కంగారుపడింది.

 నానమ్మ నిర్ణయంతో ప్రేమ్ షాక్

నానమ్మ నిర్ణయంతో ప్రేమ్ షాక్


తాను ప్రేమించే హిమను నిరుపమ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నానమ్మ సౌందర్య నిర్ణయం తీసుకోవడంతో ప్రేమ్ కుంగిపోయాడు. నా జీవితం కంటే హిమ ఎక్కువ అనుకొన్నాను. నాకు ఇష్టమైన ఫోటోగ్రఫి కంటే హిమను ఎక్కువగా ప్రేమించాను. కానీ నానమ్మ ఇలా ఎందుకు చేసింది? కనీసం హిమ అయినా చెప్పాలి కదా.. నాకు ప్రేమ్ అంటే ఇష్టమని అని ప్రేమ్ ఆవేదన చెందాడు. ఇక జీవితంలో నా ఆశలన్నీ అయిపోయాయి అని ప్రేమ్ బాధలో మునిగిపోయాడు. తన ఫోన్‌లో హిమ ఫోటోలను డిలీట్ చేస్తుంటే.. తండ్రి వచ్చి.. ఏం చేస్తున్నావంటే.. ఫోటోలు డిలీట్ చేస్తున్నాను. నా మూడ్ బాగాలేదు. నేను అనుకొన్నది జరగలేదు అని ప్రేమ్ అంటే.. మరోసారి ట్రై చేయమని తండ్రి చెప్పడంతో ప్రేమ్ మరింత బాధతో ఒంటరిగానే ఇంటిలో ఉండిపోయాడు.

జస్ట్ ఎంగేజ్‌మెంట్ మాత్రమే..

జస్ట్ ఎంగేజ్‌మెంట్ మాత్రమే..


నిశ్చితార్థం చేయాలని నానమ్మ ప్రయత్నాలు చేయడంపై హిమ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే శౌర్య లేకుండా నేను పెళ్లి చేసుకోలేను అని హిమ అంటే.. శౌర్య లేకుండా నీ పెళ్లి చేయను. ఇది జస్ట్ ఎంగేజ్‌మెంట్ మాత్రమే. శౌర్య దొరికిన తర్వాతే నీ పెళ్లి చేస్తాను. కావాలంటే శౌర్యను నేనే వెతికి తీసుకొస్తాను. స్వప్న నిన్ను ఏమైనా అంటే.. పెద్దగా పట్టించుకోకుండా ఉండు అని హిమకు సౌందర్య సూచించింది. నిరుపమ్‌తో పెళ్లి చేయడానికి స్వప్న అత్తతో పోరాడిన తీరు తెలుసుకొని హిమ ఎమోషనల్ అయింది. దాంతో పెళ్లి తర్వాత కూడా నిరుపమ్ నీవు నాతోనే ఉంటారని చెప్పడంతో ఆనందంతో సౌందర్యను హిమ కౌగిలించుకొన్నది.

డాక్టర్ సాబ్ ప్రేమలో జ్వాలా

డాక్టర్ సాబ్ ప్రేమలో జ్వాలా


డాక్టర్ సాబ్ గిఫ్టుగా పంపిన చీరను పట్టుకొని జ్వాలా ఆనందపడిపోయింది. తన మనసులో మాటను చెప్పడానికి ప్రయత్నిస్తే.. ప్రేమ్ వచ్చి చెడగొట్టాడు. ఏదో ఒకరోజు డాక్టర్ సాబ్ ఐలవ్ యూ చెబుతాడు. డాక్టర్ సాబ్ ఏది చేసినా నాకు ఆనందంగా ఉంటుంది అని నిరుపమ్‌పై తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్యాసింజర్‌ను ఆటోలో తీసుకెళ్తుండగా.. అమ్మాయిలు ఆటో నడపుతారా అంటే.. ఆటో నడపకూడదా అంటూ ప్రశ్నించింది. రేపు పెళ్లి జరిగితే.. నీ భర్త కూడా ఆటో డ్రైవర్ అయితే ఇద్దరు ఏం చక్కా లైఫ్‌ను ఎంజాయ్ చేయవచ్చు అని అంటే.. వెంటనే ఆటోను ఆపి.. దిగు. నేను ఆటో డ్రైవర్‌ను పెళ్లి చేసుకోవాలా? నా కాబోయే భర్త పెద్ద డాక్టర్. ఎంత అందంగా ఉన్నాడో చూడు. ఈ ఆటో కూడా అతడే కొనిచ్చాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడకు అని ప్యాసింజర్ అక్కడే వదిలేసి వెళ్లింది.

నాకు పెళ్లి ఇష్టం లేదు.. అంటూ

నాకు పెళ్లి ఇష్టం లేదు.. అంటూ


ఇక కార్తీకదీపం సీరియల్ తాజా ప్రోమోలో మరో ట్విస్టుకు తెరలేపారు. నిరుపమ్‌తో హిమ పెళ్లి నిశ్చితార్థం జరుగుతుండగా అదే గుడిలో జ్వాలా పూజలు చేస్తూ కనిపించింది. అయితే ఉన్నట్టుండి.. నిరుపమ్‌తో నాకు పెళ్లిచేయడం ఇష్టం లేదని హిమ షాక్ ఇచ్చింది. దాంతో నిరుపమ్, సౌందర్య, స్వప్న, ప్రేమ్ షాక్‌లో ఉండిపోయారు. హిమ ఏం మాట్లాడుతున్నావు నీవు అంటే.. సారీ బావ అంటూ పెళ్లి పీటల మీద నుంచి హిమ లేచిపోయింది. దాంతో ఈ సీరియల్‌ కథ మరో మలుపు తిరిగినట్టు అయింది.

18వ వారం కార్తీకదీపం రేటింగ్ ఇలా..

18వ వారం కార్తీకదీపం రేటింగ్ ఇలా..


ఇక కార్తీకదీపం సీరియల్ రేటింగ్ మాత్రం ఇంకా తగ్గుతూనే ఉంది. 17వ వారంలో 11.42 రేటింగ్ నమోదు చేసుకోగా. 18వ వారంలో 11.48 రేటింగ్‌తో సరిపెట్టుకొన్నది. విపరీతమైన సాగదీతకు తోడు ఐపీఎల్ మ్యాచ్‌లు కారణంగా ఈ సీరియల్‌పై భారీగా ప్రభావం పడింది. దాంతో గత కొద్దివారాలుగా ఈ సీరియల్ రేటింగ్ తగ్గుతూ వస్తున్నది. కంటెంట్‌లో ఏదైనా భారీగా, ఇంట్రెస్టింగా మార్పులు జరిగితే తప్ప.. రేటింగ్ మళ్లీ పూర్వస్థితికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X