Karthika Deepam నిరుపమ్‌పై ప్రేమలో పడిన శౌర్య.. మనసులో మాటను అలా బయటపెట్టిన రౌడీ
ఎప్పుడూ ముఖంపై కోపంతో చిర్రుబుర్రులాడే శౌర్య తొలిసారి ఆనందంలో మునిగిపోయింది. తన భావ నిరుపమ్ ( బిగ్ బాస్ ఫేమ్ మానస్) తనను పొగడ్తలతో ముంచెత్తడంతో సంతోషంతో ఉప్పొంగింది. ఇప్పుటి వరకు తనను మగరాయుడు అనే వాళ్లు. కానీ మొదటిసారి నేను అమ్మాయినని నిరుపమ్ గుర్తించాడు అంటూ శౌర్య తనలో తాను మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అయ్యింది.
ప్రేమ్ తనను అవమానించడంపై శౌర్య మండిపడుతూ.. నా తప్పు లేకపోతే.. ఎదుటివాడి ఫ్రూట్స్ పగిలిపోతాయి అంటూ శౌర్య తనలో తాను అనుకొన్నది. డాక్టర్ సాబ్ నేను ఈ రోజు హ్యాపీ. అమ్మాయి అంటే నాలా ఉండాలి అంటూ శౌర్య అనుకొన్నది. ఆనందరావు గుండెపోటు రావడంతో హాస్పిటల్‌లో చేరడం లాంటి అంశాలు ట్విస్టుగా మారాయి. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1312లో ఇంకా ఏం జరిగిందంటే..

శౌర్య గురించి హిమ, నిరుపమ్
హాస్పిటల్ నుంచి నిరుపమ్, హిమ ఇద్దరు ఇంటికి వెళ్తూ శౌర్య గురించి మాట్లాడుకొన్నారు. హాస్పిటల్‌లో చూసిన అమ్మాయిని చూస్తే.. మనకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు అనే ఫీలింగ్ కలిగింది అంటూ హిమ అంటే.. అవును నాకు కూడా అదే అనిపిస్తుంది. సరిగ్గా నేను ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను అని నిరుపమ్ అన్నాడు. హిమ నీవు ఎందుకు ఉండవు. నీలో సిగ్గు, బిడియం ఎక్కువే.. నీవు ఎందుకు అలా ఉండవు అని నిరుపమ్ అంటే.. నా వల్ల కాదు అలా ఉండడం అని హిమ చెప్పింది.

నిరుపమ్‌పై ఇష్టం పెంచుకొంటున్న శౌర్య
రోడ్డు పక్కన ఆటో పెట్టుకొని శౌర్య ఆనంద పడి పోతున్న సమయంలోనే నిరుపమ్, హిమ కారు పక్క నుంచే వెళ్లింది. దాంతో కారులో ఎవరో నాకు తెలిసిన వాళ్లు ఉన్నారేమో అనిపిస్తున్నది అని శౌర్య అనుకొంటే.. రోడ్డు పక్కన ఆటోను చూసి అందులో ఆ అమ్మాయి ఉందేమో అని హిమ అంది. ఏమో ఉండోచ్చు అంటూ హిమకు నిరుపమ్ సమాధానం చెప్పాడు.
అమ్మాయితో నీవు వారం రోజులు ఉంటే.. నీవు పూర్తిగా మారిపోతావు అని నిరుపమ్ అంటే.. నాకు అవసరమా అని హిమ బదులిచ్చింది. అయితే నీవు ఆమెతో ఉంటే.. సిగ్గు, బిడియం, పిరికతనం, మొహమాటం అన్నీ తగ్గిపోతాయి అని నిరుపమ్ చెప్పాడు. నీ భయం బంగాళాఖాతంలో కలిసిపోతుంది అని అన్నాడు. దాంతో తన చేతిలో పచ్చబొట్టు చూసుకొని శౌర్యను గుర్తు చేసుకొన్నది. శౌర్య కూడా తన చేతిపై హిమ పచ్చ పొట్టు చూసుకొని కోపం తెచ్చుకొన్నది.

సౌందర్యను తిట్టేసిన కూతురు
ఇదిలా ఉండగా, సౌందర్య తన కూతురు, నిరుపమ్ తల్లి ఇంటికి వెళ్లింది. వారిద్దరి మధ్య మాటలు వాడివేడిగా జరిగాయి. కార్తీక్ చనిపోయిన తర్వాత మా కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. అది జరగని పని అంటూ కూతురు అంటే.. నేను ప్రయత్నాలు చేయలేదు. అందరూ కలిసి ఉంటే బాగుంటుందని అనుకొన్నాను అని సౌందర్య చెప్పింది. అయితే తండ్రి గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరాడని చెబితే.. నాకు తెలుసు.
కానీ నేను వచ్చి మొహమాటానికి పలకరించను. వాట్సాప్ కాల్‌లో పలకరిస్తాను అని కూతురు చెప్పడంతో.. తల్లిదండ్రులతో కూడా లెక్కలేసుకొని మాట్లాడుతావా అని సౌందర్య ఎమోషనల్ అయింది. ఇక నీవు మా ఇంటికి రాకపోతేనే మంచింది. నిరుపమ్ హాస్పిటల్‌లో హిమను చేర్పించి ఎవో కలలు కంటున్నావు అని కూతురు అంటుండగా.. నిరుపమ్ ఇంటిలోకి ప్రవేశించాడు.

ఓ తల్లి బాధపడుతున్నదని కూతురు గ్రహించడం లేదు
తల్లి మాటల విని నిరుపమ్ నొచ్చుకొంటూ.. నా తల్లి మారదు. ఆమె మొండిపట్టుతో అలానే ఉంటుంది. కానీ నాకు హిమ అవసరం. నానమ్మ, తాతయ్య కావాలి. మా అమ్మకు అక్కర లేకపోయినా.. మేము మీతోనే ఉంటాం. కానీ నాన్నమ్మ ఒక్క మాట.. ఈ ఇంటికి మీరు రావొద్దు. వచ్చి మా అమ్మతో మాటలు పడొద్దు. నీవు ఫోన్ చేయి వెంటనే నేను వచ్చి కలుస్తాను అని నిరుపమ్ అనడంతో సంతోష పడింది.
అయితే నా సోదరుడు ప్రేమ్ నా తండ్రి దగ్గర పెరుగుతున్నాడని అమ్మ బాధపడుతున్నది. కానీ కూతురు దూరమైనందుకు ఓ తల్లి బాధపడుతున్నదనే విషయం మా అమ్మకు తెలియడం లేదు అని నిరుపమ్ అన్నాడు. దయచేసి మీరు రావొద్దు.. మేమే మీ వద్దకు వస్తాం అని నిరుపమ్ అంటే.. వెళ్లి వస్తాను అని సౌందర్య అంటే.. ఇక రాకు అని కూతురు కటువుగా చెప్పింది. దాంతో నిరుపమ్‌పై ప్రేమగా చేయి వేసి.. హిమకు నీ అవసరం ఎంతైనా ఉంది అంటూ సౌందర్య వెళ్లిపోయింది.

నీ యాటిట్యూడ్ అంటే ఇష్టం..
ఇక తన పిన్నికి ఆరోగ్యం బాగలేకపోవడంతో నిరుపమ్ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. గ్యాస్ కారణం కడుపు నొప్పి వస్తున్నది. జాగ్రత్తగా ఉండండి అని అంటే.. నా పిన్ని ఆలస్యంగా భోజనం చేస్తుంది. రాత్రిళ్లు సరిగా భోజనం చేయదు అంటే.. ఏం పని చేస్తారని నిరుపమ్ అడిగితే.. శౌర్య కంగారుపడిపోయింది. వాళ్లు జేబులు కొట్టే పని చేస్తారని చెప్పడానికి కంగారు పడితే.. చాలా కష్టమైన పని చేస్తామని పిన్ని సర్ది చెప్పింది.
డాక్టర్ ఫీజు ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. నాకు ఫీజు అవసరం లేదు. కానీ మీరు నాకు ఓ పని చేసిపెట్టాలి అంటూ నిరుపమ్ అడిగాడు. అయితే ఏమిటని అడిగితే.. హిమకు భయం ఎక్కువ.. మీరు ఆ భయాన్ని పొగొట్టాలి అని నిరుపమ్ అడిగితే.. అందెంత పని అని శౌర్య అంది. దాంతో థ్యాంక్స్ అంటే.. మీరు నాకు థ్యాంక్స్ చెప్పవద్దు అని శౌర్య సమాధానం ఇచ్చింది. అయితే నీవు అంటే నాకు చాలా ఇష్టం. నీ యాటిట్యూడ్. నీ స్టయిల్, నీ ధైర్యం నాకు చాలా ఇష్టం అని నిరుపమ్ చెప్పగానే.. శౌర్య గాలిలో తేలిపోయింది.

హిమను తలుచుకొని శౌర్య ఎమోషనల్
ఇక హిమ గురించి ఆలోచిస్తూ శౌర్య ఎమోషనల్ అయింది. చిన్నప్పుడు హిమతో ఆడుకొన్న సంఘటనలను గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీలయ్యింది. హిమ ప్రతీ విషయానికి అలిగేది. కానీ డ్రైవింగ్ పిచ్చితో అమ్మా, నాన్నలను పొగొట్టు కావాల్సి వచ్చింది అని శౌర్య బాధపడింది. తన పెంపుడు తల్లిదండ్రులను ఉద్దేశించి క్లాస్ తీసుకొన్నది. జేబులు కొట్టడం తప్పు. ఇక ఆపనిని మానేయి అంటూ శౌర్య బుద్ది చెప్పింది.

తాజా ప్రోమోలో మరో ట్విస్టు
ఇక కార్తీకదీపం తాజా ప్రోమోలో హిమ, నిరుపమ్ ఇద్దరు శౌర్య గురించి మాట్లాడుకొంటూ కనిపించారు. ఆటో డ్రైవర్ అమ్మాయిని చూస్తే.. మన శౌర్యను చూసినట్టే అనిపిస్తుంది అని నిరుపమ్ అంటే. అవును. నాకు అలానే అనిపిస్తుంది అని హిమ తన మనసులోని మాటను చెప్పింది. ఇలా హిమ, నిరుపమ్ మాట్లాడుకొంటుంటే.. శౌర్య అక్కడికి వచ్చింది. శౌర్యను చూడగానే హిమ ఠక్కున లేచి నిలబడింది. ఈ సీరియల్‌లో తాజా ట్విస్టు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా కనిపించింది.

కార్తీక దీపం రేటింగ్ ఇలా..
ఇక కార్తీకదీపం సీరియల్ విషయానికి వస్తే.. ముగింపు దశకు చేరుకొన్నట్టు కనిపిస్తున్నది. కార్తీక్, దీప, శ్రావ్య, ఆదిత్య, మోనిత పాత్రలు ముగియడం ప్రేక్షకులకు కాస్త నిరాశను కలిగించే విషయమే. అయితే ప్రస్తుతం హిమ, శౌర్య, నిరుపమ్, ప్రేమ పాత్రల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.
అయితే కార్తీక్, దీప లేకపోయినా సీరియల్ రేటింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదనే విషయం తాజా రేటింగ్స్ స్పష్టం చేశాయి. తాజా వారంలో కార్తీకదీపం సీరియల్ 13.98 రేటింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో గృహలక్ష్మి 11.08 రేగింగ్, గుప్పెడంత మనసు 10.80 రేటింగ్‌తో సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











