Karthika Deepam నిరుపమ్ పెళ్లి హిమతో.. జ్వాలాకు షాకిచ్చిన సౌందర్య
డాక్టర్ హిమపై ప్రేమ్ లవ్ పెరిగిపోతూనే ఉంది. తన కెమెరాతో గోడమీద ఉన్న హిమ ఫోటోను చూస్తూ ఉండటంతో నిజంగానే తనతో మాట్లాడినట్టు భ్రమపడ్డాడు. నా గుండెలో చాలా ప్రేమ ఉంది. ఆ విషయాన్ని చెప్పడానికి నేను ఎందుకు భయపడుతున్నాను అని ప్రేమ్ మనసులో అనుకొన్నాడు. హిమ నీవంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్ హిమ. అమ్మ,నాన్న మ్యారేజ్ డే ఫంక్షన్‌లో ఎలాగైనా నా ప్రేమను చెప్పేస్తాను అంటూ ప్రేమ్ ఊహల్లో తేలిపోయాడు. ఇక కార్తీకదీపం మే 9వ తేదీ 1347 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

నిరుపమ్ నీవు గ్రేట్ అంటూ జ్వాలా
ఇక నిరుపమ్, జ్వాలా అలియాస్ శౌర్య మధ్య లవ్ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తన తల్లిని మ్యారేజ్ డేకు రప్పించడంలో జ్వాలా చేసిన పనికి ఆమెను ప్రశంసించాడు. మా అమ్మ, నాన్న మ్యారేజ్ డేకు నీవు తప్పకుండా రావాలి. అక్కడికి వస్తే.. నా మనసులో మాట చెబుతాను అని నిరుపమ్ చెప్పిన విషయాలు ఊహించుకొని.. ఇంకేం చెబుతాడు. ఐ లవ్ యూ అని చెబుతాడేమో అని జ్వాలా అనుకొన్నది. బంధాలు విలువ ఇచ్చే నీవు నాకు దొరకడం చాలా సంతోషం. డాక్టర్ బాబు నిజంగా నీవు గ్రేట్ అంటూ నిరుపమ్‌కు జ్వాలా ఫోన్ కలిపింది.

జ్వాలాకు నిరుపమ్ గిఫ్ట్
నిరుపమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. మీ తల్లిదండ్రుల మ్యారేజ్ ఎప్పుడు అంటే.. నీకు మెసేజ్ చేస్తానని చెప్పాడు. అయితే తాను అదే హోటల్‌లో ఉన్నానని చెప్పగానే.. అక్కడికి నిరుపమ్ వచ్చి ఓ గిఫ్టును చేతిలో పెట్టాడు. ఈ గిఫ్ట్ ఎందుకంటే.. అసాధ్యం అనుకొన్న మ్యారేజ్ డే ఫంక్షన్‌ను చిటికెలో నీవు ఒప్పించేలా చేశావు అంటూ నిరుపమ్ అన్నాడు. గిఫ్టు ప్యాక్ ఓపెన్ చేసి.. ఈ ఫోన్ ఆపరేట్ చేయడం నాకు రాదు అంటే.. నిరుపమ్ వెంటనే ఎలా యూజ్ చేయాలో చూపించాడు. కొత్త ఫోన్‌తో జ్వాలాతో కలిసి నిరుపమ్ సెల్పీ దిగాడు. అయితే ఆ సమయంలో తాను నిరుపమ్‌కు తాకడంతో థ్రిల్ అయింది. అలా ఇద్దరు కలిసి సెల్ఫీ దిగారు.

హిమలో జ్వాలా టెన్షన్
తన అత్త, మామ మ్యారేజ్ డేకు జ్వాలా వస్తుందని తెలుసుకొన్న హిమ కంగారు పడిపోయింది. ఒకవేళ జ్వాలా వస్తే.. నేను హిమను, తన సోదరి అనే విషయం తెలిసి పోతుంది. దాంతో ఇన్నాళ్లు నాకు చెప్పకుండా మోసం చేశావా అని అనుకొనే ప్రమాదం ఉంది. నేను హిమను అని తెలుసుకొన్న తర్వాత మళ్లీ వెళ్లిపోతుందా? ఇక జ్వాలా వెళ్లిపోతే మళ్లీ కలుస్తుందా అనే ప్రశ్నలతో హిమ టెన్షన్ పడిపోయింది. దాంతో జ్వాలాను ఫంక్షన్‌కు రావొద్దని చెబుతాను అంటూ హిమ ప్లాన్ వేసుకొన్నది.

అందంగా ముస్తాబైన జ్వాలా
సౌందర్య, ప్రేమ్, నిరుపమ్ ఆనందోత్సావాలు, హిమ టెన్షన్ మధ్య సత్యం, స్వప్న మ్యారేజ్ డే ఫంక్షన్ ప్రారంభమైంది. జ్వాలా కోసం ఎదురు చూస్తూ.. హిమపై ప్రేమను జ్వాలాతో చెప్పించాలని నిరుపమ్ ప్లాన్ వేశాడు. మ్యారేజ్ డే ఫంక్షన్ కోసం జ్వాలా అందంగా ముస్తాబైంది. ఈ చీరలో ఎలా ఉన్నానని అడిగితే.. ఈ చీరలో గొప్పింటి అమ్మాయి మాదిరిగా కనిపిస్తున్నారంటే.. అవును నేను గొప్పింటిలోనే పుట్టాను. కానీ వాళ్లే ఎంత గొప్పోళ్లంటే.. నా గురించి పట్టించుకోనంతగా అని జ్వాలా కోపంతో ఊగిపోయింది.

నా మనవడి పెళ్లి మనవరాలితో అంటూ
సత్యం, స్వప్న మ్యారేజ్ డేలో భారీ ట్విస్టు ఇచ్చారు. తాజా ప్రోమోలో నా కూతురు స్వప్నకు పెళ్లి రోజు సందర్భంగా మంచి గిఫ్టు ఇవ్వాలని అనుకొంటున్నాను. నా మనవరాలు డాక్టర్ హిమకు నా మనవడితో పెళ్లి చేయాలని నిర్ణయించుకొన్నాను. హిమ, డాక్టర్ నిరుపమ్ ముందుకు రావాలి అంటూ పిలువగానే.. ప్రేమ్, జ్వాలా షాక్ తిన్నారు. తన అమ్మమ్మ చేసిన పనికి నిరుపమ్ హ్యాపీగా ఫీల్ కాగా.. జ్వాలా తీవ్రమైన షాక్‌కు గురైంది. ఈ ట్విస్టు మరో ఎపిసోడ్‌పై ఆసక్తిని కలిగించింది.

కార్తీకదీపం రేటింగ్‌పై ఐపీఎల్ దెబ్బ
బుల్లితెరపై సీరియల్స్‌కు ఐపీఎల్ దెబ్బ గట్టిగానే పడినట్టు కనిపిస్తున్నది. కార్తీకదీపం సీరియల్ రేటింగ్ దారుణంగా క్షీణించింది. 16వ వారంలో కార్తీకదీపం రేటింగ్ 11.51 రేటింగ్ నమోదు కాగా, 17వ వారంలో 11.42 రేటింగ్‌ను నమోదు చేసింది. అంతేకాకుండా ఈ సీరియల్‌లో పెద్దగా ట్విస్టులు లేకుండా రొటీన్‌గా సాగడం కూడా రేటింగ్ పడిపోవడానికి కారణమని చెప్పుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











