Karthika Deepam నా జోలికి వస్తే.. నీ చాప్టర్ క్లోజ్.. శోభ దవడ పగలకొట్టిన సౌందర్య
జ్వాలానే శౌర్య అని తెలుసుకొన్న సౌందర్య నేరుగా ఆమె ఇంటికి వెళ్లింది. జ్వాలా ఇంటిలో ఎవరు లేకపోవడంతో సౌందర్యనే వంట చేసి పెట్టింది. దోసకాయ పచ్చడి చేస్తాను అంటే.. నాకు ఇష్టం ఉండదు అని జ్వాలా చెప్పింది. అయితే మనసులో దోసకాయ పచ్చడి అంటే హిమకు ఇష్టం అందుకే నాకు ఇష్టం లేదని చెప్పానని మనసులో అనుకొన్నది. అయితే జ్వాలా దోసకాయ పచ్చడి ఇష్టం లేదని చెబితే.. నాకు తెలుసు.. హిమకు ఇష్టమని.. నీవు ఇష్టపడటం లేదు అని చెప్పావని నాకు తెలుసు అని సౌందర్య మనసులో అనుకొన్నది. ఇంకా కార్తీకదీపం సీరియల్ 1388 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

ప్రేమగా గొరు ముద్దలు తినిపిస్తూ..
నాన్నమ్మ సౌందర్య వంట చేసి ప్రేమ పంచిపెడుతుండటంతో.. మీరు ఎవరు? నాపై ఎందుకు ప్రేమను చూపుతున్నావు. నా గురించి తెలిసిపోయిందా? అని జ్వాలా మనసులో అనుకొన్నది. అంటే మీ అంతస్తులు మా అంతస్తులు వేరు కాదా? నాకు ఉన్న ఒక్క డాక్టర్ బాబు దూరమయ్యాడు అని జ్వాలా అన్నది. అయితే మీ డాక్టర్ బాబుతో మాట్లాడమంటావా? అని సౌందర్య అంటే.. లేదు.. దాని వల్ల ప్రయోజనం లేదని జ్వాలా చెప్పింది. అలా నానమ్మ ప్రేమగా గొరు ముద్దలు తినిపిస్తుంటే.. జ్వాలా ఎమోషనల్ అయింది. మేమెవరో తెలిసి కూడా మనసులో బాధలు అనుభవిస్తుంది అని సౌందర్య ఎమోషనల్ అయింది.

హిమ నా శత్రువు అంటూ
అయితే కొన్నాళ్లు మా ఇంటికి రా అని సౌందర్య అంటే.. కొన్నాళ్లేనా? అని జ్వాలా ప్రశ్నించింది. అయితే నీవు ఎప్పటికి ఉంటానని చెప్పినా? ఉండిపోవచ్చు అని సౌందర్య అంటే.. లేదు.. నేను ఉండటం సరికాదు అని జ్వాలా చెప్పింది. అయితే మనసులో నాకు రావాలనే ఉంది. కానీ అక్కడికి వస్తే.. నా శత్రువు హిమ ఉంటుంది. ఆమెను చూస్తే నాకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని నీ ముందు ప్రదర్శించడం నాకు ఇష్టం లేదు. నాకు ఇప్పుడు ఇద్దరు శత్రువులు. ఒకరు హిమ, మరొకరు తింగరి అంటూ జ్వాలా ఎమోషనల్ అయింది. అయితే ఆలోచనల్లో మునిగిపోవడంతో.. జ్వాలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడిగితే.. నన్ను అందరు మోసగిస్తున్నారు.. తింగరి నా పెళ్లి చేస్తానని చెప్పి.. నా డాక్టర్ బాబును పెళ్లి చేసుకొంటుందట అని జ్వాలా అంది. దాంతో తింగరి మోసం చేయడం లేదు.. త్యాగం చేస్తున్నది అని సౌందర్య మనసులో అనుకొన్నది.

సౌందర్యకు శోభ ఫోన్
జ్వాలా ఇంటి నుంచి బయటకు వస్తుంటే.. శోభ ఫోన్ చేసింది. నీ మనవడితో పెళ్లి చేస్తే.. నీ మనవరాలి అడ్రస్ చెబుతాను అని అంటే.. నీవు ఎక్కడ ఉన్నావో చెప్పు.. నేను అక్కడికి వచ్చి ప్రశాంతంగా మారిపోతాను అయితే నీ లోకేషన్ పెట్టు అని సౌందర్య అంది. దాంతో శోభ లొకేషన్ పెట్టడంతో శోభ వద్దకు ఆవేశంగా సౌందర్య బయలుదేరింది. ఇదిలా ప్రేమ్ ముంబైకి వెళ్తుండటంతో డాక్టర్ నిరుపమ్ ఆపేందుకు ప్రయత్నించాడు. నా పెళ్లి కోసం ఉండు. అని నిరుపమ్ అంటే.. అదే ఆలోచిస్తున్నా. చనిపోయే హిమను పెళ్లి చేసుకోవడం అవసరమా? అంటే.. చావు, పుట్టుక మన చేతిలో లేవు అంటూ నిరుపమ్ వేదాంతం ప్రదర్శించాడు.

శోభ మరో కుట్రతో..
శోభను చెంపదెబ్బ కొట్టి..
సౌందర్య తన ఇంటికి రావడంతో మా ఇల్లు పావనం అయిందని భావిస్తున్నా అంటూ డాక్టర్ శోభ స్వాగతించింది. ఇంట్లోకి రావడంతో నేను చెప్పిన డీల్ గురించి ఆలోచించారా అని అంటే.. ఏం డీల్ అంటే.. నీ మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తే.. నీ రెండో మనవరాలు అడ్రస్ చెబుతా.. క్యాన్సర్ పేషెంట్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే హిమ నెల రోజుల్లో చనిపోతుంది. నిరుపమ్ సెకండ్ హ్యాండ్ అవుతాడు అనగానే.. శోభను చెంపదెబ్బ కొట్టింది. ఏమనుకొంటున్నావే.. నా పేరు సౌందర్య.. సౌందర్య కొట్టిందని గుర్తు పెట్టుకొ.. ఏంటి ఎలా చూస్తున్నావు.. నీ చెంపకు నా చేయి తగిలితే.. నీ చెంప పావనం అయిందని అనిపించలేదా? నా మనవువడు, మనవరాలి జోలికి వస్తే.. నీ చాప్టర్ క్లోజ్.. నీ నోరు అదుపులో పెట్టుకో. నా ఫ్యామిలీ, నా వాళ్లను అంటే తట్టుకోలేను. జాగ్రత్త అంటూ హెచ్చరించింది.

శోభ మరో కుట్రతో..
సౌందర్య చేతిలో చెంపదెబ్బ తిన్న డాక్టర్ శోభ మరో కుట్రకు తెరలేపింది. ఒంటరిగా హిమను చూసి.. ఇప్పుడు నా తడాఖా చూపిస్తా అంటూ జ్వాలాకు ఫోన్ చేసింది. నేను ఓ చోట ఉన్నాను. నీవు అక్కడికి వస్తే.. నేను నీకు కలుస్తాను అంటూ పెట్టింది. దాంతో నేను వస్తున్నాను అని జ్వాలా ఆటోలో బయలుదేరింది. హిమను చూసి జ్వాలా మండిపడుతుంది. ఇక నేను ఒక ప్లాన్ వేస్తే మరోటి అవుతుంది. ఇప్పుడు నా ప్లాన్ వర్కవుట్ అవ్వడం ఖాయం అని శోభ అనుకొన్నది.


Click it and Unblock the Notifications











