నయనితో సుడిగాలి సుధీర్ అసభ్యంగా.. పగిలిపోద్ది అంటూ శివాజీ వార్నింగ్

జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఒకపక్క షోస్.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గాలోడు సినిమాతో హిట్ అందుకున్న సుధీర్.. ప్రస్తుతం గోట్ సినిమాతో రాబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక ఈ సినిమా వచ్చేలోపు సుధీర్ బుల్లితెరపై షోస్ కంటిన్యూ చేస్తున్నాడు.

ఇక ఆహాలో సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో సర్కార్ సీజన్ 4. మూడు సీజన్లకు ప్రదీప్ యాంకరింగ్ చేసి మెప్పించగా.. నాలుగో సీజన్ కు సుధీర్ హోస్ట్ గా మారాడు. సుధీర్ వచ్చాకా ఎంటర్ టైన్మెంట్ మరింత పెరిగిందని టాక్ నడుస్తోంది. మొదటినుంచి సుధీర్ కు ఉన్న క్రేజ్ అలాంటింది. పంచ్ లు వేయాలన్నా.. కామెడీ పండించాలన్నా సుధీర్ ఉండాల్సిందే.

biggboss fame sivaji and sudigali sudheer non stop punches in Sarkaar 4 Episode 8 PROMO

ఇప్పటికే 7 ఎపిసోడ్స్ ను విజయవంతంగా ఫినిష్ చేసుకున్న సర్కార్ 4 లో 8 వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈసారి ఈ షోలో బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ సందడి చేశారు. శివాజీ, నయని, రితిక, టేస్టీ తేజ షోలో పాల్గొన్నారు. వీరందరిని సుధీర్ ఆడుకోగా.. సుధీర్ ను మాత్రం శివాజీ ఆడుకున్నాడు.

హౌస్ లో శివాజీకి కనెక్ట్ అయినా లేడీ కంటెస్టెంట్స్ అంటే రితిక, నయని మాత్రమే. ఇద్దరు కూడా శివాజీని తండ్రిలా గౌరవిస్తారు. నయని అయితే.. శివాజీని తండ్రిగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆయన కూడా తనకు ఆడపిల్ల లేని లోటును నయని తీరుస్తుందని తెలిపాడు. ఈ షోలో వీరిద్దరిని సుధీర్ పులిహోర నుంచి శివాజీ కాపాడాడు. శివాజీ ఎంట్రీతోనే సుధీర్ కు పంచ్ లు వేశాడు.

నా గురించి ఆడియెన్స్ కు ఒక్కటి చెప్పండి అన్నా అని సుధీర్ వినయంగా అడగ్గా.. నీకేంటి సుధీర్.. అందగాడివి, మాములు స్పీడు కాదు అనగానే సుధీర్ ఆనందపడిపోయి బీభత్సమైన కామెడీ అన్నా రెండు జోక్ లు చెప్పవా అంటే.. ఇప్పుడు చెప్పినవి అవేగా అని పంచ్ వేశాడు. దీంతో సుధీర్ ముఖం వాడిపోయింది. ఈలోపు నయని వచ్చి సూపర్ సినిమాలని దొరికినంతా దోచుకో.. దోచుకుంది దాచుకో అంటూ నయని ని హాగ్ చేసుకోబోతుండగా.. ఆమెను పక్కకు లాగి శివాజీ వస్తాడు. ఎరా పట్టేసుకుందామనే అని మళ్లీ పంచ్ వేస్తాడు. ఇక నయనితో పులిహోర కలుపుతూ సుధీర్.. ఈ పాటకు చాలా మీనింగ్ ఉంది తెలుసా అనగానే.. శివాజీ పగిలిపోద్ది అంటూ డైలాగ్ వదిలాడు.

ఇక ఇలాగే రతిక వచ్చినప్పుడు కూడా శివాజీ.. సుధీర్ ను ఒక ఆట ఆడుకున్నాడు. ప్రశ్నలతో సుధీర్ రెచ్చిపోయాడు. పాట పాడించి డబ్బులు తీసుకొని శివాజీ తిక్క కుదిర్చాడు. అయితే చివర్లో శివాజీ ఫైర్ అయ్యాడు. సహజంగా తనకు బీపీ రాదని, సుధీర్ పెంచుతున్నాడని అన్నాడు.. మధ్యలో అడ్డొచ్చిన తేజను ఎవడ్రా నువ్వు అంటూ మాట్లాడాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X