Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్‌బాసే షాకయ్యే న్యూస్.. కొత్తగా హౌస్‌లోకి హాట్ సినీనటి, క్రీడాకారిణి
తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమం సంచలనం రేపుతున్నది. బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తున్నట్టు తాజా రేటింగ్స్ వెల్లడి
తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమం సంచలనం రేపుతున్నది. బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తున్నట్టు తాజా రేటింగ్స్ వెల్లడిస్తున్నాయి. అయితే వారం అంతా ఈ కార్యక్రమం జోష్ లేకుండా కొనసాగుతున్న కార్యక్రమానికి వారాంతంలో ఎన్టీఆర్ మాయ చేస్తున్నాడు. తమిళ బిగ్‌బాస్ మాదిరిగా ఎలాంటి సంచలనాలు లేకుండా నడుస్తున్న ఈ కార్యక్రమానికి దుమ్ము రేపే విధంగా టీఆర్సీ రావడం టీవీ నిర్వాహకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
బుల్లితెరపై ఎన్టీఆర్ జాదూ..
జూలై 16న ప్రారంభమైన బిగ్‌బాస్ కార్యక్రమం తొలుత బాగానే ఆకట్టుకొన్నది. ఆ తర్వాత ఏడుపులు, అలకలతో తెలుగు టీవీ సీరియల్‌ను మించిపోయింది. వారం రోజులు విసుగు తెప్పించే విధంగా ఉందనే ఫీలింగ్ కలిగే సమయంలో వారాంతంలో ఎన్టీఆర్ రంగంలోకి దూకాడు. తన మాటలతో గారడీ చేశాడు. దాంతో ఒక్కసారిగా స్టార్ మా చానెల్ రేటింగ్ దూసుకెళ్లింది.
Recommended Video
దూసుకెళ్తున్న టీవీ రేటింగ్
స్టార్ మా టెలివిజన్ ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం బిగ్‌బాస్ కార్యక్రమంతో టీఆర్ఫీ 16.18గా నమోదైంది. ఇటీవల కాలంలో ఒక ఛానెల్‌కు ఇంత రేంజ్లో రేటింగ్ రావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న స్టార్ మా బిగ్‌బాస్ షో రియాలిటీ షో ప్రారంభమైన తర్వాత మొదటి స్థానానికి ఎగబాకడం రికార్డుగా చెప్పుకొంటున్నారు.
సంతోషంలో నిర్వాహకులు
బిగ్‌బాస్ ఇంటిలో సభ్యులు మధ్య కలహాలు, కోపతాపాల్లాంటి ఘటనలతో అతి సాధారణంగా నడుస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమం వెంటిలేటర్ మీదకు చేరుతుందా అనే భావన వచ్చే సమయంలో ఇలాంటి రేటింగ్ రావడం నిర్వాహకులను సంతోషంలో ముచ్చెత్తుతున్నట్టు తెలుస్తున్నది.
కొత్తగా హాట్ సభ్యుల చేరిక?
ప్రస్తుతం నిస్తేజంగా మారుతున్నట్టు కనిపిస్తున్న ఈ టీవీ షో మరింత ప్రజాదరణ పొందాలంటే, ఈ రేటింగ్ నిలబడాలంటే ఏదో మహత్తు జరిగాల్సిందే. ఇప్పటికే జ్యోతి, సంపూ, ముమైత్ ఇంటి నుంచి కనుమరుగైపోయారు. ఇప్పుడు వారి స్థానంలో కొత్తగా హాట్ సభ్యులను దించుతారనే మాట బలంగానే వినిస్తున్నది.
తెరపైకి హాట్ క్రీడాకారిణి
దీంతో మరోసారి మంచు లక్ష్మి, పోసాని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో ఒకరిని లోనికి పంపిస్తారనే టాక్ కొత్తగా చేరింది. ఇక స్పోర్ట్స్ కోటా అనగానే గుత్తా జ్వాలా అంటూ ప్రచారం మొదలైంది. ఒకవేళ వీరుకాక ఎవరైనా హాట్ హాట్ సెలబ్రిటీలు ఇంటిలోనికి వెళ్లగలిగితే బిగ్‌బాస్‌కు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.