టాప్ సెలబ్రిటీతో అఫైర్.. బ్రేకప్ తర్వాత చచ్చిపోవాలనుకొన్నా.. డార్క్ సీక్రెట్ చెప్పిన శ్రీముఖి

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 96 Highlights || డార్క్ సీక్రెట్ చెప్పిన శ్రీముఖి

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 95వ రోజు నామినేషన్‌కు సంబంధించిన అంశంపై ఆ టాస్క్ కొనసాగింది. అలాగే డార్క్ సీక్రెట్ గురించి చెప్పే మరో టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఇలాంటి విషయాల ఆధారంగా నడిచిన షోలో కొందరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. 95వ రోజు ఎపిసోడ్‌లో ఏమి జరిగిందంటే..

కలర్ బౌల్‌తో టాస్క్

కలర్ బౌల్‌తో టాస్క్

ఇంటి సభ్యుల్లో నచ్చని అంశాలు చెబుతూ వారికి వచ్చిన ఓ బౌల్‌లోని కలర్‌ను తనకు నచ్చని వ్యక్తి మీద వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఒక్కో బౌల్‌పై ఓ పేరు ఉంటుంది. ఆ పేరు వ్యక్తి ఎందుకు నచ్చలేదో అనే విషయాన్ని చెప్పి వారిపై ఆ బౌల్‌లో ఉండే కలర్ వేయాల్సి ఉంటుంది.

అలీపై బాబా భాస్కర్

అలీపై బాబా భాస్కర్

కలర్ బౌల్ టాస్క్‌లో భాగంగా మొదట బాబా భాస్కర్ అలీపై బ్లూ కలర్‌ను వేశాడు. తనను పరాయి వాడిగా చూశాడనే కారణం తనకు నచ్చలేదని.. ఓ టాస్క్ సందర్భంగా తనతో సరిగా ప్రవర్తించలేదనే విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. తనకు టాస్క్‌లో మీ పేరు వచ్చింది కాబట్టి నాకు నచ్చని విషయాలు చెప్పాను అంటూ కలర్ వేశాడు.

వరుణ్‌పై శివజ్యోతి

వరుణ్‌పై శివజ్యోతి

ఇక ఆ తర్వాత వరుణ్‌పై శివజ్యోతి కలర్ వేసింది. మహిళ విషయంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పే నీవే.. నాతో ఓ సందర్భంగా సరిగా వ్యవహరించలేదు. ఆ సందర్భంలో నీ బాడీ లాగ్వేజ్ నాకు నచ్చలేదు. నీవు మాట్లాడిన తీరును నన్ను బాధపెట్టింది. అందుకే ఈ కలర్ వేస్తున్నాను అని శివజ్యోతి చెప్పడంతో వరుణ్ సందేశ్ ఇరిటేట్ అయ్యాడు.

శివజ్యోతిపై శ్రీముఖి

శివజ్యోతిపై శ్రీముఖి

శ్రీముఖి తనకు లభించిన కలర్ బాక్స్‌ను శివజ్యోతిపై వేసింది. ప్రతీ విషయాన్ని ఎమోషనల్‌గా మార్చేందుకు ప్రయత్నించినట్టు అనిపించింది. టాస్క్‌లో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదు. నీకు ఉన్న సత్తాకు సూపర్ అనిపించుకోవాలి. కానీ నీవు గుడ్ అనే రేంజ్‌లో ఉన్నావు అని శ్రీముఖి చెప్పి శివజ్యోతిపై కలర్ పోసింది.

ఓ ప్రముఖుడితో నాకు అఫైర్

ఓ ప్రముఖుడితో నాకు అఫైర్

కలర్ బౌల్ టాస్క్ తర్వాత జీవితంలో ఎవరికీ తెలియని డార్క్ సీక్రెట్ గురించి చెప్పాలి. ఈ టాస్క్‌లో శ్రీముఖి తన బ్రేకప్ గురించి వెల్లడించింది. ఏ అమ్మాయికైనా అఫైర్లు సాధారణం. తాను యాంకర్‌గా మంచి ఊపులో ఉన్నప్పుడు ఒక ప్రముఖుడితో అఫైర్ ఉండేది. ఓ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో షూటింగ్ చేస్తుండగా నాకు బ్రేకప్ మెసేజ్ వచ్చింది. అప్పుడు తట్టుకోలేక మేకప్ రూమ్‌లోకి వెళ్లాను. నాకు మేకప్ చేస్తుండగానే భోరున ఏడ్చాను. స్టేజ్ మీద కూడా ఏడుస్తూనే ఆ రోజు షూట్ కంప్లీట్ చేశాను.

చచ్చిపోవాలనుకొన్నాను

చచ్చిపోవాలనుకొన్నాను

నా జీవితంలో బ్రేకప్ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ బాధను తట్టుకోలేక చచ్చిపోవాలనుకొన్నాను. కానీ నాకు నేను ధైర్యాన్ని కూడగట్టుకొని ఓ స్టేజ్‌కు చేరుకొన్న తర్వాత రిలేషన్స్ పెట్టుకోవాలనిపించింది. ఆ తర్వాత నేను అలాంటి వాటికి వెళ్లలేదు. నాకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. నాకు బ్రేకప్ చెప్పిన వ్యక్తి ఎవరనే విషయం చెప్పను. అది చెబితే మరో కొత్త స్టోరి అవుతుంది అని శ్రీముఖి తన డార్క్ సీక్రెట్‌ను చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X