Bigg Boss Non Stop: ఓటీటీ షోలోకి బిందు మాధవి.. ఇంకా ఎవరెవరు వెళ్తున్నారంటే?
బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ అనే కాకుండా.. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రాసారమవుతుంది అంటే డానికి ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో ఐదు సీజన్స్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సర్వం సిద్ధమయింది. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ఈ షో ప్రసారం కానుండగా ఈ షోలో ఒక మాజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

హీరోయిన్ పేరు కూడా
ఫిబ్రవరి 26 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ప్రసారం కానున్న బిగ్‌బాస్ నాన్ స్టాప్ కోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయింది. మరో మూడు రోజుల్లో షో ప్రారంభం కానున్న క్రమంలో వారందరిని క్యారంటైన్‌కి కూడా తరలించారట. ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేర్లు ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ లిస్టులో ఓ హీరోయిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

తెలుగమ్మాయి
ఆమె మరెవరో కాదు, తేలుగులో ఆవకాయ బిర్యాని, పిల్ల జమిందార్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిందు మాధవి. మదనపల్లెలో పుట్టిన ఆమె తండ్రి కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కమీషనర్, కావడంతో తిరుపతి , నెల్లూరు , గుంటూరు , తెనాలి , విజయవాడ మరియు హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాలలో నివసించారు. వారి కుటుంబం తమిళనాడులోని చెన్నైలో స్థిరపడటానికి ముందు వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

ఆవకాయ్ బిర్యానీ
కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే ఆమె మోడలింగ్ ప్రారంభించగా ఆమె మొదటి అసైన్‌మెంట్ శరవణ స్టోర్స్‌కి చేసింది. అలాగే ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది, కానీ ఆమె చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడాన్ని ఆమె కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. సినిమాల్లోకి వెళ్లనివ్వడం లేదని ఎనిమిది నెలలు తన తండ్రి తనతో మాట్లాడలేదట, దీంతో తర్వాత ఆయన ఒప్పుకున్నారు. ఆమె చెన్నైలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్‌ని కలుసుకుని సినిమా పోర్టిఫోలియో సిద్దం చేసుకుంది. అలా ఆమె ఆవకాయ్ బిర్యానీ (2008) లో నటించడానికి ప్రముఖ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల ఆడిషన్ కి హాజరయి హీరోయిన్ గా ఎంపికయింది. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది కానీ హిట్ మాత్రం కాలేదు.

అవకాశాలు వస్తాయని
అయితే ఈ మధ్య కాలంలో బిగ్‌బాస్ ఓటీటీ టీమ్ సోషల్ మీడియాలో ముఖం సరిగా కనిపించని ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి నెటిజన్స్‌కు పజిల్ పెట్టారు. ఆ ఫోటో పక్కా బిందు మాధవిదే అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఆ పజిల్ లో సదరు హీరోయిన్ వయసు 38 అని పేర్కొన్నారు కానీ మాధవి వయసు 35 మాత్రమే. అయినా సరే ఆమె బిందు మాధవినే అని అంటున్నారు. ఇక ఆమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆమె బిగ్‌బాస్ ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ షో ద్వారా అయినా మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయని మాధవి భావిస్తోందని టాక్.

విడుదలకు సిద్ధంగా
నిజానికి బిందు మాధవి 2017లో తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొంది. అయితే ఆ సీజన్ లో ఆమె టాప్ 5 దాకా వెళ్ళింది. కమల్ హాసన్ హోస్ట్ చేసిన ఆ షోలో ఆమె నాలుగవ రన్నరప్ గా నిలిచింది. ఇక గత సీజన్స్ కంటెస్టెంట్లను కూడా ఇప్పుడు తీసుకుంటున్న క్రమంలో ఆమెను మళ్ళీ తీసుకుంటున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఆమె చివరిగా 2019లో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె చేస్తున్న మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తెలుగులో మళ్ళీ క్రేజ్ దక్కించుకోవడం కోసమే ఆమె ఈ షోలో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

మాధవితో పాటు
ఇక మాధవితో పాటు ఈ షోలో కమెడియన్ ధనరాజ్ (మొదటి సీజన్ కంటెస్టెంట్), ఆదర్శ్ (మొదటి సీజన్ రన్నర్), ముమైత్ ఖాన్ (మొదటి సీజన్ కంటెస్టెంట్), రోల్ రైడా (రెండో సీజన్ కంటెస్టెంట్), తేజస్వి (రెండో సీజన్ కంటెస్టెంట్), అషు రెడ్డి (మూడో సీజన్ కంటెస్టెంట్), అరియానా గ్లోరి (నాలుగో సీజన్ కంటెస్టెంట్), మహేశ్ విట్ట (నాలుగో సీజన్ కంటెస్టెంట్), సరయు (ఐదో సీజన్ కంటెస్టెంట్), హమీదా (ఐదో సీజన్ కంటెస్టెంట్), నటరాజ్ మాస్టర్ (ఐదో సీజన్ కంటెస్టెంట్) కూడా మల్లె పాల్గొననున్నారు. ఇక వీరు కాక యూట్యూబ్ యాంకర్ నిఖిల్ సింహా, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, యూట్యూబ్ యాంకర్ శివ , నైజీరియన్ చిచ్చా చార్లెస్, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు అఫియల్ లిస్ట్‌లో ఉంటారో తెలియాలంటే.. ఫిబ్రవరి 26 వరకు ఆగక తప్పదు.


Click it and Unblock the Notifications











