ఏయ్ అఖిల్‌గా రెచ్చిపోయిన బిందు మాధవి.. ఒసేయ్ బిందు అంటూ అఖిల్ సార్థక్ కౌంటర్
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఎప్పటిలానే నామినేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. 7వ వారం నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం భారీగా జరిగింది. హద్దు దాటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసుకొన్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య, అలాగే నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య జోరుగా మాటల యుద్దం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ మధ్య ఎలాంటి గొడవ జరిగిందంటే?

డబుల్ ఎలిమినేషన్‌తో
బిగ్‌బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షోలో గతవారం బిగ్‌బాస్ అటు ఇంటి సభ్యులకు, ఇటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్‌ను తెరపైకి తెచ్చి ఇద్దరు కంటెస్టెంట్లను ఇంటి నుంచి బయటకు పంపించారు. 6వ వారంలో ఇంటి నుంచి ముమైత్ ఖాన్, స్రవంతి చొక్కారపు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

జంటలు జంటలుగా నామినేషన్ ప్రక్రియ
ఇక ఏడోవారం ఎలిమినేషన్‌కు సోమవారం రంగం సిద్దమైంది. అందుకు నామినేషన్ల ప్రక్రియను బిగ్‌బాస్ ప్రారంభించారు. నామినేషన్ల ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జంటగా ప్రారంభమవుతున్నది అని నామినేషన్ ప్రక్రియ రూల్స్ చెప్పాడు. దాంతో హమీదా, అనిల్ రాథోడ్ మధ్య, యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ మధ్య, బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య వాడివేడిగా మాటల యుద్దం జరిగింది.

హమీదా వర్సెస్ అనిల్ రాథోడ్
నామినేషన్ ప్రక్రియలో భాగంగా అనిల్ రాథోడ్‌ను హమీదా ఖాతూన్ పాయింట్ అవుట్ చేస్తూ.. ఈ వారం నీ గేమ్ కొంచెం తగ్గింది అంటూ ఆరోపణల చేస్తే.. నా గేమ్‌లో ఎంత ఆడాలో అంతే ఆడాను. నా వంతుగా నేను ట్రై చేశాను అని అనిల్ రాథోడ్ సమాధానం చెప్పాడు.

నిన్ను వదలను శివ అంటూ నటరాజ్ మాస్టర్
నీకంటే బెటర్‌గా ఇంటిలో ఉన్నాను అని నటరాజ్ మాస్టర్ అంటే.. నోటికి వచ్చినట్టు మాట్లాడటం లేదు అని యాంకర్ శివ అన్నాడు. దాంతో దొంగ వేషాలు వేయడం మానుకో అంటూ నటరాజ్ మాస్టర్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. దాంతో మంచిగా మాట్లాడంటి. దొంగ వేషాలు కాదు.. గేమ్ అంటూ శివ అంటే.. నీవు గట్టిగా మాట్లాడితే.. అబద్దాలు నిజాలు కావు అంటూ కౌంటర్ ఇచ్చాడు. వాళ్లు చెప్పిన పాయింట్లు.. వీళ్లు చెప్పిన పాయింట్లు అని వేరే వాళ్లు చెప్పినది కాదు.. నీ పాయింట్ చెప్పు అంటే.. అంటే నేను ఏ ప్రూవ్ చేయాలంటే అది చేస్తా అని శివ అంటే.. నిన్ను వదిలిపెట్టను అంటూ నటరాజ్ మాస్టర్ సవాల్ విసిరారు.
ఒరేయ్.. ఒసేయ్ అంటూ బిందు, అఖిల్
ఇక బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య వాగ్వాదం ఊహించని విధంగా జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా అఖిల్ మాట్లాడుతూ.. గతవారం ఏ పాయింట్‌పై నేను నామినేట్ చేశానో అదే.. కొనసాగుతున్నది. నీ అగ్రెసివ్ ఇంకా కొనసాగుతున్నది అని అన్నాడు. అయితే ఫిజికల్‌గా వెళ్దాం అంటూ స్టార్ట్ చేసింది మీరే. నా ఎమోషన్స్‌ను యూజ్ చేసుకొన్నది నువ్వే. అన్ని రకాల యూజ్ చేసుకొంటున్నావు అని బిందు మాధవి అన్నారు. ఒక దశలో బిందు మాధవి స్వరం పెంచి.. ఏయ్ అఖిల్‌గా.. ఏం చెప్పాలిరా? అని అంటే.. ఏయ్ బిందు నీకు ఏం చెప్పాలే అంటూ అఖిల్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు వాగ్వాదం చూసి ఇతర సభ్యులు ముక్కున వేలేసుకొన్నాడు.


Click it and Unblock the Notifications











