కళాకారులకు కష్టాలుంటాయి: బిత్తిరి సత్తి, టీవీ9లో చేరికపై..

వి6 న్యూస్ ఛానల్‌లో ప్రసారం అయ్యే తీన్మార్ వార్తలు కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ తన కామెడీతో సినిమా నటుడిగా ఎదిగారు. టీవీ షోలలో, ఆడియో వేడుకల్లో సందడి చేస్తూ తనదైన హాస్యంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. న్యూస్ ఛానల్‌లో తన జాబ్ కంటిన్యూ చేస్తూనే 'తుపాకి రాముడు' అనే సినిమాలో నటించారు. పలు చిత్రాల్లో హాస్య నటుడిగా అలరించాడు. అయితే సత్తి ఇపుడు వి6 ఛానల్ నుంచి టివి9 ఛానల్‌కు వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఈ విషయమై అభిమానుల్లో అపోహలను తొలగిస్తూ బిత్తిరి సత్తి ఓ వీడియో విడుదల చేశారు.

కొత్త జర్నీ మొదలైంది

కొత్త జర్నీ మొదలైంది

కొత్త జర్నీ మొదలైంది, ఇంతకాలం నన్ను ఆదరించారు, ఇకపై కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇపుడు నేను టీవీ 9 ఛానల్‌లో జాయిన్ అయ్యాను. అఫీషియల్‌గా ఆగస్టు 30 నుంచి ఇక్కడ నా జర్నీ మొదలవుతుంది. ఇకపై మిమ్మల్ని సరికొత్తగా అలరించే ప్రయత్నం చేస్తాను అని బిత్తిరి సత్తి తెలిపారు.

టీవీ9లో చేరడానికి కారణం

టీవీ9లో చేరడానికి కారణం

ఇంతకు ముందు పని చేసిన వి6 ఛానల్‌లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ స్టెప్ తీసుకోవడాన్ని మీరు ఏదైనా అనుకోవచ్చు... ఉద్యోగస్తులకు అయితే పదోన్నతి, ఏ హీరో అయినా ఒకే సినిమా కాకుండా డిఫరెంట్ సినిమాలు చేయాలనుకుంటాడు. అలాగే నేను కొత్త జర్నీ మొదలు పెట్టాను.

పరస్పర సహకారంతో...

పరస్పర సహకారంతో...

నేను ఇంతకు ముందు పని చేసిన ఛానల్ వారు ‘తుపాకి రాముడు' సినిమా చేసుకునే వెసులుబాటు కల్పించారు. నేను కూడా ఆ ఛానల్ ప్రోగ్రాం హిట్టవ్వడానికి నా వంతు ఎఫర్ట్ పెట్టాను. పరస్పర సహకారంతో నాలుగన్నరేళ్ల నా జర్నీ చాలా బాగా సాగింది.

కళాకారులకు కష్ఠాలు ఉంటాయి

కళాకారులకు కష్ఠాలు ఉంటాయి

కళాకారులు అంటే కష్టాలు ఉంటాయి. ఎప్పుడూ కష్టాన్ని చూపకుండా కామెడీని మాత్రమే చూపించాలనుకుంటాను కాబట్టి ఎవరు ఏమన్నా మీరు ఇచ్చిన స్థానాన్ని గౌరవిస్తాను. ఆ స్థానం ఎంతో గొప్పది. దాన్ని పదికాలాల పాటు కాపాడుకోవాలి. మీ ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తున్నాను.

ఇకపై కొత్తగా కనిపిస్తా

ఇకపై కొత్తగా కనిపిస్తా

విభిన్నమైన ప్రయోగాలు చేయాలనే టీవీ9 వారితో ముందుకు వెళుతున్నాను. కొత్త స్లాంగ్, కొత్త లాంగ్వేజ్ ప్రయోగం చేయడానికి అవకాశం ఉంది. చివరగా చెప్పేది ఒకటే.. మిమ్మల్ని అలరించడానికి మీ కోసం వెరైటీలు ట్రై చేస్తూనే ఉంటాను అని బిత్తిరి సత్తి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X