బిత్తిరి సత్తి కొత్త ప్రయాణం .. ఆ మీడియా సంస్థలోనూ అదే యాస అవే సెటైర్స్!
బిత్తిరి సత్తి అనే పేరు వినని, తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. తెలంగాణ యాసతోనే ఫేమస్ అయినా ఏపీలోనూ బిత్తిరి సత్తికి చాలా క్రేజ్ ఉంది. బిత్తిరి సత్తి అసలు పేరు రవి కుమార్. అయితే ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. బిత్తిరి సత్తిగానే బుల్లితెరపై, వెండితెరపై నవ్వులు పూయించాడు.
న్యూస్ ఛానెల్స్‌లో కొత్త ఒరవడికి, తెలంగాణ యాసకు ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చాడు బిత్తిరి సత్తి. అయితే మొదటగా వీ6 ఛానెల్‌లో పని చేసిన బిత్తిరి సత్తి ఆపై టీవీ9ను ఆశ్రయించాడు.అయితే తాజాగా అక్కడి నుంచీ మకాం మార్చేశాడు. తాజాగా మరో మీడియా సంస్థలోకి సత్తి ఎంట్రీ ఇచ్చాడు. అసలు బిత్తిరి సత్తి కథ ఏంటో ఓసారి చూద్దాం.

తీన్మార్ వార్తలతో ఫేమస్..
వీ6 ఛానెల్‌లో వచ్చే తీన్మార్ వార్తలు తెలంగాణలో ఎంతో ఫేమస్. ప్రతీ ఇంట్లో తీన్మార్ వార్తలు మోగాల్సిందే. అందులో వచ్చే సావిత్రి, బిత్తిరి సత్తి ప్రతీ ఇంట్లో మనుషుల్లా దగ్గరయ్యారు. అయితే బిగ్ బాస్ కోసం సావిత్రి (శివ జ్యోతి) ఆ చానెల్ నుంచి బయటకు రాగా.. జీతం వంటి వగైరా కారణాలతో బిత్తిరి సత్తికూడా బయటకు వచ్చాడు.

వెండితెరపై వెలుగులు..
బిత్తిరి సత్తి అలా తెలంగాణ యాసలో చెప్పే వార్తలు అతడిని వెండితెర వరకు తీసుకెళ్లాయి. హ్యాస్య ప్రధానమైన ప్రాతలే కాకుండా హీరోగానే ఎదిగాడు. అయితే తుపాకీ రాముడుతో హీరోగా వచ్చినా అంతగా క్లిక్ కాలేదు. కానీ బిత్తిరి సత్తి హవా మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక వీ6 నుంచి టీవీ9లోకి వెళ్లి ఇస్మార్ట్ సత్తిగా రూపాంతరం చెందాడు.

విబేధాలతో బయటకు..
అయితే గతేడాది వీ6కు రాజీనామా చేసిన సత్తి.. టీవీ9లో చేరాడు. అయితే బిత్తిరి సత్తి చేసిన ఇస్మార్ట్ ప్రోగ్రామ్‌కు అంతగా రేటింగ్స్ రాకపోవడం, ఆ మధ్య ఓ స్క్రిప్ట్‌లో యాజమాన్యంతో విబేధాలు రావడంతో బయటకు వచ్చాడని టాక్. అయితే బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు వచ్చి ఎటువైపు ప్రయాణం కొనసాగిస్తాడని కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి.

బిగ్‌బాస్ కోసమే..
బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు రావడంతో బిగ్ బాస్ షోలో పాల్గొన బోతోన్నాడనే రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సాక్షి మీడియా సంస్థలో బిత్తిరి సత్తి చేరాడు. అక్కడా తనదైన శైలిలో ఓ సెటైరికల్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేయబోతోన్నారట.
Recommended Video

తెలంగాణ యాసతో..
తీన్మార్, దరువు, దేత్తడి వంటి తెలంగాణ యాసతో కూడుకున్న ప్రోగ్సామే అయా ఛానెళ్ల టీఆర్పీని అంతో ఇంతో కాపాడుతున్నాయి. అయితే ఇలాంటి ఓ ప్రోగ్రామ్‌పై సాక్షి కన్నేసినట్టు తెలుస్తోంది. అందుకే బిత్తిరి సత్తిని తమ సంస్థలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మరి ఈ సారి సత్తి ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











