రూటు మార్చిన బిత్తిరి సత్తి.. టాప్ యాంకర్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్ అంటూ..

ఇటీవల కాలంలో ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కాస్త క్లిక్ అయినా కూడా ఊహించని స్థాయిలో ఆదాయం లభిస్తూ ఉంటుంది. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన బిత్తిరి సత్తి ఏ విధంగా క్లిక్కయ్యాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మీడియా న్యూస్ ఛానల్ లో సరదాగా వార్తలు చెబుతూ ప్రేక్షకులకు దగ్గరైన అతను ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగుపెట్టాడు. ఇక ప్రస్తుతం అతను కొత్త దారిలో ఆదాయాన్ని భారీ స్థాయిలో అందుకుంటున్నాడు. పెద్ద దర్శకులు హీరోలు కూడా ప్రస్తుతం బిత్తిరి సత్తి తో సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇక సుమ కంటే ఎక్కువ ఆదాయం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట అలా మంచి క్రేజ్

మొదట అలా మంచి క్రేజ్

బిత్తిరి సత్తి అనగానే అందరికీ కూడా తీన్మార్ వార్తలు గుర్తొస్తూ ఉంటాయి అప్పట్లో కేవలం బిత్తిరి సత్తి కోసమే ఆ వార్తలు ఎక్కువగా చూసేవారు. అతను తన బాడీ లాంగ్వేజ్తో తెలంగాణ సరదా యాసతో అన్ని వర్గాల వారికి దగ్గరయ్యాడు. ముఖ్యంగా గ్రామాల్లో కూడా అతనికి మంచి క్రేజ్ దక్కింది. దీంతో అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. అతని అసలు పేరు రవికుమార్. చేవెళ్ళ ప్రాంతంకు చెందిన అలా సాదారణ రైతు కుటుంబంలో జన్మించాడు.

మల్టీ టాలెంటెడ్

మల్టీ టాలెంటెడ్

టెలివిజన్ రంగంలోనే కాకుండా సినిమాల్లో కూడా మెల్లగా బిత్తిరిసత్తి మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అతను గతంలో లీడ్ రోల్స్ లో కూడా కొన్ని సినిమాలు చేశాడు. పూర్తిగా తెలంగాణ యాసలో పట్టు సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుతున్న బిత్తిరి సత్తి సింగింగ్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటాడు. అతను పాడిన కొన్ని పాటలు కూడా యూట్యూబ్ లో మంచి వ్యూవ్స్ అందుకున్నాయి. మిమిక్రి కూడా అద్భుతంగా చేయగలడు.

భారీగా ఆదాయం

భారీగా ఆదాయం

ఇక బిత్తిరి సత్తి మీడియా న్యూస్ ఛానల్ లో డిమాండ్ను బట్టి మారుతూ వస్తున్నాడు. ప్రస్తుతం నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.. అతను మొదట పని చేసిన మీడియా న్యూస్ ఛానల్ లో వేలల్లో జీతం అందుకున్న బిత్తిరి సత్తి ఆ తర్వాత మరో ప్రముఖ న్యూస్ ఛానల్ లో నాలుగు లక్షల వరకు ఆదాయంని అందుకున్నాడు. తర్వాత ప్రైవేట్ యాడ్స్ కోసం కూడా అతను ఒక రోజుకు ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు అయితే వినిపించింది.

RRR ఇంటర్వ్యూ ద్వారా..

RRR ఇంటర్వ్యూ ద్వారా..

అయితే బిత్తిరి సత్తి ఇప్పుడు సరికొత్త ఫార్మాట్లో ముందుకు వెళుతున్నాడు. అతను ఇదివరకు ఒక న్యూస్ ఛానల్ లో పెద్ద సినిమాలకు సంబంధించిన స్టార్స్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడంతో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. సత్తి ప్రతి సినిమా ఇంటర్వ్యూకు కూడా మంచి క్రేజ్ అందుతుంది. ముఖ్యంగా ఇటీవల RRR సినిమా ఇంటర్వ్యూ కూడా క్లిక్ అయ్యింది. అందులో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తో బిత్తిరి సత్తి అల్లరి మామూలుగా లేదు.

సుమ కంటే ఎక్కువగా?

సుమ కంటే ఎక్కువగా?

అయితే టెలివిజన్ రంగంలో అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటున్న వారిలో యాంకర్ సుమ ఒకరు. ఆమె ప్రత్యేకంగా సినిమా ఇంటర్వ్యూల కోసం లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు స్టార్స్ తో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ కూడా రెగ్యులర్ గా మారిపోయింది. ఇక ఆ ఇంటర్వ్యూల కోసం సత్తి సుమ కంటే ఎక్కువ స్థాయిలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X