బిగ్ బాస్ 4: బిత్తిరి సత్తికి భారీ ఆఫర్.. శ్రీముఖి కంటే ఎక్కువే.. ఆ డబ్బు చూసే టెంప్టింగ్?
బిగ్ బాస్ 4 కోసం ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ వర్క్ అయితే గట్టిగానే జరుగుతోంది. బుల్లితెర సీరియల్ షూటింగ్స్ చాలా వరకు ఆగిపోయిన్నప్పటికి కొన్ని రియాలిటీ షోలు మాత్రం పాత పద్ధతిలోనే కంటిన్యూ అవుతున్నాయి. అసలు కరోనా గోల లేకపోయి ఉంటే ఈపాటికే బిగ్ బాస్ 4పై ఒక అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చేది. నాలుగవ సీజన్ లో స్టార్ సెలబ్రెటీస్ ని దింపనున్నట్లు తెలుస్తోంది. వారికి సాలీడ్ రెమ్యునరేషన్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
Recommended Video

బిగ్ బాస్ 4కి భారీ క్రేజ్..
గడిచిన మూడు సీజన్స్ అయితే తెలుగులో బిగ్ బాస్ షోకి ఆడియెన్స్ గట్టిగానే ఉన్నారని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అందుకే సిజం 3 ఎండ్ అవ్వగానే స్టార్ మా నిర్వహకులు బిగ్ బాస్ 4వ సిజన్ కోసం ముందు నుంచే ఆలోచించడం స్టార్ట్ చేశారు. గత కొన్ని నెలల నుంచే బిగ్ బాస్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

టార్గెట్ స్టార్ సెలబ్రెటీస్..
ఇక గత నెల రోజుల నుంచి రియాలిటీ షోకి సంబంధించిన ప్లాన్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ కరోనా సమయంలో బిగ్ బాస్ 4ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. జనాలు చాలా వరకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి తప్పకుండా షో గత 3 సీజన్స్ కంటే సీజన్ 4 ఎక్కువ స్థాయిలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే స్టార్ సెలబ్రెటీస్ ని హౌజ్ లోకి లాగాలని చూస్తున్నారు.

అందుకే ఆ రాజీనామా..
ప్రస్తుతం తీన్మార్ న్యూస్ ఫేమ్ బిత్తిరి సత్తి బిగ్ బాస్ 4కి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. అయితే ఇస్మార్ట్ న్యూస్ లో రెగ్యులర్ కనిపిస్తున్న సత్తి ఇక నుంచి కనిపించడని టీవీ9 న్యూస్ ఛానెల్ కి రాజీనామా చేశాడని వార్తలు వచ్చాయి. రాజీనామా చేసిన మాట వాస్తవమే అయినా సత్తి బిగ్ బాస్ ఎంట్రీపై ఇంకా అసలు క్లారిటీ రాలేదు.

బిత్తిరి సత్తికి భారీ ఆఫర్..
అయితే సత్తిని ఎలాగైనా బిగ్ బాస్ 4కోసం హౌజ్ లోకి రప్పించాలని గత ఏడాది నుంచే నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఒక భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో కమెడియన్ టెంప్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. సీజన్ 4లో ఉంటే మొత్తంగా కోటిన్నర వరకు ఇస్తామని చెప్పారట.

శ్రీ ముఖి కంటే ఎక్కువే..
1కోటి 50లక్షలకు పైగా పేమెంట్ అంటే.. ఆ ఆఫర్ శ్రీముఖికి ఇచ్చిన దానికంటే కంటే ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే సీజన్ 3 అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్నది శ్రీముఖినే. మొదట శ్రేముఖి కూడా బిగ్ బాస్ చేయలేనని చెప్పింది. కానీ బారి రెమ్యునరేషన్ ఆఫర్ చెయడంతో చివరికి ఒప్పేసుకుంది. ఇక బిత్తిరి సత్తిని కూడా నిర్వహకులు అలానే లైన్ లోకి తెస్తున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











