twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ లో రవి రచ్చ.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్న బీజేపీ ఎమ్మెల్యే.. కమీషన్లు తీసుకునే అంటూ సంచలనం!

    |

    బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో నుంచి 12 మంది కంటెస్టెంట్ లు బయటకు వచ్చారు. మొత్తం 19 మందితో షో ప్రారంభం కాగా ప్రస్తుతానికి ఏడుగురు సభ్యులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అయితే మొన్న ఆదివారం నాడు బయటకు వచ్చిన యాంకర్ రవి ఎలిమినేషన్ మీద అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. త్వరలో బిగ్ బాస్ షో మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వివరాల్లోకి వెళితే

    రవి ఎలిమినేట్ అవడంతో

    రవి ఎలిమినేట్ అవడంతో

    బిగ్ బాస్ టీవీ షో యొక్క ఐదవ సీజన్ 19 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైంది, అందులో యాంకర్ రవి మాత్రమే అత్యంత ఫేమస్ అయిన వ్యక్తి . రవి తన కెరీర్‌ను టెలివిజన్‌లో చిట్-చాట్ షో 'సమ్‌థింగ్ స్పెషల్' హోస్ట్‌గా ప్రారంభించారు. తరువాత, ఈవెంట్‌లకి హోస్ట్‌గా మారి ఫిల్మ్ సర్కిల్స్‌లో మంచి పేరు సంపాదించాడు. టాలీవుడ్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకునే టీవీ హోస్ట్‌లలో ఆయన ఒకరు.

    ఎవరూ ఊహించని విధంగా

    ఎవరూ ఊహించని విధంగా

    కానీ, 12వ వారంలో టీవీ షో నుంచి ఎలిమినేట్ కావడం నిర్వాహకులు అనుసరిస్తున్న ఓటింగ్ విధానంపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ 12వ వారం ఎలిమినేషన్ లో ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే రవి తెలంగాణ వాడు కావడంతోనే అతనిని అకారణంగా ఎలిమినేట్ చేశారు అంటూ తెలంగాణ జాగృతి అనే సంస్థ ఆదివారం రాత్రి నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట ధర్నాకు దిగారు.

    రాజా సింగ్ ఫైర్

    రాజా సింగ్ ఫైర్

    ఈ విషయం మీద అప్పటికప్పుడు పోలీసులు సమాచారం అందుకుని ఆ ప్రదేశానికి వెళ్లడంతో వాళ్లను చెదరగొట్టారు. ఈ అంశం హాట్ టాపిక్ గా మారడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ తెలుగు షోపై తెలంగాణ బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు . హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఈ షోను వెంటనే నిషేధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. " బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో మాకు తెలియదు . యాంకర్ రవి విషయంలో ఏం జరిగిందో షో ప్రొడ్యూసర్స్ వెల్లడించాలనీ ఆయన అన్నారు.

    టెలికాస్ట్ కంటే ముందే సెన్సార్

    టెలికాస్ట్ కంటే ముందే సెన్సార్

    శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్రా తెలంగాణ విభేదాలు తీసుకురావాలని చూస్తున్నారన్నారు ఆయన అన్నారు. అందుకే ఈ షోను వెంటనే నిషేధించాలి' అని రాజా సింగ్ డిమాండ్ చేశారు. "పిల్లలు , మహిళలు ఈ షోను చూడలేరు, అలా ఉంటుంది ఈ షో కంటెంట్, అందుకే టెలికాస్ట్ కంటే ముందే సెన్సార్ చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాదు షోను బ్యాన్ చేయాలని త్వరలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తాను'' అని ఎమ్మెల్యే హెచ్చరించారు.

    Recommended Video

    83 Movie Trailer Review | TeamIndia Obstacles In Kapil Dev's Era || Filmibeat Telugu
    కమీషన్లు తీసుకుని

    కమీషన్లు తీసుకుని

    ప్రతి భాషలో బిగ్ బాస్ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటుందన్న ఆయన ఈ సీజన్‌లో తెలుగులో కాస్త ప్రశాంతంగా ఉంది కానీ ఇప్పుడే రచ్చ మొదలైందన్నారు. ఇక సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోలో హిందువుల మనోభావాలను కించపరిచారని, వ్యాపారం ముసుగులో ప్రాంతీయ అసమానతలకు తెరతీస్తున్నారని ఆయన మండి పడ్డారు. కమీషన్లు తీసుకుని అధికారులు షోలకు అనుమతి ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజసింగ్ విమర్శించారు.

    English summary
    bjp mla Raja Singh to complain Central Government about bigg Boss Telugu 5.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X