Bigg Boss Telugu: అమర్‌దీప్ పెద్ద వెదవ.. ఈ సీజన్ విన్నర్ అతడే.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్లు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పదకొండు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 12వ వారంలోనూ యమా హాటుగా నడుస్తోంది. అయితే మొదటి వారంలోనే ఎంట్రీ ఇచ్చిన సీరియల్ హీరో అమర్ దీప్.. ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తాడని.. అంతా అనుకున్నారు. కానీ మొదటి వారంలోనే ఆయన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పడడం ఆయనకు చాలా మైనస్ గా మారింది. బయట విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అలాగే తన తోటి సీరియల్ నటులు శోభాశెట్టి, ప్రియాంక జైన్ లతో కలిసి అమర్ దీప్ గేమ్ ఆడటాన్ని కూడా ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఈక్రమంలోనే విపరీతంగా ట్రోల్స్ చేశారు.
అయితే అమర్ దీప్ కుటుంబంతో పాటు ఆయనకు మరీ క్లోజ్ గా ఉన్న కొంతమంది తప్ప అందరూ ఆయన్ను నెగిటివ్ గానే చూశారు. ఆయనపై వచ్చిన నెగిటివిటీని పోగెట్టేందుకు అమర్ దీప్ భార్య తేజూతో పాటు ఆయన తల్లి చాలానే ప్రయత్నాలు చేశారు. అలాగే అమర్ దీప్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన, గత సీజన్లలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన అరియానా గ్లోరీ కూడా అమర్ దీప్ అండగా ఉంది. ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఆయన మనస్తత్వం గురించి వివరించే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఏముందో మనం ఇప్పుడు చూద్దాం.

తాజాగా ఓ వీడియో చేసిన అరియానా గ్లోరీ.. అమర్ దీప్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా అమర్ దీప్ ఓ వెదవ.. పెద్ద వెదవ అంటూ వివరించింది. అందుకు గల కారణాలు కూడి తెలిపింది. అమర్ దీప్ ఎవర్ని పడితే వాళ్లను నమ్ముతాడని అందుకే అతను వెదవ అంటూ చెప్పుకొచ్చింది. ఫ్రెండ్ షిప్ కు మంచి వాల్యూ ఇస్తాడని.. కానీ తను వాళ్లను బాగా నమ్మాని.. అప్పుడే వాళ్లకోసం ఏదైనా చేస్తాడని వివరించింది. తన దగ్గర డబ్బులు లేని సమయంలో అంటే 2015కు ముందు అమర్ దీప్ తన స్నేహితుడిగా చాలా సాయం చేశాడని స్పష్టం చేసింది. అడక్కముందే సాయం చేయడంలో అమర్ దీప్ ఎప్పుడూ ముందు ఉంటాడని పేర్కొంది.

అలాగే అమర్ దీప్ పెళ్లికి తన ఇంట్లో ఎవరూ ఆడ పిల్లలు లేకపోతే.. తనను తీసుకెళ్లి ఆమె తన చెల్లి అని చెప్పాడని వెల్లడించింది. తమ మధ్య ఉన్న స్నేహబంధం చాలా గొప్పదని.. వాడి ఫ్రెండ్ షిప్ అర్థం కావడనికి కాస్త టైం పడుతుందని కూడా చెప్పింది. అలాగే మొదట్లో అమర్ దీప్ అసలు ఆట ఆడినట్లే తనకు అనిపించలేదని అరియానా గ్లోరీ తెలిపింది. అంతా విన్నర్ గా నిలుస్తారని భావించిన కొంత మంది ఇప్పడు ఏం గేమ్ ఆడట్లేదని.. కానీ అమర్ దీప్ చాలా చక్కగా ఆడుతున్నాడని పేర్కొంది.

అమర్ దీప్ ఆట చూస్తుంటే కచ్చితంగా వాడు ఈ సీజన్ టైటిల్ కొడతాడని అనిపిస్తోందని.. తన దృష్టిలో ఈ సీజన్ విన్నర్ అమర్ దీప్ యేనని వెల్లడించింది. నేనెలాగు గెలవలేకపోయాను.. కానీ నా ఫ్రెండ్ గెలిస్తే అయినా తాను గెలిచినట్లు ఫీలవుతానని కూడా అరియానా చెప్పుకొచ్చింది. మరి మీకేమనిస్తోందో కామెంట్ల రూపంలో చెప్పేసేయండి.


Click it and Unblock the Notifications











