జెమినీ టీవీలో ‘బోల్ బేబీ బోల్’

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సారథ్యం వహిస్తున్న ఈ కార్యక్రమంలో...షకలక బేబీ అంటూ, నేపాడితే లోకమే ఆడదా అని సంగీత ప్రియులను మంత్ర ముగ్దుల్ని చేసిన వసుంధరాదాస్ తొలిసారిగా జడ్జిగా వ్యవహరిస్తుండగా... వర్ధమాన సంగీత దర్శకుడు, గాయకుడు హేమచంద్ర, వర్ధమాన గాయని శ్రావణ భార్గవి యాంకరింగ్ చేస్తున్నారు.
పలువరు టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ సారథ్యంలో 14 సంవత్సరాల లోపు ఆణిముత్యాల్లాంటి చిన్నారులతో ఇంటిల్లిపాదినీ ఆకట్టుకునేలా బోల్ బేబీ బోల్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసారు. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ప్రతి ఎపిసోడ్ లో రసవత్తరమైన పోటీ, ప్రతి ఏపిసోడ్ కీ లక్ష రూపాయల ఫ్రైజ్ మనీ అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కోకిలని మరిపించే అఖిల, సంగీతంలో చిచ్చర పిడుగు శ్రీలలిత, పాటతో కట్టిపడేసే ప్రవస్తి, అందరినీ మెప్పించే షణ్ముక్, ప్రత్యూష, ప్రతీక్, సాయిదేవ హర్ష, సింధూజ ఇలా అంతా పోటాపోటీగా పాడే చిన్నారులతో బుల్లితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని నిర్వాహకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











