twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి తర్వాత కూడా సీక్రెట్స్‌గా బాయ్‌ఫ్రెండ్స్‌తో.. అలాంటి చెడ్డపని చేయట్లేదుగా: బిగ్‌బాస్ బ్యూటీ

    |

    సినిమా ఇండస్ట్రీలో సినీ తారల జీవితాలు కొన్నిసార్లు ఎవరికి అర్థం కానివి. ముఖ్యంగా వారి వైవాహిక జీవితంలో ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. అందుకే మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ఇకపోతే ఒక బుల్లితెర బ్యూటీ ఇటీవల ఎఫైర్స్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు ఒక్కప్పుడు హిందీ సీరియల్స్ తో క్రేజ్ అందుకొని బిగ్ బాస్ 4 విన్నర్ గా నిలిచిన శ్వేతా తివారి.

     బిజీ లైఫ్..

    బిజీ లైఫ్..

    ఒకప్పుడు శ్వేతా తివారి సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉండేది. ఆమె నటించిన కసౌటి జిందాకి కే సీరియల్ అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఏడేళ్లు కొనసాగిన ఆ సీరియల్ లో శ్వేతా ప్రధాన పాత్రలో నటించింది. ఆ ఒక్క సీరియల్ తో ఈ బ్యూటీ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. చాలా వరకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక మంచి ఆఫర్స్ ని వదిలేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాల్లో కూడా ముఖ్య పాత్రల్లో నటించింది.

     ప్రేమ వ్యవహారాలు..

    ప్రేమ వ్యవహారాలు..

    బుల్లితెర నటిమణులపై కూడా రూమర్స్ వస్తాయని శ్వేతా తివారి వల్లే బాలీవుడ్ జనాలకు అర్ధమయ్యింది. ఆమె జీవితంలో లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. పెళ్లి చేసుకొని ఇద్దరితో విడాకులు కూడా తీసుకుంది. దీంతో ఆమె పర్సనల్ లైఫ్ పై నార్త్ మీడియా అప్పట్లో స్పెషల్ ఫోకస్ చేసింది. ఇక రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ పెద్దగా పట్టించుకునేది కాదు.

    షాకింగ్ కామెంట్స్..

    షాకింగ్ కామెంట్స్..

    ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేతా తివారి తనపై మారోసారి రూమర్స్ వస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అవును ఇద్దరిని పెళ్లి చేసుకొని విడిపోయాను. చట్ట ప్రకారమే విడాకులు తీసుకున్నాను. ఇప్పుడు నాకు నచ్చినట్లుగా నా లైఫ్ ని కొనసాగిస్తున్నాను. చాలా మంది పెళ్లి చేసుకొని కూడా సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతారు. అలాంటి చెడ్డ పనులు నేను చేయలేదు కదా' అంటూ శ్వేతా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.

    Recommended Video

    Irrfan Khan To Act Prabhas And Nag Ashwin's Movie But We Missed Him In Second Telugu Movie
    ఆ ఇద్దరితో బ్రేకప్..

    ఆ ఇద్దరితో బ్రేకప్..

    శ్వేతా తివారి బిగ్ బాస్ (2010-11) సీజన్ లో 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని విన్నర్ గా నిలిచింది. 1998లో టెలివిజన్ యాక్టర్ ని పెళ్లి చేసుకున్న శ్వేతా తొమ్మిదేళ్లకె అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తరువాత అభినవ్ కోహ్లీ అనే యువకుడితో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న శ్వేతా అతనికి కూడా ఐదేళ్లకే గుడ్ బాయ్ చెప్పేసింది. ఆ ఇద్దరితో విడిపోయిన తరువాత 39ఏళ్ళ ఈ నటీమణి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు రాగా అందులో ఎలాంటి నిజం లేదని ఈ సీనియర్ నటి క్లారిటీ ఇచ్చింది.

    English summary
    The lives of movie stars in the film industry are sometimes meaningless. There will be unexpected twists, especially in their marital life. That is why it is a hot topic in the media. If not, some comments about a recent beauty are going viral. Shweta Tiwari, who was once a Big Boss 4 winner, was once a craze with Hindi serials.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X