బిగ్‌బాస్ షోకు షాక్.. నెల రోజులపాటు వాయిదా.. కారణాలు అవేనంటూ..

బిగ్‌బాస్ రియాల్టీ షోల ప్రారంభానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే పలు భాషల్లో ప్రారంభం కానున్న ఈ షోను కరోనా వైరస్ పరిస్థితులు వెంటాడుతున్నాయి. అయితే తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ హిందీ బిగ్‌బాస్‌ షోకు మాత్రం చుక్కెదురు అయినట్టు సమాచారం. అయితే ఈ షోను నెల రోజుల పాటు వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ షోను ఎందుకు వాయిదా వేశారనే విషయంపై రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఆ రూమర్లు ఏమిటంటే..

11వ సారి హోస్ట్‌గా సల్మాన్ ఖాన్

11వ సారి హోస్ట్‌గా సల్మాన్ ఖాన్

దేశంలోనే తొలిసారి బిగ్‌బాస్ షోను ప్రవేశపెట్టింది హిందీ భాషలోనే. ఈ షోకు సల్మాన్ ఖాన్ అత్యధికంగా అంటే 10 సార్లు హోస్ట్‌గా వ్యవహరించారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఈ షోకు 11వ సారి హోస్ట్‌గా మారేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు లాక్‌డౌన్‌ కాలంలో తన ఫాంహౌస్ పన్వేల్‌లో ప్రోమోలు కూడా షూట్ చేశారు.

నెలరోజులపాటు వాయిదా

నెలరోజులపాటు వాయిదా

సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 14వ షోను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ షోను అనూహ్యంగా నెలరోజులపాటు వాయిదా వేయాలని ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. ఈ షోను అక్టోబర్ మొదటి వారంలో ప్రసారం చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది.

క్వారంటైన్‌కు కంటెస్టెంట్ల తరలింపు

క్వారంటైన్‌కు కంటెస్టెంట్ల తరలింపు

కరోనా, పరిస్థితులు, లాక్‌డౌన్ కొనసాగుతున్నందున బిగ్‌బాస్ కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. దాదాపు క్వారంటైన్ సెంటర్‌లో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోను కొద్ది రోజులు వాయిదా వేసినందున సెలబ్రటీల తరలింపును కూడా వాయిదా వేసినట్టు సమాచారం.

 ముంబైలో భారీ వర్షాల కారణంగా

ముంబైలో భారీ వర్షాల కారణంగా

బిగ్‌బాస్ 14 షోకు ముంబైలో ఇటీవల కురిసిన భారీ వర్షాలే కారణమని తెలుస్తున్నది. గతవారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో సెట్ పనులు ఆగిపోవడం, కొన్ని చోట్ల సెట్ డామేజ్ కావడంతో షోను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. అంతసవ్యంగా సాగితే అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపించింది.

 బిగ్‌బాస్‌పై సుశాంత్ ఎఫెక్ట్

బిగ్‌బాస్‌పై సుశాంత్ ఎఫెక్ట్


అయితే బిగ్‌బాస్ 14 వాయిదా వేయడానికి మరో కారణం కూడా ముంబై మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. సుశాంత్ మరణం కేసులో పలు అనుమానాలు రేకెత్తడంతో సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర నటులు, అగ్ర సంస్థలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోపై సుశాంత్ ప్రభావం పడే అవకాశం ఉందనే కారణంతో వాయిదా వేసినట్టు ఓ వర్గం వెల్లడిస్తున్నది. సుశాంత్ సెంటిమెంట్ ఉత్తరాదిలో బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో సల్మాన్ షోకు చుక్కెదురు కావడం ఖాయమనే వాదన వినిపిస్తున్నది.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
 సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో

సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో

ఇప్పటికే బాలీవుడ్‌లో సుశాంత్ సెంటిమెంట్ తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. సడక్ 2 ట్రైలర్‌పై నెటిజన్లు, సినీ ప్రేక్షకులు చూపించిన తడాఖాతో భారీగానే దెబ్బ పడింది. అలాగే ఇషాన్ కట్టర్, అనన్యపాండే నటించిన ఖాళీపీలీ ట్రైలర్ ఇటీవల రిలీజైంది. అయితే ఈ ట్రైలర్‌ను కూడా నెపోటిజం కిడ్స్ అంటూ డిస్‌లైక్ కొడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన కరణ్ జోహర్ చిత్రం గుంజన్ సక్సేనా చిత్రంపై కూడా సుశాంత్ అభిమానులు భారీగా ట్రోల్ చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరో నెల తర్వాత సుశాంత్ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి షో ప్రారంభించే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X