అప్పుడు వైఎస్ జగన్.. ఇప్పుడు చిరంజీవి.. ‘బొమ్మ అదిరింది’లో నాగబాబు రచ్చ!
బొమ్మ అదిరింది షో పెట్టిన వివాదం అందరికీ తెలిసిందే. అదిరింది షోకు మార్పులు చేర్పులు చేర్చి బొమ్మ అదిరిందిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో యాంకర్లను, జడ్జ్‌లను మార్చేశారు. రవి, భాను శ్రీలకు బదులుగా శ్రీముఖిని, నవదీప్ ప్లేస్‌లో జానీ మాస్టర్‌ను, అలీ, సుమ ఇలా కొంతమందిని తీసుకొచ్చి స్పెషల్‌గా అట్రాక్ట్ చేశారు. మొదటి ఎపిసోడ్ దుమ్ములేచిపోవాలని అంతా ప్లాన్ చేశారు. అయితే వారు అనుకున్న దాని కంటే వంద రెట్లు ఫేమస్ అయింది.

వైఎస్ జగన్ స్కిట్..
గల్లీ బాయ్స్, ఎక్స్‌ప్రెస్ హరి టీం కలిలి చేసిన స్కిట్ ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. రియాజ్ అనే పొట్టి వ్యక్తి వైఎస్ జగన్ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేశాడు. అలా చేయడంతో బొమ్మ అదిరింది దెబ్బ బ్లాక్ బస్టర్ అయింది. వైఎస్ జగన్ అభిమానులు స్కిట్ మీద, నవ్విన నాగబాబు, షో నిర్వాహకుల మీద ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

సారీ చెప్పినా..
వైఎస్ జగన్ మీద అలా స్కిట్ చేసినందుకు రియాజ్ సారీ చెప్పాడు. ఇలాంటి ఇంకోసారి రిపీట్ చేయం.. మొదటి పొరపాటుగా క్షమించండని హరి కూడా వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఇక నాగబాబుపై వైఎస్ జగన్ ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో మెగా బ్రదర్ సెటైర్ల మీద సెటైర్లు వేస్తూనే వచ్చాడు.

జీ తెలుగు యాజమాన్యం..
అయితే బొమ్మ అదిరింది వివాదం ఏపీలో సంచలనంగా మారడంతో ప్రభుత్వానికి దాదాపు 40 అంబులెన్స్‌లను, పీపీఈ కిట్లను విరాళంగా ఇచ్చింది. ఇది చానెల్‌కు జరిగిన నష్టానికి ప్యాచప్ వర్క్ లాంటిది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగబాబు లాంటి వారిని జీ యాజమాన్యం ప్రోత్సహించొద్దని కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా అలా..
ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్లు చేస్తున్నా మెగా బ్రదర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సింహాసనంపై కుక్క, వెంట్రుక కూడా పీకలేరు, గాంధీ 2.ఓ అంటూ సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. అయితే వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో చిరంజీవిని ఇమిటేట్ చేసేలా ఓ స్కిట్ ప్లాన్ చేశారు.
Recommended Video

కబడ్డీ ఆడిన చిరు..
మామూలుగా అయితే నాగబాబు ముందు మెగా హీరోలను బ్యాడ్‌గా ఇమిటేట్ చేసే స్కిట్స్ వేయరు. కానీ ఈసారి మాత్రం చిరంజీవి మ్యానరిజాన్ని వాడుతూ కబడ్డీ స్కిట్ చేశారు. ఇందులో ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గెటప్‌లో వచ్చారు. ఆ తరువాత సద్దాం చిరంజీవి ఖైదీ గెటప్‌లో వచ్చి పోలీస్ స్టేషన్ ఫైట్‌ను కబడ్డీలో వాడేశాడు. దీంతో నాగబాబు పగలబడి నవ్వేశాడు. మొత్తానికి ఇదంతా కామెడీ కోసమే, నవ్వించేందుకే చేస్తున్నామని చెప్పకనే చెప్పేశారు.


Click it and Unblock the Notifications











